కుల వాదం - -

Caste History

తెలుగు వారికి సినిమా కబుర్లన్నా, రాజకీయ చర్చలన్నా పిచ్చి ఎక్కువని పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా తెలుసు..బయటికి చెప్పుకోరు కానీ వీళ్ళకి ఇష్టమైంది మరోటి ఉంది..'కుల వాదం'...

చాతుర్వర్ణ సిధ్ధాంతం లొ విష్ణువు నోటి నుంచి బ్రాహ్మలు (మంత్ర పఠనం, విద్యా బోధన ప్రధానం కనుక), క్షత్రియులు భుజాల నుంచి (భుజ బలం ప్రధానం కనుక), వైశ్యులు ఊరువుల నుంచి (వ్యవస్థ బలంగా ఆర్ధిక పరిపుష్టితో నిలబడాలంటే తొడల్లొ బలం ఉండాలి కనుక), శూద్రులు పాదాల నుంచి (వ్యవస్థ ముందుకు నడవాలంటే పాదాలే ప్రధానం కనుక) ఉద్భవించారని చెబుతారు...ఇక్కడ ఒకటి గమనించాలి...హిందూ ధర్మంలో పెద్దలకి నమస్కరించేటప్పుడు పాద నమస్కారం చేస్తాం కాని నొటికో, భుజాలకో, తొడలకో నమస్కరించం..అంటే హిందూ ధర్మం శూద్ర కులాలకి ఇచ్చే గౌరవం అది..

పూర్వం రాజాస్థానాల్లో తాటి కమ్మల మీద పురాణ ఇతిహాసాలు, రాజు గారి శాసనాలు, మొదలైనవి వ్రాయడానికి లేఖరులని నియమించే వారు..దస్తూరి బాగుండి, భాష మీద పట్టు ఉండాలి ఆ వృత్తికి...ఆ రోజుల్లో విద్య బ్రాహ్మలకే ఎక్కువుగా ఉండేది కనుక వాళ్ళే రాజాస్థానాల్లో లేఖరులుగా చేరారు..తాటి కమ్మలపై వ్రాసేవారు కనుక వారిని కమ్మ లేఖరులు అనేవారట...కాల క్రమంలో వారినే కమ్మలు అని కూడా అనేవారు... రాజులతో నిత్యం ఉండడం వల్ల క్రమంగా వారు రాచరిక పట్లు తెలుసుకుని రాను రాను రాజుల ఆహార అలవాట్లు పొంది, రాచరిక సుఖాలు మరిగి, రాజకీయం వంటబట్టించుని ఇప్పుడు ఆ కమ్మలే రాజ్యాలేలుతున్నారని ఒకాయన చెప్పాడు.

నిజానికి బ్రాహ్మలకి, కమ్మలకి చాలా ఇంటిపేర్లు కలుస్తాయి...మొక్కపాటి, ముళ్ళపూడి, గుమ్మడి, కావూరి ఇలా చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి...ఒక ఇంటిపేరు వేరు వేరు కులాల్లో ఉండడం సహజమే అయినా కమ్మలకి, బ్రాహ్మలకి ఇంటి పేరులు ఒకటే ఉండడం చాలా ఎక్కువే..ప్రస్తుతం ఆంధ్ర దేశంలో ఉన్న చాలామంది కమ్మ కులం వారు బ్రాహ్మల నుంచి వచ్చారన్న వాదానికి ఇదొక నిదర్శనం అనుకున్నా మళ్ళీ గోత్రాల దగ్గరికి వచ్చేసరికి చాలా తేడాలు ఉన్నాయి.

ఇక రెడ్లు ఎవరు, కాపులు ఎవరు అని అడిగితే ఇద్దరూ ఒకటే..వ్యవసాయం ప్రధాన వృత్తి..కొన్ని ప్రాంతాల్లో రెడ్లు గాను, ఇంకొన్ని ప్రాంతాల్లో కాపులుగాను, కాపునాయుళ్ళు గానూ చలామణీ అవుతున్నారు..ఇంతకీ ఏతావాతా చెప్పేదేమిటంటే కులాలు ఎన్ని ఉన్నా అన్నీ ప్రాంతీయంగానో, రాజకీయంగానో, సామాజికంగానో ఎర్పడినవే తప్ప ఇంకోటి కాదు. స్థూలంగా అందరిదీ  ఒక్కటే జాతి..తెలుగు జాతి.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి