రావి చెట్టు మహాత్మ్యం - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు.

banyan tree importence

అశ్వత్థః సర్వవృక్షాణాం

దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః ||

తా:- నేను చెట్లన్నిటియందును రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునీంద్రుడను అయియున్నాను.

వ్యాఖ్య:- ‘అశ్వత్థః సర్వవృక్షాణామ్’ చెట్లన్నిటియందును రావిచెట్టు చాల శ్రేష్ఠమై, పవిత్రమైయున్నది. పురాణములలో దీనిమహిమనుగూర్చి విశేషించి చెప్పబడినది. * వృక్షములలో  అశ్వత్థవృక్షము తానని శ్రీకృష్ణపరమాత్మ చెప్పుటవలన ఆ వృక్షము సాక్షాద్భగవన్నిలయమే యని స్పష్టమగుచున్నది. కనుకనే జనులద్దానికి ప్రదక్షిణ, పూజాదులను గావించుచుందురు. ఔషధదృష్టియందును రావిచెట్టునకు గొప్ప ప్రాముఖ్యతకలదు.

(1) మూలే విష్ణుః స్థితో నిత్యం స్కన్దే కేశవ ఏవచ, నారాయణస్తు శాఖాసు పత్రేషు భగవాన్హరిః.
(2)ఫలేచ్యుతో న సందేహః సర్వదేవైః సమన్వితః
(3) స ఏవ విష్ణుర్ద్రుమ ఏవ  మూర్తో మహాత్మభిః సేవితపుణ్యమూలః,యస్యాశ్రయః పాపసహస్రహన్తా భవేన్నృణాం కామదుఘోగుణాఢ్యః.

తా:- రావిచెట్టుయొక్క మూలమందు విష్ణువు, బోదెయందు కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, ఫలములందు అచ్యుతుడు, సమస్తదేవతలతో గూడి విరాజిల్లుచుందురు. ఈ విషయమున సందేహములేదు. ఇది సాక్షాత్ ఆకారమును ధరించివచ్చిన విష్ణువే అయియున్నది. దీనిమూలమును మహనీయులు సేవించుచుందురు. దీని నాశ్రయించువారియొక్క పాపజాలమునంతను అది నశింపజేయును. మఱియు నిది మనుజుల కోరికలను నెరవేర్చునదియు, సద్గుణములను, పుణ్యములను ఒసంగునదియు అయియున్నది.

కావున రావిచెట్టు కు ప్రతి నిత్యం మన శక్తి మేర ప్రదక్షిణలు చేయడం వలన సకల దేవుళ్ళ కు ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగును.
" సర్వేజనా స్సుఖినో భవంతు. స్వస్తిః "

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి