యూత్‌ కడిగి పారేస్తారు జాగ్రత్త! - ..

be care full with youth

కామెడీ పేరుతో నోటికొచ్చిందల్లా మాట్లాడితే, ఆ కామెడీని అప్పటిదాకా ఎంజాయ్‌ చేసే యూత్‌, అందులోని అసందర్భ ప్రేలాపనలపై ఎదురుతిరిగే అవకాశముంది. సాక్ష్యం కావాలా? సోషల్‌ మీడియా దెబ్బకి సీనియర్‌ నటుడు చలపతిరావు బేషరతు క్షమాపణ చెప్పడం కన్నా పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇంకేముంటుంది! సినిమా ఫంక్షన్లలో యాంకర్లు హద్దులు మీరడం సహజమే. అయితే అదంతా ఫన్‌ కోసమేనంటారు యాంకర్లు. నాన్సెన్స్‌, అది ఫన్‌ ఏంటి, బూతు అయితేనూ! అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడటం జరుగుతూనే ఉంది. అయితే సోషల్‌ మీడియాని నిన్న మొన్నటివరకూ అంతా లైట్‌ తీసుకున్నారు. అయితే ఇప్పుడలా కాదు. తేడా వచ్చిందంటే సోషల్‌ మీడియా దెబ్బకి ఎవరైనా షాక్‌ తినాల్సిందే. చలపతిరావు ఎపిసోడ్‌తో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ నివ్వెరపోయింది. సోషల్‌ మీడియా ద్వారా తమ సినిమాలకు పబ్లిసిటీ బాగానే జరుగుతోందనే సంతోషంతోపాటుగా, ఏమాత్రం తేడా వచ్చినా సోషల్‌ మీడియా ఉతికి ఆరేస్తుందనే ఆందోళన పెరిగింది సినీ పరిశ్రమలో.

ఒక్క సినిమా గురించే కాదు, రాజకీయాలపైనా సోషల్‌ మీడియా ఘాటుగా స్పందిస్తోంది. ఒక్కోసారి సోషల్‌ మీడియాలో కూడా వెకిలితనం కన్పిస్తున్నప్పటికీ, అది పనిగట్టుకుని కొందరు చేసే దుశ్చర్య మాత్రమే. ప్రధానంగా సోషల్‌ మీడియాలో యువత పాత్ర కీలకంగా కనిపిస్తోంది. పలు అంశాలపై యువత, సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు. సినిమాలకు సంబంధించిన ప్రోమోస్‌ పట్ల యువత సోషల్‌ మీడియాలో ఆసక్తి చూపడం వరకూ సినీ పరిశ్రమకు బాగానే ఉంది. యూ ట్యూబ్‌ రికార్డులనీ, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఫాలోవర్లు అనీ సినీ సెలబ్రిటీలకు సోషల్‌ మీడియా అందిస్తున్న అండదండలు అపారం. సోషల్‌ మీడియా రికార్డులు చెప్పుకుని తమ సినిమాల్ని సినీ ప్రముఖులు ప్రమోట్‌ చేసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రమోషన్‌ని పనికొస్తున్నాం కదా అని, హద్దులు మీరొద్దనే సంకేతాల్ని సోషల్‌ మీడియా పంపింది తాజాగా.

మామూలుగా అయితే చలపతిరావు ఎపిసోడ్‌ ఇంత సీరియస్‌ అయ్యేది కాదు. ఆయన క్షమాపణతో వివాదం సద్దుమణిగేదే. సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలపై ఒత్తిడి పెరిగిపోయింది. 'ఎవ్వరూ నోరు మెదపరేం' అని నెటిజన్లు, సెలబ్రిటీలను సోషల్‌ మీడియాలో ప్రశ్నించేసరికి, వివాదం ముదిరి పాకాన పడిందని అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉన్నత స్థానాల్లోనివారు తమ హుందాతనాన్ని చాటుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇటువంటి పరిణామాలే చోటుచేసుకుంటాయి.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు