గల్ఫ్ లో ఏకైక తెలుగు ఇంటర్నెట్ సౌరభం - ..

one and only in gulf

శ్రీకాంత్ చిత్తర్వు. నిన్నటి వరకు దుబాయిలోని ఎతిసలాత్ లో ఒక సాంకేతిక నిపుణిడిగా అక్కడ కొందరికే తెలుసు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రముఖుడిగా సుపరిచితం. తెలుగు భాష, తెలుగు నేల మీద అభిమానంతో మాగల్ఫ్ డాట్ కాం అనే వెబ్ సైట్ ను స్థాపించడం శ్రీకాంత్ చిత్తర్వు జీవితంలో ఒక మలుపు. గల్ఫ్ దేశాల్లో పూర్తిస్థాయి తెలుగు వెబ్ పత్రిక 2015 వరకు లేదు. అక్కడి తెలుగువారి మనోభావాలకు, అవసరాలకు అద్దం పట్టడానికి తెలుగు అసోసియేషన్స్ కొన్ని ఉన్నా వెబ్ మాధ్యమం సరైంది లేదు. ఆ ఖాళీని భర్తీ చేస్తూ నెలకొల్పిన మాగల్ఫ్ డాట్ కాం అనతి కాలంలోనే విస్తృత ప్రచారం పొందింది. వ్యవస్థాపకుడు శ్రీకాంత్ చిత్తర్వు అక్కడి తెలుగు వారికి ముఖ్యుడైపోయారు. అంతటితో ఆగలేదు.

ఆంధ్రప్రదేశ్ తెలుగు ఎన్నారై గ్రూపులో ఆయనొక కీలకమైన సభ్యుడు ఇప్పుడు. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణా ప్రభుత్వంలోని ముఖ్యులతో అనుసంధానమవుతూ తెలుగు వారికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారాయన. తెలుగు నేల నుంచి ఏ ప్రముఖుడు దుబాయిలో అడుగు పెట్టినా శ్రీకాంత్ చిత్తర్వు వారికి ఆతిధ్యం ఇవ్వడం కూడా అక్కడి తెలుగు వారు చెప్పుకునే ఒక అంశం.
శ్రీకాంత్ చిత్తర్వు పనులను గుర్తించి 2016 సంవత్సరానికి గాను ఇండీవుడ్ ఎక్సెలెన్స్ అవార్డు, ప్రవాసి మిత్ర అవార్డులు లభించాయి. ఇదంతా ఒక ఎత్తైతే టీవీ5 గల్ఫ్ విభాగానికి ముఖ్య అనుసంధాన కర్తగా గురుతరమైన బాధ్యతలు కూడా చేపట్టారు.
"గల్ఫ్ లో తెలుగు వారి కోసం ఒక వెబ్ సైట్ ను స్థాపించడం ఒక్కటే నా సంకల్పం. తక్కినవన్నీ భగవంతుడు కల్పిస్తున్న బాధ్యతలు", అంటారు శ్రీకాంత్ చిత్తర్వు.

తెలుగు భాష, ప్రజల కోసం ఏ విధమైన కార్యం తలపెట్టినా దానికి గోతెలుగు డాట్ కాం అభినందనలు తెలుపుతుంది. ఈ వారం మాగల్ఫ్ డాట్ కాం వ్యవస్థాపకులు, టీవీ5 గల్ఫ్ సంధానకర్త, ఏపీ ఎన్నారై సభ్యులు శ్రీ శ్రీకాంత్ చిత్తర్వు కు అభినందనలు తెలుపుతోంది  గోతెలుగు.

మరిన్ని వ్యాసాలు