ఐటీ కొలువులు జారిపోతున్నాగానీ - ..

it jobs

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ - సాఫ్ట్‌వేర్‌ పేరేదైతేనేం నిరుద్యోగ యువతకు ఈ రంగం అతి పెద్ద ఆశాదీపం. లక్షల్లో వేతనం, కుప్పలు తెప్పలుగా అవకాశాలు, విదేశీ సంస్థల నుంచి పిలుపులు - ఆ కిక్కే వేరప్పా! సాఫ్ట్‌వేర్‌ రంగం అంటే, ఆ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే కాదు, ఈ రంగం మీద ఆధారపడి అనేకమంది ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి, కోట్ల మందికి ఈ రంగం కల్పతరువులా మారింది. అయితే అప్పుడప్పుడూ ఈ రంగంలో కుదుపు యువతను తీవ్రమైన భయాందోళనలకు గురిచేస్తూనే వుంది. చాలకాలం తర్వాత మళ్ళీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో 'స్తబ్దత - కుదుపు' చోటుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలోనే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారమ్‌. ఇప్పటికే కొన్ని కంపెనీలు జాగ్రత్తపడి, ముందుగానే 'బరువు దించుకునే' పని ప్రారంభించాయి. అత్యధిక వేతనాలు అందుకుంటున్న 'సీనియర్లకు' చెక్‌ పెట్టడమే కాకుండా, కొత్త ఉద్యోగాలకు కూడా 'బ్రేఖ్‌' వేసేశాయి. దాంతో ఈ రంగంపై ఆశలు పెట్టుకున్న యువత ఒక్కసారిగా తీవ్రమైన నిరాశకు లోనవుతున్నాయి.

ఇంకో వైపున ఈ సంక్షోభం ఎంత కాలం ఉండవచ్చునన్న విషయమై ఈ రంగానికి చెందిన నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రచారం జరుగుతున్నంత తీవ్రమైన సంక్షోభం ఏమీ లేదనీ, ప్రతి యేటా జరిగే తొలగింపుల ప్రక్రియే ఇప్పుడు జరుగుతుంది తప్ప ఐటీ రంగానికి కొత్తగా వచ్చిన సమస్య ఏమీ లేదని కొందరు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ వాదన పట్ల యువతలో కొంత హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, కొత్త కొలువులకు అవకాశం లేదన్న ప్రచారం వారిని తీవ్రంగా కుంగదీస్తోంది. డీగ్రీ పూర్తి చేసినా, ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నా ఆ వెంటనే యువత చూపు సాఫ్ట్‌వేర్‌ రంగం వైపుకే మళ్ళుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల కొరత ఈ రంగంపై ఆశలు పెట్టుకున్నవారికి కంటి మీద కునుకు లేకుండా చేయడం బాధ కలిగించే విషయమే. అయినప్పటికీకూడా ఇలాంటి పరిస్థితుల్లోనూ పాజిటివ్‌ దృక్పథం యువతలో ఉంటే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఐటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. టాలెంట్‌కి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని, అరకొర మేధస్సుతో ఉన్నవారికే సమస్యలని వారు చెబుతుండడం జరుగుతోంది.

ఏదేమైనప్పటికీ ఐటీ రంగానికి సంక్షోభాలు కొత్త కాదు. అలాగే తిరిగి పుంజుకోవడం కూడా ఐటీ రంగానికి అలవాటే. కాబట్టి యువత సానుకూల దృక్పథంతో ఉండి, తమ మేధస్సుకి పదును పెడితే, ఐటీ రంగం ఎప్పుడూ అలాంటివారికి రెడ్‌ కార్పెట్‌ వేస్తూనే ఉంటుంది. ఊహాగానాల్ని నమ్మి భవిష్యత్‌ని నాశనం చేసుకోకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకుంటూనే ఐటీ రంగంపై ఫోకస్‌ పెట్టడం ఉత్తమం.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి