కుర్ర'కారు' వేగానికి కళ్ళెం ఎలా? - ..

how to control

ఇండియన్‌ రోడ్లకు అనుగుణంగా తయారుచేసిన చిన్నపాటి కార్లతోనే 'అద్భుతాలు' సృష్టించెయ్యాలనుకుంటోంది నేటి యువత. కారు స్టార్ట్‌ చేశామంటే, రివ్వున దూసుకుపోవాల్సిందే. వాహన గరిష్ట వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు దాటితే, మన దేశంలో తయారయ్యే చాలా వాహనాల్లో చిన్నపాటి 'వైబ్రేషన్‌' కనిపిస్తుంది. అయినా డోన్ట్‌ కేర్‌. వాహనం దూసుకెళ్ళాల్సిందే. ఉడుకురక్తం కదా! వాహన వేగాన్ని అదుపులో ఉంచుకోవాలనుకోరు. కానీ వేగం ఎప్పుడూ ప్రమాదకరమే. ఆ విషయం వారికి తెలియక కాదు, స్పీడ్‌ ఇచ్చే థ్రిల్‌ని ఎంజాయ్‌ చెయ్యాలన్న కోణంలో ప్రమాదాలతో సావాసం చేస్తుంటారు. ఫలితం, ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు కోలుకోలేని నష్టం జరుగుతుంది. ప్రమాదమంటే, ఓ కుటుంబానికి శిక్ష. ఇది నిజం. ఈ వాస్తవాన్ని ప్రచారం చెయ్యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం. ఈ తరహా రోడ్డు ప్రమాదాలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్న విషయాన్ని ఇంకోసారి గుర్తు చేసింది. ప్రధానంగా ఈ తరహా రోడ్డు ప్రమాదాలకు యువతే ఎక్కువగా బలైపోతున్నారు. ఇంకా దురదృష్టమేంటంటే, అన్ని ప్రమాదాల్లోనూ యువత తప్పిదమే కనిపిస్తోంది. అతి వేగమే అన్ని అనర్ధాలకీ కారణం. 'స్పీడ్‌ థ్రిల్స్‌ బట్‌ కిల్స్‌' అని ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వేగ నియంత్రణపై పోలీసులు ఎంతగా చర్యలు తీసుకుంటున్నా, ప్రాణాలతో చెలగాటం మాత్రం యువత ఆపడంలేదు. నిశిత్‌ గతంలో కూడా అత్యంత వేగంతో ఇదే వాహనాన్ని నడిపినట్లు, ఆ వాహనానికి సంబంధించిన 'ట్రాఫిక్‌' రికార్డ్స్‌ చెబుతున్నాయి. అతి వేగం కారణంగా ఆ కారుకి ట్రాఫిక్‌ చలానాలు కూడా విధించారు. పోలీసుల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాల్సిన చోట, 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడమే నిశిత్‌ నారాయణ మృతికి కారణంగా అంచనా వేస్తున్నారు పోలీసు అధికారులు.

చలానాలు, ట్రాఫిక్‌ ప్రమాదాల్ని తగ్గించలేకపోతున్నాయంటే, ఇలాంటి ప్రమాదాల్ని నివారించడానికి ట్రాఫిక్‌ విభాగం పరంగా మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అన్నిటికన్నా ముందుగా విద్యాభ్యాసం మొదలు పెట్టినప్పటినుంచే రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఇంటిలోనూ రోడ్డు ప్రమాదాల కారణంగా తలెత్తే నష్టాల గురించి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అవగాహన కల్పించే పరిస్థితులు రావాలి. ఇవేవీ జరగనప్పుడు, రోడ్డు ప్రమాదాలు యువతను బలిగొంటూనే ఉంటాయి. ఏదేమైనా ప్రపంచం అంచుల్ని చూసేద్దామనే వేగంతో, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్న యువత, తమ ప్రాణం పోతే తమ కుటుంబానికి తీరని విషాదం మిగుల్చుతామని తెలుసుకోకపోవడం శోచనీయం. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి