షార్ట్‌గా స్మార్ట్‌గా ఓ లుక్కేసెయ్యండి - ..

short flim trend

సినీ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూడటమంటే తలపండిపోవాల్సిందే. ఎంతో అనుభవం లభిస్తే తప్ప సినీ రంగంలో ఛాన్స్‌ దక్కించుకోవడం కష్టం. టెక్నికల్‌ వింగ్‌లో అవకాశాలు దక్కడం అంత వీజీ కాదు. దానికోసం ఎన్నో ఏళ్ళు శ్రమపడాలి. అంత శ్రమపడితేనే సినీ రంగంలో అవకాశం దక్కించుకోవడం, ఆ రంగంలో రాణించడం జరుగుతుంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట. యంగ్‌ జనరేషన్‌ ఇప్పుడు సినీ రంగాన్ని శాసిస్తోంది. దానికి 'షార్ట్‌' కట్‌ కూడా ఉంది. అదే షార్ట్‌ ఫిలింస్‌ ట్రెండ్‌. చేతిలో ఓ చిన్న కెమెరా, బుర్రలో కాస్తంత టాలెంట్‌, తోడుగా నలుగురు స్నేహితులు. అంతే షార్ట్‌ ఫిలిం రెడీ అయిపోతోంది. పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేకుండా షార్ట్‌ ఫిలింస్‌ రూపొందుతున్నాయి. షార్ట్‌ ఫిలింస్‌ మాత్రమే కాదు, పాటలు, కామెడీ స్కిట్స్‌, ఇంకా చాలా చాలానే యువతకు అందుబాటులో ఉంటుండడం అభినందించదగ్గ అంశం. తమ ఆలోచనలకు పదును పెట్టడానికి 'షార్ట్‌' అనేది చక్కటి అవకాశంగా మారిపోయింది. ఇంటర్నెట్‌ విప్లవం ద్వారా షార్ట్‌ ఫిలిం ట్రెండ్‌ జోరందుకుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

చదువుకుంటూ సంపాదించుకోవచ్చు. చదువుకుంటూనే తమ ఆలోచనలకి పదును పెట్టొచ్చు. చదువుకుంటూనే జీవితంపై ఖచ్చితమైన అవగాహనలతో అత్యద్భుతంగా భవిష్యత్‌ని డిజైన్‌ చేసుకోవచ్చు. ఈ అవకాశాల్ని కల్పిస్తోంది స్మార్ట్‌ అండ్‌ షార్ట్‌ ఫిలిం మేకింగ్‌. దీనికి పెద్దగా శిక్షణ కూడా అవసరం లేదు. జస్ట్‌ మన ఆలోచనల్లో కొత్తదనం ఉంటే సరిపోతుందంతే. షార్ట్‌ ఫిలిం ఎలా తీయాలన్న విషయమై పూర్తి సమాచారం ఇంటర్నెట్‌లో లభించేస్తోంది. ఇంకో వైపున వీటి కోసం ట్రైనింగ్‌ సెంటర్లు కూడా వెలుస్తున్నాయి. దాంతో యువత వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హాట్‌ కంటెంట్‌తో ఉన్న షార్ట్‌ ఫిలింస్‌, కామెడీ నేపథ్యంలో సాగే షార్ట్‌ ఫిలింస్‌ మాత్రమే కాకుండా, లవ్‌, సామాజిక నేపథ్యం వంటివాటికీ డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. తక్కువ ఖర్చు, తక్కువ సమయం వీటికి ప్రధాన అడ్వాంటేజ్‌. వీటిల్లో రాణిస్తే షార్ట్‌ ఫిలింస్‌ నుంచి మెయిన్‌ స్ట్రీమ్‌ సినీ రంగంలోకి ప్రమోట్‌ అవడం పెద్ద కష్టమేమీ కాదు. అలా సక్సెస్‌ అయినవారు సినీ రంగంలో ఎందరో కన్పిస్తారు. దీనికి లక్‌తో సంబంధం లేదు, టాలెంట్‌ ఉండాలంటే. టాలెంట్‌ ఉంటే స్మార్ట్‌ అండ్‌ షార్ట్‌ ఫిలిం మేకింగ్‌లో మీకు ఎదురే లేదిక.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు