ఆ కాఫీ ఇష్టం లేదు.. లఘు చిత్రం - ..

Aa Coffee Ishtam Ledu | Latest Telugu Short Film

చిత్రం: ఆ కాఫీ ఇష్టం లేదు
నటీనటులు: రఘు రెడ్డి, సంజన, రేవతి, వరలక్ష్మి, పవన్  కుమార్, స్నేహ, విజయ రాణీ, నాగేశ్వర రావు, నీరజ, కిరణ్ కుమార్, ద్రోణ, సుధ
ఎడిటర్: నరేశ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సృజన్ రెడ్డి
సంగీతం: సునీల్ కాశ్యప్
డైరక్టర్స్: సుజోయ్, సుశీల్   


కథేంటి.....
బస్సులో పరిచయమైన ఓ జంట మధ్య అతి తక్కువ సమయంలోనే మొదలైన ప్రేమకథ ఈ లఘుచిత్రం..బస్సులో ఒక మహిళ పక్కన కూర్చుంటాడు అతడు. కావాలని ఆ మహిళను ఆనుకుని కూర్చున్నాడని ప్రేక్షకులు అనుకుంటూ ఉండగానే అదే బస్సులోకి ఎక్కిన హీరోయిన్ అతడ్ని లేపి తను ఆ సీట్లో కూర్చుని కొంతసేపైన తర్వాత సీటు ఖాళీ అయి మళ్ళీ అదే సీటు అతడికి ఆఫర్ చేసేదాకా తెలీదు, అతడికి సిటీబస్సు జర్నీ కొత్త అని. కాపీరైటర్ గా తనని తాను పరిచయం  చేసుకుంటుంది  అమ్మాయి. ఐటీ ప్రొఫెషనల్ గా తనని పరిచయం చేసుకుంటాదు అతను....

మాటలు కలుస్తాయి. మాటల్లో తమ ఇద్దరి అభిరుచులూ దాదాపు ఒక్కటే అని గ్రహిస్తుంది అమ్మాయి. అతడు పెళ్ళిచూపులకు వెళుతున్నాడని మధ్యమధ్యలో అతడికొచ్చే ఫోన్ కాల్స్ ని బట్టి అర్థమవుతుంది అమ్మాయికి. అతడు ఫోన్ చెప్పే అడ్రస్ తమ ఇంటిదే అని చూచాయగా అర్థమవుతుంది....కానీ అతడికి ఆ పెళ్ళి చూపులు ఇష్టం లేవని చెప్తాడు. అతడు వెళ్ళబోయే పెళ్ళిచూపుల ఇంటి అడ్రస్ దగ్గరే తనూ బస్ దిగుతుంది. పెళ్ళి చూపుల్లో జరిగిన ఆ అనూహ్య సంఘటన ఏమిటి?? తర్వాతేం జరిగింది?? వాళ్ళ ప్రేమ కథ ఎలా సుఖాంతమైందన్నది తెలుసుకోవాలంటే ఈ షార్ట్ ఫిలిం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్.
కథనం...దర్శకత్వం..మాటలు...సంగీతం...
యువత తమకేం కావాలో ఎంత స్పష్టత కలిగి ఉన్నారనేది చక్కగా ఎలివేట్ చేసారు. ఎనభై శాతం బస్సులో వాళ్ళిద్దరి మధ్య మాటలతోనే గడచిపోయినా ఆసక్తి కలుగుతుందే కానీ బోర్ అనిపించదు. ప్రేక్షకులను తమ అంచనాలను నుంచి సడన్ గా యూ టర్న్ తీసుకునే విధంగా కథను తిప్పిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్
హీరో-హీరోయిన్ల మధ్య తెలంగాణ మాండలికం...అసలా అవసరం ఏముందో అర్థం కాదు. కొన్నికొన్ని చోట్ల ఆ స్లాంగ్ లో డైలాగ్స్ రాసుకోవడంలో విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. కొన్నికొన్ని సీన్లలో వాళ్ళు చెప్తున్న డైలాగులకూ, మొహంలో పలికిస్తున్న భావాలకూ పొంతన కుదరలేదేమో అనిపిస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే
మంచి కాఫీలాంటి షార్ట్ ఫిలిం.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు