చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaram

ఈ రోజుల్లో నడకొచ్చి, మాటొచ్చిన ప్రతీ ప్రాణి చేతిలోనూ స్మార్ట్ ఫోనో లేక టివీ రిమొట్టో కనిపిస్తాయి. కానీ కొన్ని దశాబ్దాల క్రితం అంటే 70 వ దశకం దాకా,   ప్రతీదానికీ ఏదో ఒకటనేవారు. పెద్దాళ్ళు అదీ "అమ్మ" లు కబుర్లు చెప్పుకునేటప్పుడు, ఆటలకి పంపేసేవారు. వాళ్ళు చెప్పుకునే కబుర్లేవో వినాలని ఈ చిన్నపిల్లలకి ఆత్రుత, వాళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు మధ్యలో ఏమైనా ప్రశ్నలేసి ఇరుకులో పెడతారేమో అని భయం కావొచ్చు, లేదా ఆ particular topic గురించి మనకు తెలియచేసే టైము రాలేదనుకోవచ్చు, ఏదో ఒకటీ, చిన్నపిల్లలకి తెలియకూడదూ అంతే... దానితో ఆరోజుల్లో ప్రతీదీ mystery గానే మిగిలిపోయింది ! అలాగని అడిగినా తప్పే మళ్ళీ- " పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటీ వెధవ ప్రశ్నలూ నువ్వూనూ.." అంటూ కసిరిపారేసేవారు.మరి వాళ్ళకి అసలు అలాటి విషయాలెప్పుడు తెలిశాయిట అనే ప్రశ్నుండేది కాదు.వాళ్ళకెప్పుడు తెలిస్తే నీకెందుకూ, నువ్వుమాత్రం నోరుమూసుక్కూర్చో..అలా ప్రతీ విషయంలోనూ ఎన్నెన్నో inhibitions.తోటే చిన్నతనమంతా గడచిపోయింది.వాటన్నిటినీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది.అలా పెరిగాము కదా అని ఏమీ regret ఏమీ లేదండోయ్.ఆ కాలమానపరిస్థితులకి అలాగే బావుండేది.

కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా, మెల్లిమెల్లిగా ప్రతీ రంగంలోనూ ఓ "పారదర్శకత"( transperency) లాటిది  మొదలయింది. గుర్తుండే ఉంటుంది,  సినిమాల్లో చూపించేవారు హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా ప్రేమ, అనురాగం లాటివి వస్తే అదేదో "పక్షుల్ని" దగ్గర చేర్చడమూ, ఆ "తరువాతి" కార్యక్రమం కోసం ఓ పువ్వూ, దానిమీద ఓ తుమ్మెదా etc.etc.. కాలక్రమేణా హీరో హీరోయిన్లని ఇంకొంచం దగ్గరగా తీసికొచ్చి తరువాతిది.. leave it to our imagination.. తరువాత్తరువాత బ్లూ ఫిల్ములకీ సినిమాలకీ తేడాయే లేదనుకోండి.. all in the name of entertainment.

ఇంక పుస్తకాల విషయంలోకూడా అలాగే ఉండేది. కిళ్ళీకొట్లలో వేల్లాడతీసి పెట్టేవారు "కొన్ని" genre పుస్తకాలు, అసలు అలాటివాటివైపు చూస్తేనే పాపమేమో అనే అభిప్రాయంతో పెరిగాము. కానీ మగాడన్నా, ఆడపిల్లన్నా అవేవో harmonal changes అనేవుంటాయి కదా, ఆడపిల్ల " పెద్దమనిషి" అయేటప్పటికి అప్పటిదాకా ఆ లొకాలిటీ లో ఉండే అందరు పిల్లలతో ఆడుకునే ఆ పిల్లకి ఓ పరికిణీ, ఓణీ వేసేయడం, ఆ పిల్లేమో ఎవరిని చూసినా పమిట సద్దుకోడం...లాటివి మొదలయ్యేది. ఇంక మగపిల్లాడు, ఇంట్లోవాళ్ళకి కనిపించకుండా, ఆ "కిళ్ళీకొట్టు పుస్తకాలు" తన నోట్సుల్లో దాచేసి తెచ్చుకోడమూ, ఎవరూ చూడకుండా చదివి చొంగ కార్చుకోడమూనూ. ఎందుకంటే అలాటి పుస్తకాలు ఏక్ దం taboo. మరి వీటినే inhibitions అంటారు.కానీ రోజులు గడిచేకొద్దీ వాటిల్లోనూ మార్పులొచ్చాయి. ఆరోజుల్లో "చలం" గారి పుస్తకాలు చదివినా, చూసినా డొక్క చించేసేవారు. ఓహో ఆ చలంగారు వ్రాసేవన్నీ "బూతు" పుస్తకాలేమో అనే ఓ దురభిప్రాయంతోనే పెరిగాము. అలాగే "కొవ్వలి" వారివీనూ.

అదే కాకుండా అమ్మలు ఏ పేరంటానికైనా వెళ్ళినప్పుడు తన పిల్లాడిని తీసికెళ్ళిందనుకోండి, వాడిని " కోతిపేరంటాలు" అని ఏడిపించేవారు. దానితో ఓహో.. మొగాళ్ళు పేరంటాలకి కానీ, ఆడవారి functions కి కానీ వెళ్ళకూడదన్నమాట అనే ఓ inhibition ఏర్పడిపోయేది.మరి ఈరోజుల్లో అలా జరగాలంటే కుదురుతుందా, ఇంటికో భార్యా భర్తా ఓ పిల్లో పిల్లాడో ఉండే రోజుల్లో,"ఫలానా పని నేను చేయకూడదూ, నా చిన్నప్పుడు చెయ్యనిచ్చేదికాదూ మా అమ్మా.." అంటే కుదురుతుందా. ఏ శ్రావణమంగళవారం పేరంటమో చేస్తే, నచ్చినా నచ్చకపోయినా శలవు పెట్టుకుని, శనగలూ, తాంబూలాలూ ప్లేట్లలో సద్దే కుర్రాళ్ళని చూస్తూంటాము. అయినా ఈరోజుల్లో నోములూ, వ్రతాలూ ఎవరు చేస్తున్నారులెండి అనకండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇంకా మన ఇళ్ళల్లో ఆచారాలూ, వ్యవహారాలూ ఇంకా బ్రష్టు పడిపోలేదు.

అంత దాకా ఎందుకూ మా ఇంటావిడ ఇప్పటికీ ఛస్తే కేక్కు తినదు, దాంట్లో ఎగ్ వేస్తారని! ఇంకో చిత్రం spring onion అని ఈరోజుల్లో మార్కెట్ లో దొరికేవాటిని తన చిన్నప్పుడు "ఉల్లికోళ్ళు" అనేవారుట, అదేదో మాంసాహారమనే భావంతో ఇంట్లోకి కూడా తేనిచ్చేది కాదు. పైగా పిల్లలతో, "మనము అలాటివి వండుకోమమ్మా.." అని కూడా చెప్పేది ! నిజమే కాబోసనుకునేవారు మా పిల్లలు. మార్కెట్ లో దొరికే స్వీట్లమీద అద్దుతారే సిల్వర్ ఫాయిల్, దాన్ని అదేదో జంతువు పేగులతో తయారు చేస్తారని ఎక్కడో చదివిందిట, బస్.. అలాటి స్వీట్స్ కి lifelong ban.. !

ఇవన్నీ "ఆ కాలం" నాటివాళ్ళకనుకోండి. ఇప్పుడు inhibitionసూ లెవూ, సింగినాదమూ లేదూ. ఏం కావలిసొస్తే దాన్ని నెట్ లో వెదుక్కోడమూ, పైగా తలితండ్రులకే కొన్నిటిని నేర్పడమూ. సేఫ్ పీరియడ్ అంటే, తల్లితండ్రులకంటే పిల్లలకే ఎక్కువ తెలిసే కాలం ఇది. టివీలలో కార్యక్రమాలూ అలాగే ఉన్నాయనుకోండి.సినిమాలకి సంబంధించినంతవరకూ ఏదో నామ్ కే వాస్తే ఓ సెన్సార్ బోర్డూ, ఓ సర్టిఫికేట్టూనూ.

మన తెలుగు వార పత్రికలతో పాటు కొన్ని “ఉచితాలు” కూడా ఇస్తూంటారు. ఉదాహరణకి ఏ “ Shmpoo “ sachet లాటిదో, లేకపోతే ఏ మసాలా పొడి లాటిదో … ఆ మధ్య ఓ పత్రికతో "whisper ఈ సంచికతో ఉచితం" అని వ్రాసుందికదా అని, ఇమ్మన్నాను.దానికి ఆ కొట్టబ్బాయి అన్నాడూ, " అడగడానికి సిగ్గుపడుతున్నారూ అందుకని అడిగినవారికే ఇస్తున్నానూ..". "నాయనా ఇప్పుడు ఇలాటివి నాకేమీ అవసరం లేదూ, కానీ ఓ కూతురూ, కోడలూ, ఇద్దరు మనవరాళ్ళూ ఉన్నప్పుడు ఇలాటివాటి అవసరాలుంటాయి కదా.." అనేసి తీసికుంటూంటే పక్కనే ఉన్న ఒకావిడ నవ్వాపుకోలేకపోయారు. " నిజం అంకుల్ ఎంత బాగా చెప్పారూ, అయినా ఈరొజుల్లో ఎవరు సిగ్గుపడుతున్నారులెండి..",మరి అది ప్రశంసో, వెటకారమో తెలియదు. కానీ చిన్నప్పటి inhibitions. లోంచి మాత్రం బయటపడాలి.

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి