ఓమనసా... రా.. ఇలా లఘుచిత్రం - శ్రీను

o manasaa raa ilaa short flim

కథ: ఒక అందమైన పల్లెటూరిలో అల్లరిగా తిరిగే కుర్రవాడు శ్రీను{కిరణ్ రెడ్డి} ఆ ఊరిలో వుండే బిందు{బిందు బార్బి} అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కాని బిందు తనకి తన బావ అంటే ఇష్టం అంటూ శ్రీను నుండి తప్పించుకోవాలనుకుంటుంది. శ్రీను మాత్రం తన ప్రేమ మీద చాలా గట్టి నమ్మకంతో ఉంటాదు...బిందు తనను కచ్చితంగా నన్ను ప్రేమిస్తుందనే ఆలోచనతో వుంటాడు. బిందు తన బావనే పెళ్ళి చేసుకుందా లేక శ్రీను ప్రేమలో పడిందా అనే విషయాన్ని చాలా అందంగా చిత్రీకరించారు.
నటీ నటుల తీరు: ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన కిరణ్ రెడ్డి చాలా బాగా నటించాడు. తన కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. చిత్రం మొత్తం తన నటనతో తన భుజాలపై కథను నడిపించాడు. తరువాత ఫీమేల్ లీడ్ చేసిన బిందు బార్బి తన పరిధి మేరకు చాలా బాగానే నటించింది.

కొన్ని సన్నివేశాల్లో సహజమైన నటనతో పల్లెటూరి అమ్మయిలా చాలా బాగా నటించింది. శ్రీను స్నేహితుడిగా నటించిన గంగాధర్ గారు అబ్ సొల్యూట్ టైమింగ్ చాలా బాగా నవ్వించింది. ఇక పోతే అల్లూరి మౌనిక, నవీన్ ఈటిక గారు వాళ్ళ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:

1.సినిమాటోగ్రఫీ  
2. సంగీతం
3. డైలాగ్స్
4. హీరో నటన
5.కథ

మైనస్ పాయింట్స్:

1. కథనం
2. లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
3. ఎడిటింగ్
సాంకేతిక వర్గం: కథ-కథనం, మాటలు-దర్శకత్వం అన్ని బాధ్యతలను పోషించిన ధర్మరాజుల శ్రీను గారు ఎంచుకున్న కథ మంచి పాయింటే కానీ కథనంతో అనుకున్నంత బాగా చెప్ప లేక పోయారనిపిస్తుంది. తరువాత మాటల విషయానికొస్తే  చాలా బాగున్నాయి. మంచి డైలాగ్స్ వున్నాయి. దర్శకత్వం విషయానికి వస్తే తనకి కావలిసిన విధంగా అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. తరువాత మనం చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. మాధవ రెడ్డి మరియు అరవింద్ ఇద్దరూ కలిసి ఈ భాద్యతను నిర్వర్తించి, 100% ఉత్తీర్ణులయ్యారు. ప్రతి సన్నివేశాన్ని బాగా తెరకెక్కించారు. పల్లెటూరి అందాలను మనోహరంగా చూపించారు.
తరువాత సంగీతం విషయానికొస్తే రాజా చాలా చక్కని సంగీతాన్ని సమకూర్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జై చాలా బాగా ఇచ్చారు. ఎడిటింగ్ విషయానికొస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకుని కొన్ని అనవసర సన్నివేశాలను తొలగించి అమరిస్తే చాలా బాగుండేది.

చివరగా: ఒక చక్కటి ప్రేమ కథను, అందమైన పల్లెటూరి అందాల మధ్య అందంగా తెరకెక్కించారు. కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఒక సారి మీరూ చూసి ఆనందించండి. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు