హెల్త్‌ ఎట్‌ ది రేట్‌ ఆఫ్‌ గ్యాడ్జెట్స్‌ - ..

health at the rate of gadgets

మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ గ్యాడ్జెట్‌ వాడి చూడండి. సాధారణ తలనొప్పికీ ఉంది ఓ ఔషధం లాంటి గ్యాడ్జెట్‌. మెడనొప్పికి అయినా అంతే. మానసిక సమస్యలతో ఉన్నవారికీ గ్యాడ్జెట్స్‌ ఉపశమనం కల్పిస్తున్నాయి. టెక్నాలజీ గురించి తెలుసుకుంటే మనల్ని మనమే మైమర్చిపోతాం. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత గొప్పతనమిది. ఈ సాంకేతిక విప్లవంలో రోజుకో కొత్త అద్భుతం మన ముందు ఆవిష్కృతమవుతోంది. ఒకదాని గురించి తెలుసుకునేలోపు, ఇంకో కొత్త అద్భుతం మనముందు సాక్షాత్కారమవుతోందంటే మనల్ని మనం దేవుళ్ళలా అభివర్ణించుకోవాలేమో.

అలెక్స్‌ అనే ఓ కొత్త గ్యాడ్జెట్‌ ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తోంది. ఈ గ్యాడ్జెట్‌ని ధరిస్తే చాలు మెడనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అదెలా పనిచేస్తుందంటే, దానికి మళ్ళీ మొబైల్‌ ఫోన్‌తో లింకప్‌ ఉండాలి. మొబైల్‌ ఫోన్‌ అంటే స్మార్ట్‌ ఫోనే. దాని ద్వారా, ఈ గ్యాడ్జెట్‌ని వినియోగించవచ్చు. మెడ ఏ పద్ధతిలో ఉంటే మీకు సౌకర్యమో ఎప్పటికప్పుడు ఈ గ్యాడ్జెట్‌ తెలియజేస్తూ, అప్రమత్తం చేస్తుంటుంది. వైబ్రేషన్‌ వచ్చిందంటే మీ మెడని మీరు సక్రమంగా ఉంచట్లేదని అర్థం. సింప్లీ సూపర్బ్‌ కదా. ఆగండి, అంత తొందరొద్దు. ఇంకా అందుబాటులోకి అత్యాధునికమైన గ్యాడ్జెట్స్‌ వచ్చేశాయ్‌.

కొన్ని గ్యాడ్జెట్ల నుంచి ప్రసారమయ్యే తరంగాలు నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేవిగా ఉంటున్నాయి. తద్వారా తక్షణ ప్రాతిపదికన నొప్పులు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అయితే వైద్యులు అన్ని వేళలా ఈ గ్యాడ్జెట్లపై ఆధారపడటం మంచిది కాదంటారు. ఏ గ్యాడ్జెట్‌ అయినా కొంతమేర రేడియేషన్‌ని విడుదల చేస్తుంది. ఆ రేడియేషన్‌ కారణంగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కాబట్టి, గ్యాడ్జెట్‌ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన, అప్రమత్తత తప్పనిసరి. సుదూర ప్రయాణాల్లోనో, ఇంకొక సందర్భంలోనో మాత్రమే గ్యాడ్జెట్లను వినియోగించాల్సి ఉంటుంది. మిగతా సమయాల్లో పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో వైద్య చికిత్స తీసుకోవడం మేలు.

మోకాలుని పట్టి ఉంచే ఎలక్ట్రానిక్‌ పట్టీలు, మెడకి వినియోగించే పట్టీలే కాదు, నడుముభాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గించే బెల్టులు కూడా అందుబాటులో ఉన్నా, అవన్నీ అన్ని వేళల్లోనూ శ్రేయస్కరం కాదు కాబట్టి, ఏ వస్తువుని వినియోగించాలన్నా 'అతి' జోలికి వెళ్ళకపోవడమే మంచిది.

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం