గాడ్జెట్‌ గురూ! ఒళ్లు గుళ్ల చేస్తోంది గురూ! - ..

gadget guru

మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ వచ్చిందంటే చాలు అది మన చేతిలో ఉండాల్సిందే అని భావిస్తున్నారు ప్రస్తుతం జనం. ఇది కేవలం యూత్‌కి సంబంధించిందే కాదు. అన్ని వయసుల వారు భావించే భావనే. కొత్త ఫోన్‌ తీసుకోవడం అది రెండు మూడు నెలల్లోనే మళ్లీ పాతదైపోవడం మళ్లీ కొత్త ఫీచర్స్‌ ఉన్న ఫోన్‌ మార్కెట్లోకి రావడం ఈ ఫోన్‌ మార్చి అది తీసుకోవడం.. ఈ పరిస్థితి నానాటికీ పెరిగిపోతోంది. స్మార్ట్‌ ఫోన్లే కాదు. అన్ని ఎలక్ట్రానిక్‌ ఏక్‌సెస్‌రీస్‌కీ ఇది వర్తిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ టీవీ, స్మార్ట్‌ వాచెస్‌ అన్నీ ఈ కోవలోకి వచ్చేస్తున్నాయి. టెక్నాలజీ విషయంలో అప్‌డేట్‌గా ఉండాలనే తపనే ఈ పరిస్థితికి కారణమవుతోంది. అప్‌డేట్‌గా ఉండడం తప్పుకాదు. కానీ అనర్ధాలకు కొని తెచ్చుకోకుండా ఉండాలి. స్మార్ట్‌ గాడ్జెట్స్‌తో వచ్చే రేడియేషన్‌ ప్రాబ్లమ్‌ అంతా ఇంతా కాదు. చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ వాడకం మాత్రం తగ్గడం లేదు. అన్ని అనారోగ్య పరిస్థితులకు ఈ స్మార్ట్‌ ప్రపంచమే ప్రధమ కారణం అవుతోందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ జనంలో ఏ మాత్రం అవేర్‌నెస్‌ రావడం లేదు. గాడ్జెట్స్‌ వాడకంలో పడి అనారోగ్య పరిస్థితుల్ని కూడా చాలా లైట్‌ తీసుకుంటున్నారు. లాభ నష్టాల అవసరాన్ని గుర్తించే ఆలోచనే చేయడం లేదు.

మా వాడి వయసు ఏడాదే. కానీ స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేసేస్తాడు తెలుసా! నెట్‌ ఆన్‌ చేసి వాడికి కావల్సినవన్నీ డౌన్‌లోడ్‌ చేసేస్తాడు.. ఎప్పుడూ నెట్‌ ముందే కూర్చుంటాడు.. అని తల్లి తండ్రులు ఏడాది నుండి రెండేళ్ల వయసు పిల్లల కోసం చెప్పుకునే గొప్పలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇది వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఆ వయసు పిల్లాడి మీద స్మార్ట్‌ ఫోన్‌ ప్రభావం ఆ రేంజ్‌లో ఉంటే.. ఒక వయసు వచ్చేటప్పటికీ ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఏంటి అనేది మాత్రం తల్లితండ్రులు గుర్తించలేకపోవడం బాధాకరం. స్మార్ట్‌ గాడ్జెట్స్‌ విషయంలో వయసుతో సంబంధం లేదు.. ప్లేస్‌తో అంతకన్నా సంబంధం లేదు. బాత్రూమ్‌లో, బెడ్‌ రూమ్‌లో, ఇంటా, బయటా ఎక్కడైనా నో వే.. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌..అంతే. మానసికంగా మనిషి ఎక్కడికి పోతున్నాడో తెలీడం లేదు.

తమ వద్దకు వచ్చే మానసిక వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువ శాతం మంది స్మార్ట్‌ ఫోన్స్‌ వాడకం వల్ల బాధపడుతున్నావారే అంటున్నారు మానసిక నిపుణులు. ఆ తర్వాత ఎక్కువ శాతం కంటి వైద్య నిపుణులు. చాలా చిన్న వయసులోనే కంటి సమస్యలతో బాధపడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధమ కారణం స్మార్ట్‌ గాడ్జెట్స్‌తో ఎక్కువ సమయం గడపడమే కారణం. అంతేకాదు మానసిక ఒత్తిడే కానీ, ఈ స్మార్ట్‌ గాడ్జెట్స్‌ వల్ల శారీరక శ్రమ ఉండకపోవడం మరో తీవ్ర సమస్యగా మారింది. ఊబకాయం తదితర శారీరక సమస్యలు వీటి వల్ల తీవ్రతరమౌతున్నాయి.
స్మార్ట్‌ గాడ్జెట్స్‌ స్మార్ట్‌గా వాడండి. అంతవరకూ సమస్యలేం ఉండవు. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు కదా. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. వాడకం విషయంలో టేక్‌ లిటిల్‌ కేర్‌. ఆరోగ్యంతోనే కదా అంతా. ఆరోగ్యంత ర్వాతే కదా ఏదైనా. అందుకే తస్మాత్‌ జాగ్రత్త! 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి