బాబోయ్ ఎండలు - మానస

summer tips

రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  కాలం గడిచేకొద్దీ సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో మాత్రం ఉండేది కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలైపోతొంది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద ఉంచండి. ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం.. అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బుపడుతూ వుంటారు. అలా కాకుండా వేసవి సెలవులు ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అయితే, ఎండాకాలం పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ముందు చూడాలి.

జాగ్రత్తలు :

- బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా వుటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ.
- పిల్లల చర్మం వైశాల్యం ఎక్కువగా వుండటం వల్ల వారి వంట్లో నీరు వేగంగా ఆవిరై పోవచ్చు. అలా కూడా వారికి వడదెబ్బ తగలవచ్చు.
- నీళ్ళు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలు ఎండల్లో తొందరగా నీరసించిపోతారు. ఆరుబయట ఎండలో ఎక్కువసేపు తిరిగినా, ఆడినా చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారు. తలనొప్పి కూడా రావచ్చు.
- ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.మీరు ఎండలో ఎక్కువ సేపు గడపాల్సి వస్తే మాత్రం ఈ జాగ్రత్తలని పాటించండి.
ఎక్కువగా చెమట పట్టే వాళ్లు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి.
– స్నానం చేసేటప్పుడు తేమ కలిగిన సబ్బులకు బదులుగా సాధారణ సబ్బులను ఉపయోగించాలి. వేప ఔషధాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తే చెమట దుర్వాసనను మాయం చేయవచ్చు.
– ఎండాకాలంలో సింథటిక్‌ వస్త్రాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. కాటన్‌ దుస్తులను ధరించడం వల్ల కొంతవరకు చెమటను అరికట్టవచ్చు.
– తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం, మసాలాలను వీలైనంత వరకు తగ్గించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది.
– పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
– వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, దప్పికను తీర్చుకోవడానికి మజ్జిగను అధికంగా తాగాలి.
– వేసవిలో వాతావరణానికి తగిన పండ్లను తినాలి.
– కాఫీ, కోలా డ్రింక్స్‌, బ్లాక్‌ టీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎక్కువగా ఉప్పు, కారం ఉన్న కూరలు అధిక చెమటకు కారకాలు. కాబట్టి వీటికి దూరంగా ఉండడం వల్ల చెమట బారి నుంచి బయటపడొచ్చు.
– నీరు ఎక్కువగా తాగడం వల్ల హైడ్రేషన్‌ క్రమంగా జరుగుతుంది. దానివల్ల శరీరం వేడెక్కకపోవడంతోపాటు చెమట పట్టదు.
– ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మంచిది. అంతేగాకా చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల వేసవికాలం వంటకాల్లో ఎక్కువగా ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం మంచిది.

మరిన్ని వ్యాసాలు