ఆకాశంలో సగమేగానీ! - ..

be care full  ....

ఆడవారు మగవారితో అన్నింట్లోనూ సగం సగం. మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ స్త్రీలు ముందంజలో ఉంటున్నారు. అయినా కానీ ఆడవాళ్లూ తస్మాత్‌ జాగ్రత్త. ఎంత జాగ్రత్త తీసుకున్నా మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మహిళలు తాము పని చేసే చోట పరిసరాలపై కొంత అవగాహన ఏర్పర్చుకోవాలి. తన చుట్టూ ఉండే కొలీగ్స్‌ అయినా కానీ, బాగా తెలిసిన వాళ్లే అయినా కానీ తమ జాగ్రత్తలో తాముంటే మంచిది. ఆఫీసుల్లో తమతో పని చేసే కొలీగ్స్‌ విషయంలో అప్రమత్తత అవసరం. ఆఫీసుల్లో ఉద్యోగం చేసే మహిళలు ప్రాజెక్టుల నిమిత్తం వేర్వేరు ప్రదేశాలకు వెళ్లవలసి వస్తే అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీగా తమతో కొన్ని టెక్నికల్‌ ప్రొడక్ట్స్‌ని వెంట ఉంచుకోవడం మంచిది. మార్కెట్లో మహిళల సెక్యూరిటీ కోసం ఇప్పుడు చాలా పరికరాలు అనుకూలంగా ఉన్నాయి.

అతి చిన్న సైజుల్లో ఈ పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. పెప్పర్‌ స్ప్రే పరికరాలు, టచ్‌ చేస్తే సైరన్‌ మోగే పలు రకాలా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి విషయంలో మహిళలు అవగాహన ఏర్పర్చుకోవాలి. ఎక్కడ ఉన్నా తమ సమాచారాన్ని తరచూ కుటుంబ సభ్యులకు అందిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాఠిస్తే మహిళలపై జరిగే అరాచకాలను కొంత వరకైనా నిరోధించవచ్చు. ఇక పోలీసు వ్యవస్థ విషయానికొస్తే, ప్రస్తుతం అనేక రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు తమ సమాచారాన్ని పోలీసులకు అందించే యాప్స్‌ వచ్చాయి. ఆ యాప్స్‌ని మహిళలు తమ మొబైల్‌ ఫోన్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అలాగే స్వతహాగా కొంత ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. మగవారితో పోలిస్తే, ఆడవారికే ధైర్యం ఎక్కువ అంటారు. అందుకే ఆడవారిని అత్యంత శక్తివంతమైన దేవత కాళీ మాతతో పోలుస్తారు. ఓర్పుకు భూదేవితో పోలుస్తారు. సహనంలో భూదేవి అయినా, కోపం వస్తే కాళికా దేవియై నిలువునా దహించేస్తుంది మహిళ. కానీ అప్పుడప్పుడూ చేసే చిన్న పొరపాట్లు మహిళల్ని, మగాళ్ల క్రూరత్వం నుండి తప్పించుకోనీయకుండా చేస్తోంది. అరదుకే అన్ని సందర్భాల్లోనూ మగువలు తమ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నమ్మేయరాదు.

ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు ఆకర్షణ పేరుతో తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే పేరెంట్స్‌ చిన్నప్పట్నుంచే అమ్మాయిలకు కొంత అవగాహన ఏర్పర్చాలి. అలాగే సెల్ఫ్‌ డిఫెన్స్‌ పేరుతో స్కూల్‌ డేస్‌ నుండే అమ్మాయిలకు కరాటే, కుంగ్‌ ఫూ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. చిన్న నాటి నుండే అమ్మాయిలు ప్రతీ విషయంలోనూ ఆచి తూచి ఆలోచించి ముందుకెళ్లేలా తల్లి దండ్రులూ, ఉపాధ్యాయులు తీర్చి దిద్దాలి. అప్పుడే ఆడవారు అన్ని రంగాల్లోనూ మరింత ముందుకెళ్లే అవకాశాలుంటాయి. ఇక మగపిల్లల విషయంలో కూడా చిన్నప్పట్నుంచే అమ్మాయిల పట్ల గౌరవం, భద్రతా భావం కలిగించేలా ఇంటి నుంచే 'సంస్కరణ' ప్రారంభమయితే మంచిది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు