నిజంగా సేవే చేస్తున్నారా? - ..

help full centers

సేవ ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. పదిమందికి సేవ చేయడం ఓ భాగ్యం. కష్టాలో ఉన్నవాడిని ఆదుకోవడమే సేవ. 'సేవాభావం' పేరుతో ఎన్నెన్నో సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో సేవా సంస్థలున్నాయి దేశవ్యాప్తంగా. సేవ భారతీయుల రక్తంలోనే ఉంది. అది మన ధర్మంగా భావించే సంప్రదాయ భారతదేశం మనది. అందుకే నేటి యువతరం కూడా సేవాభావం అనగానే రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తుంటుంది. తమ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాల కోసం వినియోగించే యువత సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం అభినందనీయమే. అత్యున్నత స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా, రోడ్ల పక్కన పేద చిన్నారులకు చదువు చెప్పే మహానుభావుల గురించి వింటున్నాం. అలాగే తమ జీవితాన్ని పూర్తిగా సేవకే అంకితం చేసిన మహానుభావుల్ని కూడా చూస్తున్నాం. అందరికీ ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం కుదరకపోవచ్చు. అందుకే, తమకు తెలిసిన సేవా సంస్థల ద్వారా తమకు చేతనైనంత సాయం చేయడానికి ముందుకొస్తోంది నేటి యువతరం. అయితే ఇక్కడా కొన్ని సమస్యలున్నాయి. సేవ పేరుతో అక్రమార్జనకు అలవాటుపడ్డ సేవా సంస్థల బాగోతాలు వెలుగు చూస్తుండడం శోచనీయం. ఇటువంటి సంస్థల కారణంగా నిజమైన సేవా సంస్థలపైనా నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. 

ఏదన్నా సేవా సంస్థ స్థాపించాలనుకున్నా, అందులో చేరాలన్నా చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. అందులో ముఖ్యమైనది, ఆ సంస్థకి తాము నిత్యం కాకపోయినా, అప్పుడప్పుడూ అయినా అందుబాటులో ఉండగలమా? లేదా? అని. సంస్థ కార్యకలాపాలపై ఖచ్చితమైన నిఘా పెట్టగలిగితేనే ఆ సంస్థలో చేరాలి. లేదంటే, తర్వాత తలెత్తే పరిస్థితులకు సంస్థలోని సభ్యుడిగా మీరూ బాధ్యత వహించక తప్పదు. సంస్థలో చెడ్డవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని తొలగించడం ఎలా? అన్నదానిపైనా సంస్థలో తీర్మానాలు చేసేలా ముందే మీ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేయడం మంచిది. సంస్థ ఆర్థిక కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా ముఖ్యమే. మీ జేబులోని డబ్బు తీసి ఖర్చు చేసేసి ఊరుకుంటే సరిపోదు. సంస్థ నుంచి చేసే ఖర్చుకి సంబంధించి ప్రతి పైసా లెక్క చెప్పాల్సిన పరిస్థితి రావొచ్చు. యువత అంటే ఉడుకురక్తం కదా, ఇలాంటి విషయాలేవీ ముందుగా ఆలోచించరు. అందుకే, సేవా సంస్థల పట్ల అప్రమత్తంగానే కాదు, బాధ్యతగా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. సేవ పరమ పరవిత్రమైనదైనప్పటికీ, సేవ పేరుతో సంస్థలు నడిపేవారంతా పరమ పవిత్రులు కాకపోవచ్చు. అందుకే, ఉద్దేశ్యం మంచిదే అయినా ఏదన్నా సంస్థ తరఫున నిలబడాల్సి వచ్చినప్పుడు ఆ రంగానికి సంబంధించి మీకు తెలిసినవారిలో సన్నిహితులెవరైనా ఉంటే మంచి చెడ్డలు తెలుసుకోవడం ఉత్తమం.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు