
అమ్మ అనే పదంలోనే అమృతం ఉంది....అమ్మలోనే గురువు దైవం అందరూ ఉన్నారు....అమ్మలోని గొప్పదనం ఎన్నిసార్లు పొగిడినా తనివి తీరదు....ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు.....అందరం అమ్మ చేతి ఆసరాతో అడుగులు నేర్చుకున్న వాళ్ళం..... ఆసరాగా చేయందించి అడుగులు నేర్పిన అమ్మకు మలిదశలో ఎంతమంది ఆసరాగా నిలుస్తున్నారు? ఈ లఘు చిత్రం చూసిన వాళ్ళెవరైనా తప్పక ఆత్మావలోకనం చేసుకోవాల్సిందే....ఎలాంటి సంభాషణలు లేకుండా అతి తక్కువ వ్యవధిలో రూపొందించిన ఈ " ఓన్లి మాం " షార్ట్ ఫిల్మ్ అన్ని షార్ట్ ఫిలింస్ లా లవ్, యూత్ సబ్జెక్ట్ కాకుండా అమ్మప్రేమను చూపించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం...మీరూ చూసి ఆనందించండి...