నవ్వుల జల్లు - జయదేవ్

లంక పౌరుడు - 214: కుంభకర్ణుల వారిని నిద్ర లేపడానికి లలిత సంగీత గోష్టి వెళుతున్నదే?
లంక పౌరుడు - 412: ఆయన కోసం కాదు! ఆయన్ని లేపడానికి ప్రయత్నించి, అలిసి పోయిన భటుల్ని ఉత్తేజపరచడానికి!

 



పొట్టి కింకరుడు: ఆ నరుడు పరమ పాపి కదా? వాడిని లాక్కొస్తూ మధ్యలో వొదిలేశావెం?
పొడుగు కింకరుడు: దారి మధ్యలో కాలు జారి పడి 'నారాయణా' అన్నాడు! నా పట్టు వదిలింది. వాడు స్వర్గం వేపు పారిపోయాడు!!

దెయ్యం -1: ఇక్కడ మన సంఖ్య చాలా తక్కువగా ఉన్నదే!
దెయ్యం -2: ఇది గంగాతీరం! ఇక్కడ మామూలుగా చచ్చేవాళ్ళకి పునర్జన్మలుండవు! పుణ్యలోకాలకి వెళ్ళిపోతారు!!
దెయ్యం -1: మనమూ ఇక్కడే చచ్చాంగా? మనకెందుకీ స్థితీ?
దెయ్యం -2: మనది మామూలు చావు కాదు! మనం ఆత్మహత్యలు చేసుకున్నాం!!

భటుడు: మహారాజా, శత్రురాజ్యాలు మన కోట చుట్టూ ఆక్రమించాయి!
రాజు: ఐతే అందరూ సిద్ధం కండీ! తెల్లబట్టలు తొడుక్కోండి. తెల్ల కపోతాల్ని ఎగుర వేయండి! తెల్ల జండాలు పట్టుకొని కోట ద్వారాలు తెరవండీ. వాళ్ళ అంతు చూస్తాను!

గంధర్వుడు: వరుణ దేవా! నీకు  వాంతులట గదా?
వరుణ దేవుడు: ఔను! నీకెలా తెలిసింది?
గంధర్వుడు: అంగ, వంగ, కళింగ దేశాలు, వరదల్లో కొట్టుకు పోయాయిగా!

పాత కాకి : ఈ చోటికి కొత్తలా కనిపిస్తున్నావ్!
కొత్త కాకి : అరుండల్ పేట, నాలుగో వీధి, ఇంటి నెంబర్ 16-3-1/A, పేరు వెంకట్రావ్, ఇల్లు వెతుకుతున్నాను.  
పాత కాకి : ఎందుకూ?
కొత్త కాకి : ఈ రోజు, వెంకట్రావ్ తండ్రికి తద్దినం!
పాత కాకి : నీకెలా తెలుసూ?
కొత్త కాకి : ఆ తండ్రిని నేనే!!


బృహన్నల: అన్నా... నువ్వు కీచకుడిని వధించావట కదా?
భీముడు: వాడి కాళ్ళూ చేతులని, ములక్కాడలని విరిచేలా విరిచి, వాడ్ని, అల్లం, వెల్లుల్ని రోట్లో దంచేలా దంచి, నుజ్జు నుజ్జు చేసి పారేసాను!
 బృహన్నల: నీ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని పోగొట్టుకున్నావ్ కాదన్నా!


మహామంత్రి: మహారాజా! పొరుగుదేశం నుంచి ఈ కపోతం వార్త మోసుకొచ్చింది!
మహారాజు: ఈ రోజు దీనితో సరిపెట్టుకుంటాం, రేపటికి బాగా బలిసిన పావురాన్ని పంపించమని, తక్షణం బదులు రాయి!!


పరిచారిక: మహారాణీ! రాజు గారు ఉద్యానవనం లో రహస్యంగా మద్యం సేవిస్తున్నారు!
మహారాణి: వారు సేవిస్తున్నది ఫల రసం ఎందుకు కాకూడదు? మద్యమనే నని ఎలా చెప్పగలవ్?
పరిచారిక: ఆ మద్యం పోసింది నేనే నమ్మా!
మహారాణి: ఎవరక్కడ? చాడీలు చెప్పే ఈ పరిచారికని బంధించి కారాగృహంలో తోయండి!!


అస్త్ర శస్త్ర నిపుణుడు:  రాకుమారా, మీరు ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం! అది పడిన చోట, అన్నీ దగ్ధమైపోతాయి! వెంటనే వెనక్కి లాక్కోండి
రాకుమారుడు: మాకు ఇవ్వడమే గానీ, పుచ్చుకోవడం మేమేరుగం!

 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు