కనిపెట్టు అవకాశాలు కొల్లగొట్టు - ..

opportunities hunt

విషయం పాతదే అయినా కొత్తగా చెపితే అది కొత్త విషయమే అదే క్రియేటివిటీ. ఇదివరకటి రోజుల్లో ఆవిష్కరణ అంటే కొత్త విషయాన్ని కనుగొనడం. అప్పటి వరకూ పరిచయం లేని ఓ కొత్తదాన్ని సృష్టించడం. కానీ ఇప్పుడలా కాదు, ఉన్న దాన్నే కొత్తగా చూపించడం కళాత్మకత. ఆ కళాత్మక దృష్టికి చదువుతో పనిలేదు. అనుభవం అంతకన్నా అవసరం లేదు. కేవలం ఒక్క ఆలోచన. ఆ ఆలోచనే ఎన్నో ఇన్‌వెన్షన్స్‌కి పురుడు పోసుకుంటోంది. ఈ క్రియేటివిటీకి వయసుతో కూడా సంబంధం లేదు. ఓన్లీ యూత్‌కే కొత్త ఆలోచనలు వస్తాయి అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే ఈ క్రియేటివిటీకి ఎవ్వరూ అతీతులు కారు. గృహిణులు అయినా, వృద్ధులైనా, ఆఖరికి ఏడాది వయసున్న చిన్న పిల్లలు సైతం ఈ క్రియేటివిటీలో భాగం అయిపోవచ్చు. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్‌ అయ్యింది కూడా. సోషల్‌ మీడియా ఎంతో అందుబాటులో ఉంది. ఇంట్లో కూర్చునే తమ క్రియేటివిటీకి పదును పెట్టొచ్చు. తద్వారా మార్కెటింగ్‌ కూడా చేయొచ్చు.

ఆ రకంగా తమతో పాటు ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించొచ్చు. అమ్మో బిజినెస్సా? దానికి బోలెడంత పెట్టుబడి కావాలి. నా దగ్గర అంత పెట్టుబడి పెట్టే స్తోమత లేదు. సో నేను బిజినెస్‌కి అనర్హున్ని అనుకునే రోజులు మారాయి. ఇప్పుడు బిజినెస్‌ అంటే ఆర్ధం మారిపోయింది. బిజినెస్‌కి కావాల్సింది ధనం పెట్టుబడి కాదు. ఆలోచనే పెట్టుబడి. ఆ ఆలోచన కొంచెం కొత్తగా ఉంటే చాలు. సమాజం దృష్టిని ఆకర్షించొచ్చు. 
చిన్న ఆలోచనే పెద్ద పెట్టుబడి. స్టార్టప్స్‌ పేరుతో గవర్నమెంట్‌ కూడా ఇలాంటి వాటిని బాగా ఎంకరేజ్‌ చేస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ స్టార్టప్‌ సంస్థల ద్వారా. గృహిణులు ఇంట్లో కూర్చునే తమ టాలెంట్‌కి పదును పెట్టి, ఆన్‌ లైన్‌ ద్వారా బిజినెస్‌ చేస్తున్నారు. వీటికి రూపాయి పెట్టుబడి ఉండదు. కేవలం తమ ఆలోచనే పెట్టుబడి. అందుబాటులో ఉన్న వనరులతోనే ఆరంభం చేస్తున్నారు. అలాగే పిల్లల్లో ఊహాజనిత టాలెంట్‌కి కూడా బోలెడంత క్రేజ్‌ ఉంది. వృద్ధులు ఖాళీగా ఉండి కృష్ణా రామా అంటూ తమ శేష జీవితం గడిపేస్తాం అన్నదానిలోంచే ఓ స్టార్టప్‌ స్టార్ట్‌ అవుతోంది. సినిమా టిక్కెట్స్‌ నుండి, వంటకాలు, ఫ్యాషన్‌, డెకరేటింగ్‌ ఐటెమ్స్‌, ఆధ్యాత్మికతను పెంపొందించే అంశాలు, ఒక్కటేమిటీ ఏ ఒక్కటైనా సరే. తాజాగా కేరళకి చెందిన సునీల్‌ అనే వ్యక్తి తన పాత ఆటోని కొత్తగా డెకరేట్‌ చేసిన విధానం చూస్తే మైండ్‌ బ్లోయింగ్‌ అన్పించక మానదు. తన ఆటో బ్యాక్‌ పార్ట్‌ని స్కార్పియోకి బ్యాక్‌ సైడ్‌ ఉండే ఫీచర్స్‌తో డెకరేట్‌ చేశాడు. దాంతో ఆటో వెనక నుండి చూస్తే స్కార్పియో ఫీలింగ్‌ క్రియేట్‌ అయ్యింది. ఆ ఆటోతో రోడ్లపై తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు సునీల్‌. దాంతో ఏకంగా మహేంద్రా స్కార్పియో కంపెనీ వారు ఆ వ్యక్తిని వెతికి పట్టుకుని ఆ క్రియేటివిటీకి హ్యాట్సాప్‌ చెప్పి, తమ కంపెనీ తరపున సుప్రో మినీ వ్యాన్‌ని బహుమతిగా ఇచ్చారు. సునీల్‌ రూపొందించిన ఆటోని తమ కంపెనీ మ్యూజియంలో పెట్టుకుంటామన్నారు. చూశారా! ఓ సామాన్యుడి కొత్త ఆలోచనకి ఎంతటి పాపులారిటీ దక్కిందో! అందరిలోనూ ఇలాంటి సృజనాత్మకత దాగి ఉంటుంది. వెలికి తీసే చిన్న ప్రయత్నం చేయాలి అంతే. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి