మరోజన్మ లఘుచిత్రం - శ్రీను

Maro Janma Short Film

చిత్రం : మరోజన్మ
నటీనటులు : వినయ్ నల్లకడి , అప్పాజీ అంబరిషా దర్పా  , ప్రణవి,పృధ్వీ రాజ్ , అవంతి
సాంకేతిక వర్గం:

డి.ఓ.పి : పరశురాం
ఎడిటింగ్: ఆకాష్
సంగీతం,గానం : శశాంక్ తిరుపతి
డైరక్టర్: చిలుకూరి ఆకాష్ రెడ్డి

విశ్లేషణ:  డబ్బుకి తప్ప మనిషికి , మనిషి భావోద్వేగాలకు విలువ ఇవ్వని ఒక కోటీశ్వరుడి ఒక రాత్రి ప్రయాణం ఈ కథ. కాంట్రాక్ట్  పని మీద వేరే చోటుకు వెళ్ళడానికి కార్లో స్టార్ట్ అవుతాడు కోటీశ్వరుడు నారాయణ. ఆ కారు మధ్యలో పంక్చర్ అవ్వడం తో టైం లేక ఒక క్యాబ్ ఎక్కుతాడు. ఆ క్యాబ్ డ్రైవర్ చాలా మంచోడు . నారాయణని చూడగానే అతను చాలా ఇండస్ట్రీస్ కి ఓనర్ అని గుర్తించి ఆయనతో మాటలు కలుపుతాడు...
మనిషికి, మనుషుల భావాలకి , బాధలకి విలువనిచ్చే క్యాబ్ డ్రైవర్ కి , డబ్బుతో దేన్నైనా కొనగలను అనుకునే కోటీశ్వరుడు నారాయాణకి మధ్య ఏం జరిగింది? ఎందుకు కోట్ల కాంట్రాక్టుని, ముందే అరేంజ్ చేసుకున్న మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు అన్నది  చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది.

నటీనటులు: అందరూ చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా
1. క్యాబ్ డ్రైవర్
2. నారాయణ
3. ప్రెగ్నెంట్ లేడీ ( కనిపించిన కాస్త టైంలో మంచి నటనతో ఆకట్టుకుంది.)

తను ఏం చెప్పాలి అనుకున్నాడో అది చెప్పకనే చెప్పాడు డైరక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి...
పాటలు, బాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే..
"డబ్బు అవసరం! కాని... మనిషి...నమ్మకం! దయచేసి దాన్ని చంపకండి " ఈ డైలాగ్ చాలు మరో జన్మ గురించి చెప్పడానికి.  మీరు కూడా ఒక లుక్ వేసి లైక్ కొట్టండి.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు