బహుముఖ ప్రఙ్ఞాశాలి - భగవాన్ శ్రీ సత్యసాయిబాబా - - ఆదూరి హైమవతి.

sri satya sai baba information

ఇహ స్వామివారు జగద్గురువు. గు కారో అంధకారోస్తు రు కారో తన్నిరోధ కృత్ అంటే అఙ్ఞానమనే  అంధకారాన్ని తొలగించి  ఙ్ఞానజ్యోతిని వెలిగించేది ఒక సద్గురువు  మాత్రమే. స్వామి ఒకానొక సమయంలో నేను సద్గురువునేకాదు –జగద్గురువును కూడా అన్నారు .ఈనాటికీ షుమారు 200 దేశాలవారు స్వామిని జగద్గురువుగా ఆరాధిస్తూ వారు చూపే మార్గంలో పయ నిస్తున్నారు.

అమేరికా భక్తులకు  ఇంగ్లీషులో ఒక లేఖ వ్రాస్తూ  " when I have not created this universe no body asked me who am I -- అనగా "ఈ విశ్వాన్నీ నేను సృష్టించక ముందు ఎవ్వరూ కూడా నే నే వరని నన్నుప్రశ్నించ లేదు.చివరిగా ఒక ఉదంతాన్ని చెప్పుకుందాం.  భారతదేశాన్ని సందర్శించడానికి ఒకసారి కొంతమంది విదేశీయులు వచ్చారు. వారిలో ఒక వనిత కూడా ఉంది.భారతదేశ పర్యటన తర్వాత వారంతా పుట్టపర్తి రావాలని అనుకున్నారుట. ఆవనితకు అది ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వారిమాట కాదనలేక గ్రూపును వదలను ఇష్టంలేక పుట్టపర్తికి వారితోపాటుగా వచ్చింది. కానీ ఆరోజుల్లో పుట్టపర్తి చిన్న కుగ్రామం కావటాన వసతులు,అనుకూలాలూ లేవు.పుట్టపర్తి  లో వీధులు చూసే సరికి అసహ్యించుకుని ఆమె ఎప్పుడు విడచి వెళ్తామాని అనుకోసాగింది. ఐతే కొన్నిరోజులలోనే స్వామి వారు ఆగ్రూపును ఇంటర్ వ్యూకు పిలిచారు.అయిష్టంగానే ఆమె లోపలికి వచ్చింది. గదిలో ఒకమూల నక్కి కూర్చుంది. స్వామి లోపలికి వచ్చారు.

ఆమె ఏవిధమైన ఆసక్తినీ కనపరచలేదు. స్వామి సింహాసనం లో కూర్చున్నారు.  అనువాదకునితో ఆమెవైపు చూపి "ఒక సమయం లో ఆమె నన్ను పిలిచింది కనుక్కో" అన్నారు. ఆమె సమాధానంగా " అది జరుగలేదు. నా జీవితంలో ఇటువంటి వ్యక్తి ని నేనే నాడూ పిలవలేదు." అని అనువాదకునితో చెప్పింది.  స్వామి రెండవసారి అడిగారు. ఆమె అదేసమాధానం చెప్పింది. మూడవసారి "చెప్పు. రెండు సంవత్సరాలక్రితం , నాసహాయం అర్ధించింది." అనిస్వామి అన్నారు. ఆమె "లెక్క ప్రకారం తప్పు" అన్నది. స్వామి" ఆరాత్రి  విపరీతంగా వర్షం కురుస్తున్నది. ఆచెట్టు, ఆవంతెన, ఆకాలువ -- అప్పుడు ఆమె అన్నది --ఎవరూ దిక్కులేని ఆ సమయంలో 'ఓ దేవుడా ఎక్కడున్నావు ' అని అరిచింది." అన్నారు స్వామి.. అప్పుడు ఆమెకు అన్నీ గుర్తుకు వచ్చి స్వామి పాదాలపై బడింది.

ఇదీ స్వామి తత్వం ఎక్కడ అమేరికా? ఎక్కడ వంతెన? ఆమె ఎవరు? ఎవరైనాసరే ఎక్కడైనా సరే "  ఓదేవుడా!"అనగానే స్వామి వస్తారు . ఇది దైవతత్వానికి సంకేతం.

స్వామి అంటారు -- అడవిలోననున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీద నున్న నట్టేట నీవున్న  మరువడు నినుసాయి మదినిఎపుడు  కనుక ఈ బహుముఖ ప్రఙ్ఞాశాలి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను మనం వదలి ఉండగలమా? పాదాలను వదలి పెట్ట గలమా? పట్టగలము కానీ... పాదములు కావవి నాల్గువేదములు స్వామీ!'

వేద వేద్యుడు బ్రహ్మ  వేదనలు బాపంగ
పుట్టపర్తికి వచ్చె పుణ్యులార
సర్వ వ్యాపియు విష్ణు సద్బోధ చేయంగ
ధరణి నవత రించె ధన్యులార
పతిత పావనుడైన పరమేశ్వరుడు తాను
మనిషి రూపము దాల్చె మాన్యులార 
మహలక్షి మాయమ్మ మాతగా వెలసిల్లె
సేవ చేయుడు మానవ శ్రేష్టులార
జన్మ జన్మాల పుణ్యాల జపమువలన   
తెలుసుకున్నాము దేదీప్య దైవశక్తి,
పనికి మాలిన పనులకై పాటుపడక
సార్ధకము చేయుడీ జన్మ సరసులార!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి