14-07-2017 నుండి 20-07-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని గడుపుటకు ఇష్టపడుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయకపోవడం సూచన, వాయిదావేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. నూతన వాహనములు కొనుగోలు చేయునపుడు అనుభవజ్ఞుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. తల్లితరుపు బంధువులను కలుసుకొనేఅవకాశమ్ ఉంది, వారి ఆలోచనలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. పెద్దలతో చర్చలు చేయుట అలాగే వారి సూచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో వేచిచూసే ధోరణి మంచిది. ఉద్యోగంలో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆశించిన మేర ఫలితాలు రావడం సంతోషించదగిన విషయం. వాహనముల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం సూచన. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.


మిథున రాశి : ఈవారం మొత్తం మీద ఆరంభంలో పనిమీద ఉన్న శ్రద్ద రానురాను ఉండకపోవచ్చును. చిన్న చిన్న పనులకు అధికసమయం కేటయించుట వలన నూతన ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో నలుగురిని కలుపుకొని వెళ్ళుట అలాగే పెద్దల అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. సాధ్య మైనంత వరకు అనుభవాలకు విలువను ఇవ్వడం, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఉద్యోగంలో సమయపాలన పాటిం చుట వలన తప్పక లబ్దిని పొందుతారు. ఏమాత్రం అశ్రద్దగా ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబందికి గురిచేస్తాయి, జాగ్రత్త. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 


కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద నూతన నిర్ణయాల విషయంలో ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో చర్చలు చేయుటకు ఆసక్ర్మ్ ఉంది. లక్ష్యాలు పెట్టుకొని ఆదిశగా అడుగులు వేయుట మంచిది. పెద్దలనుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. చిన్న చిన్న విషయాలకే హైరానా పడుతారు. సాధ్యమైనంత  వరకు ప్రయాణాలు వాయిదావేయుట సూచన. పిల్లలు,సంతానం విషయంలో  నూతన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. విదేశీప్రయత్నాలు కొనసాగుతాయి.

 



 సింహ రాశి : ఈ వారం మొత్తం మీద ఆశించిన మేర ఫలితాలు రావడం వలన సంతోషమును పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. బంధువులను కలుసుకుంటారు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. గతంలో మీకురావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలు మలుచేసేదిగా ఉంటాయి. విదేశాలలో ఉన్న మిత్రులనుండి సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. 
 

 

కన్యా రాశి :  ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటరు. వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలకు, నిర్ణయాలకు ఒక రూపం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం సూచన. సాధ్యమైనంత వరకు నలుగురిని మీ పనిలో పాల్గొనేలా ప్రయత్నం చేయుట మంచిది.వ్యాపారపరమైన విషయాల్లో మీ లక్ష్యసాధన వైపుగా అడుగులు పడే అవకాశం ఉంది. మిత్రులతో ఎటువంటి మనస్పర్థలు రాకుండా జాగ్రత్తపడటం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్లకండి. ఉద్యోగంలో నూతన పృయత్నాలు మొదలుపెట్టుటకు వారంచివరఅనుకూలమైన సమయం.

 

తులా రాశి : ఈవారం మొత్తమ్మీద మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నెమ్మదిగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆశించిన మేర ఫలితాలు వచ్చే వరకు వేచిచూసే ధోరణి మేలుచేస్తుంది. ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో  పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అనుకోని మనస్పర్థలు కలుగుతాయి.

 

 

   

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద మొదట్లో కాస్త సర్దుబాటు విధానం అలాగే తొందరపాటు లేకుండా ఉండుట సూచన. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట సూచన., ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం  ఉంది.ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట అలాగే అనుభజ్ఞులసూచనల మేర ముందుకు వెళ్లడం అవసరం. మీకు రావాల్సిన ధనం వారం చివరలో మీకు చేతికి అందుతుంది. సోదరులతో మీరు చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవచ్చును. విదేశాలలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చర్చలకు అవకాశం ఉంది, సర్డుబాటు విధానం మంచిది.

 

 

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కార్మ్ ఉంది. పనిఒత్తిడి ఉంటుంది, సమయాన్ని అధికభాగం చర్చలకు కేటయించే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు నలుగురి సహకారం కోరుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాహం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో కాస్త వేచిచూసే ధొరణి మంచిది. కుటుంబ పరమైన విషయాల్లో మీ ఆలోచనలను సభ్యులకు తెలియజేస్తారు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది. భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం.

 

మకర రాశి :   ఈవారం మొత్తం మీద నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వారా పెద్దలలో మంచి గుర్తింపును పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందిన, ఒక సంతృప్తు ఉంటుంది. దూరదృష్టితో మీరు చేసే ప్రయత్నాలు విజయవంతంగనంగాముగుస్తాయి. పెద్దలతో మీకున్న అనుభందం మరింత బలపడే అవకాశం ఉంది . చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసేలా ప్రయత్నం కొనసాగించుట ఉత్తమం.

 

   కుంభ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. విదేశీప్రయాణాలు చేయవల్సి రావోచ్చును. కొంతమందికి మీరు తీసుకొనే నిర్ణయాలు నచ్చక పోవచ్చును, అయినా మీ ఆలోచనలను మార్చుకోవడంలో పెద్దగా ఇష్టపడకపోవచ్చును.

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో దూరదృష్టిలేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసే ప్రయాత్నాలు అనుకూలిస్తాయి. మీ మాటతీరును సరిచూసుకోకపొతే ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధవద్దు, తగిన శ్రద్ద తీసుకోవడం సూచన. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది.

 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి