యోగా - ప్రపంచ జీవన విధానం - ..

yoga is universal life style

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కారణంగానే 'యోగా' ప్రపంచానికి పరిచయం కాలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా 'యోగా'కి గుర్తింపు పెరగడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పాత్ర చాలా ఎక్కువ. ఆయన ప్రధాని అయ్యాకనే యోగాకి ప్రాచుర్యం కల్పించడం జరిగింది. అంతే కాకుండా ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించేలా ప్రపంచ దేశాల్ని ఆయన ప్రభావితం చేయగలిగారు. యోగా అనేది ఓ మతానికి సంబంధించిన అంశంగానే అప్పటివరకూ ప్రాచుర్యం పొందింది. అయితే అది తప్పని తెలిసినా, కొన్ని మతాలకు చెందిన 'అతివాదులు' యోగాని ఓ మతానికి పరిమితం చేసేశారు. కానీ వారి పప్పులుడకలేదు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నాయి. భారతీయ జీవన విధానంగా 'యోగా'కి ఎన్నో వందల వేల ఏళ్ళ చరిత్ర వుంది. అదిప్పుడు ప్రపంచమంతా ఆమోదించింది. ఆరోగ్యకరమైన జీవన విధానామే 'యోగా'.

అయితే ఈ యోగాలోనూ సరికొత్త పోకడల్ని ప్రపంచ దేశాలు తీసుకొస్తున్నాయి. స్విమ్మింగ్‌ యోగా, కపుల్‌ యోగా, సెక్సీ యోగా, రోప్‌ యోగా అంటూ కొత్త కొత్త వింత వింత పేర్లతో 'యోగా'ని భ్రష్టుపట్టించేస్తునవారూ లేకపోలేదు. చిత్రంగా ఇలాంటి సరికొత్త యోగా ప్రక్రియలకు సంప్రదాయ యోగా కంటే ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది. భార్యాభర్తలిరువురూ కలిసి శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయేలా యోగాసనాల్ని కొందరు రూపొందిస్తున్నారు. ఇదొక 'పైత్యం'గా యోగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఆధునిక పద్దతుల్లో 'యోగా' అభ్యసించడం వల్ల లాభమే తప్ప నష్టమేమీ లేదని మోడర్న్‌ యోగా నిపుణులు చెప్పడం జరుగుతున్నప్పటికీ, సంప్రదాయ 'యోగా'తో వచ్చే లాభాలు, 'కల్తీ యోగా'తో ఉండవనే అభిప్రాయం కూడా ఉంది.

యోగాసనాలు వేయడమంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుకోవడం, ఏకాగ్రత ఇలా చాలానే ఉంటాయి. దైవం మీద పూర్తి ధ్యాస పెడితే తప్ప అది పరిపూర్ణమైన యోగా కాదంటారు. ఇది ఓ మతానికి సంబంధించిన విషయం కానే కాదు. ఏ మతానికి చెందినవారు ఆ మతానికి చెందిన దైవంపై ఫోకస్‌ పెట్టి యోగాసనాలు వేయడం ద్వారా వారిలో ఏకాగ్రత పెరగడంతోపాటుగా, ఆ యోగాసనాలకు దైవత్యం సంక్రమిస్తుందని చెప్పవచ్చు. డాన్స్‌ యోగా, శృంగార యోగా వంటివి 'యోగా' పవిత్రతను దెబ్బతీసేలా ఉంటున్నాయనే విమర్శలెలా ఉన్నా, ఏదో ఒక రకంగా యోగాకి ప్రాముఖ్యత లభిస్తోందనేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భారతీయ చారిత్రక సాంస్కృతిక సంపద అయిన యోగా, ఇప్పుడు విశ్వవ్యాపితమయ్యింది. విశ్వమంతా మన యోగాని కీర్తిస్తోంది, అక్కున చేర్చుకుంటోంది. అది మనందరికీ గర్వకారణం.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి