గ్యాడ్జెట్‌ మేనియా కాకూడదు ఫోబియా - ..

gadjets menia

మొబైల్‌ ఫోన్‌ కాస్సేపు కన్పించకపోతే అదోరకమైన చిత్ర విచిత్ర ప్రవర్తనతో షాకిస్తున్నారు ఈ మధ్య చాలామంది. స్మార్ట్‌ మొబైల్‌ వచ్చాక దానికి అడిక్ట్‌ అయిపోవడం ఓ మానసిక అనారోగ్యంగా మారిపోయింది. మానసిక వైద్య నిపుణుల వద్దకు ఈ మధ్య ఎక్కువగా వెళుతున్నవారిలో ఈ 'స్మార్ట్‌' బాధితులే ఉంటున్నారట. ప్రపంచ వ్యాప్తంగా వివిధ గణాంకాలు చెబుతున్న మాట ఇది. మొబైల్‌ ఫోన్‌లోనే అన్నీ అందుబాటులో ఉంటున్నాయిప్పుడు. బ్యాంకింగ్‌ రంగంతో పాటుగా ప్రతి ఒక్కటీ మీ వేళ్ళ మీదే, అదీ మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ మొబైల్‌తోనే చక్కబెట్టేయొచ్చు. మొబైల్‌ వ్యాలెట్‌కి అడిక్ట్‌ అయిపోవడం అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం వల్ల చాలా ఉపయోగాలున్నట్లే, చాలా అనర్థాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రధానంగా సైబర్‌ నేరగాళ్ళకు ఇదొక వరంగా మారిపోయింది. ఒక్కసారి వైఫైకి కనెక్ట్‌ అయి, మొబైల్‌ షేరింగ్‌ని ఆన్‌ చేశారో ఇక మీ మొబైల్‌, అందులోని డేటా మీతోపాటుగా ఇంకొంతమంది వినియోగించే ఛాన్స్‌ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ని బ్లాక్‌ చేయడం, మొబైల్‌ని హ్యాక్‌ చేయడం వంటివి చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి. చిన్న పిల్లలు సైతం, ఈ హ్యాకింగ్‌ని తేలిగ్గా నేర్చుకోగలుగుతున్నారంటే, ఈ తరహా అక్రమాలు ఎంత కామన్‌ అయిపోయాయో అర్థం చేసుకోవచ్చు. 

స్మార్ట్‌ మొబైల్‌ నుంచి డేటా తస్కరణ, తద్వారా బ్యాంక్‌ లావాదేవీల్ని కంట్రోల్‌ చేయడం ఇవన్నీ ఒక సమస్య అయితే, వాటితో సంబంధం లేకుండా కేవలం స్మార్ట్‌గా మొబైల్‌ని వినియోగించేవారు, సోషల్‌గా అందరితోనూ కనెక్ట్‌ అయి ఉండేవారికి ఇంకో తీవ్రమైన సమస్య బాధిస్తోంది. అదేమిటంటే మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఏదైనా షేర్‌ చేసుకోవచ్చుగనుక, వ్యక్తిగత సమాచారాన్ని అలా కొంతమంది షేర్‌ చేసుకోవడం జరుగుతోంది. యువత ఈ విషయంలో అందరికన్నా ముందుంటుండటం గమనించదగ్గ అంశం. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కి సంబంధించిన పొటోలు, వీడియోలు షేర్‌ చేయడం, వారితో ఇంటిమేట్‌గా ఉంటున్నప్పటి విషయాలు బహిర్గతం చేయడం ద్వారా కొత్త తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. గ్రూప్స్‌ క్రియేట్‌ చేసి అందులో వ్యక్తిగత సందేశాలు హద్దులు మీరేలా పంపడం కూడా మానసిక సమస్యేనని నిపుణులు చెబుతారు. ఇలాంటివారికి కౌన్సిలింగ్‌ ఒక్కటే సరిపోదనీ, కౌన్సిలింగ్‌ తర్వాత వారిని గమనిస్తూ ఉండాలనీ ఆ బాధ్యత తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులపై ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ఇంతలా స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌ అత్యవసరం, అతి ప్రమాదకరం కాబట్టే, కాస్సేపు అది కన్పించకపోతే తస్కరణకు గురైందనో, ఇంకోటనో ఆందోళన చెందడం జరుగుతోంది. దేనిమీదనైనా అతిగా ఆధారపడితే ఇలాంటి సమస్యలు తప్పవు. సో గ్యాడ్జెట్‌ని వినియోగించేటప్పుడు మంచి చెడులను తెలుసుకుని, విజ్ఞతతో వ్యవహరించడం మేలు.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు