27-07-2017 నుండి 3-08-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు, నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుట యందు మక్కువను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. విదేశాలలో ఉన్న బంధువుల నుండి  మిత్రులనుండిబ ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలో పాల్గొనేటప్పుడు వారికి అనుగుణంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపరసంభందమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది.  అనారోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద సంతానం గురుంచి నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసేలా ప్రణాలిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. స్వల్పఆనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది,చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న వారినుండి నూతన సహకారాలు పొందుతారు.


మిథున రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో కీలకమైన ఆలోచనలు తీసుకొనే అవకాశం ఉంది, ఇంటి పెద్దల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళుట సూచన. సాధ్యమైనంత మేర విలువైన వస్తువుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది. దైవసంభంద విషయాల్లో సమయం గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన విధంగా నూతన పెట్టుబడులను సాధించగలుగుతారు.    

 

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఉన్న వేగం, పనిపైన శ్రద్ధను వారం మొత్తం కొనసాగించుట వలన పనులను పూర్తిచేయగలుగుతారు. చేపట్టిన పనుల పట్ల అవగాహన అవసరం లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టబడులు విషయంలో కాస్త సర్దుబాటు విధానం అవసరం, అనుభవజ్ఞుల ఆలోచనలు తీసుకోండి. అధికారులతో కలిసి తీసుకున్న నిర్ణయాల్లో కొంత ఇబ్బందులు కలిజె అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు నూతన సమస్యలు పొందుతారు కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. తల్లితరుపు బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆత్మీయులను లేదా బంధువులను కలుస్తారు. వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయకపోవడం సూచన. సాధ్యమైనంత మేర మెప్పులకు దూరంగా ఉండుట సూచన, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి.  తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయల్లో సంతోషకరమైన వార్తలను వినే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మానసిక ఆందోళన అధికంగా ఉంది, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం ఉత్తమం. నూతన పరిచయాలకు అవకాశం ఉంది అలాగే చిననాటి మిత్రులను కలుస్తారు. మీయొక్క ఆలోచనలు,మాటతీరు తోటివారిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. నలుగురిలో పనిచేసే సమయంలో వారికి అనుగుణంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏమాత్రం తొందరపాటు వద్దు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.

 

తులా రాశి :  ఈ వారం మొత్తంమీద మీ మాటతీరు వలన అధికంగా నస్టపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసేలా ప్రణాళిక కలిగి ఉండుట మంచిది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ఆస్కారం కలదు. వాహనముల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 

  

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద చిన్న చిన్న విషయాలకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోండి. కుటుంబంలో ఆశించిన విధంగా నూతన మార్పులు రావడానికి ఆస్కారం కలదు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల మూలాన కొంత శ్రమను అలాగే ఇబ్బందులను పొందుతారు కావున వీలైతే వాటిని వాయిదా వేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగంలో సమయపాలన పాటించుట మంచిది, అలాగే అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో సర్దుబాటు విధానము అవసరం. కుటుంబపరమైన విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. మిత్రులతో కలిసి గతంలో చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో ఫలితాలు నిదానంగా వచ్చుటకు అవకాశం ఉంది. సమాజికకార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు తోటివారికి సహాయం చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు.

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద దైవపరమైన విషయాల్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి వస్తుంది. సమయాన్ని వృధాకాకుండా చూసుకోవడం మంచిది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి కావున గట్టిగాప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి నూతన్ ప్రయత్నాలు చేపడుతారు. జీవితభాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. ఉద్యోగంలో సర్దుబాటు విధానం ఉత్తమం. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.

 

   కుంభ రాశి : ఈవారం మొత్తంమీద చిన్న చిన్న ఇబ్బందులకు అవకాశం ఉంది. కుటుంబంలో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును. సంతానమ్ విషయంలో సంతోషకరమైన వార్తను వింటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడే ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొత్త కొత్త పరిచయాలు అవుటకు ఆస్కారం కలదు. మానసిక ఆందోళన తప్పక పోవచ్చును. ఆత్మీయులను నస్టపోవడం ద్వారా కలిగిన నష్టాన్ని గుర్తిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు మొండిగా తీసుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి నూతన ఆలోచనలకు శ్రీకారం  చుడుతారు.

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో శ్రమకు అవకాశం ఉంది. మీయొక్క మాటతీరును మార్చుకొనే ప్రయత్నం చేయండి. సోదరులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వార్తని వినే అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. గతంలో మొదలు పెట్టి ఆగిన పనులు ముందుకుసాగుతాయి. అనుకొకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు