చిలుక-శిల్పం - అఖిలాశ

chiluka  shilpam

ఒక అడవిలో చిలుక గోరింక ఉండేవి వారిద్దరూకలిసి ఒకే గూడులో నివాసం ఉండేవి.వేసవి కాలం రావడంతో ఆ చెట్టు పై నివసించే ఇతర పక్షులన్నీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి.చిలుక గోరింకతో చూశావా మన స్నేహితులందరూవెళ్ళిపోయారు.ఈ వేసవి కాలంలో ఇక్కడ ఆహారం దొరకడం కష్టం కావున మనము కూడా మనకు దగ్గరే ఉన్నపక్కఅడవికి వెళ్దాము అక్కడ ఆహారం పుష్కలంగా ఉంటుంది అని చెప్తుంది.

గోరింకలేదులేదు ఈ అడవిని వదిలి నేను ఎక్కడికి వచ్చినివశించలేను అంటుంది.ఐతే నీ ఇష్టం నేను ఇక్కడే ఉండి చనిపోవాలి అనుకోవడం లేదు నేను వెళ్తున్న అని చెప్పి చిలుక పక్కనున్నఅడివికి ప్రయాణం చేస్తూ ఉంటుంది రోజంతా ఎగరడం వల్ల అలసి పోయిన చిలుక ఒక ప్రాంత నడిబొడ్డున అందమైన రాణి శిల్పం ఉంటుంది . ఆ శిల్పం వజ్రాలు వైడుర్యాలు బంగారంతో చేసి ఉంటుంది.అది చూసిన చిలుక చాల బాగుంది నేను ఈరోజు అలసిపోయాను కావున ఇక్కడ నిద్రపోయి రేపు మళ్ళి బయలుచేరుదాము అనుకోని ఆ శిల్పం పాదాల దగ్గర పడుకుంది.

చిలుక పడుకుంటూ ఉండగా ఒక పెద్ద నీటి చుక్క తన పై పడుతుంది..చిలుక ఆకాశం వైపు చూసి ఏంటి ఆకాశంలో వర్షం పడే సూచనలు లేవు కాని నా మీద ఈ నీటి చుక్క ఎలా పడింది అనుకుంటూ ఉండగా మరొక నీటి చుక్క పడుతుంది. చిలుక శిల్పం వైపు చూస్తుంది ఆ శిల్పం ఏడుస్తూ ఉంటుంది.చిలుక ఎందుకు ఏడుస్తున్నావు అసలు నీవు ఎవరు అని అడుగుతుంది..నేను ఈ రాజ్యానికి రాణి గా ఉండేదాన్ని నేను రాణి గా ఉన్నప్పుడు నా రాజ్యం చాలా ఆనందంగా ఉండేది .నేను కూడా చాలా ఆనందంగా ఉండేదాన్ని కాని ఇప్పుడు నా రాజ్య ప్రజల కష్టాలను చూసి బాధపడుతున్నా అంటుంది.

చిలుక అవునా? ఏమి కష్టాలు చూశావు అని అడుగగా ఒక ఇంటిలో ఒక ఆడకూతురు ప్రొద్దున నుండి బట్టలు కుడుతూనే ఉంది కాని మూడుపూటల అన్నం తినలేకపోతున్నది తన రెండు సంవత్సరాల కొడుకు పండ్లు కావలి అని ఏడుస్తున్నాడు కాని ఆ తల్లి తన ఇంటిలో తినడానికి ఏమి లేకనీళ్ళు ఇచ్చి తాగమని పిల్లాడికి సర్ది చెప్పుతున్నది.

సరే అయితే నన్ను ఏమి చేయమంటావు అని చిలుక శిల్పాన్ని అడుగుతుంది . నువ్వు నా కత్తిపై ఉన్న వజ్రాన్ని తీసుకోని వెళ్లి వారికి ఇవ్వు అంటుంది. చిలుక ఆ వజ్రాన్ని వారికి ఇచ్చి తిరిగి వచ్చేలోగా శిల్పం ఏడుస్తూనే ఉండటం చూసి మళ్ళిఏమైంది అని అడుగుతుంది.

అటు చూశావా ఆయన ఒక పెద్ద రచయిత ఎన్నో రచనలు చేసాడు కాని ఇప్పుడు తినడానికి అన్నం కూడాలేదు కావున తనకి నా కన్నుఇచ్చి రా ఎందుకంటే నా కన్ను విలువైన వజ్రం అంటుంది.చిలుక లేదు లేదు నేను నీ కన్ను తీయలేను అంటుంది.. శిల్పం బ్రతిమాలుతుంది  చిలుక అలాగే అని చెప్పి శిల్పానికి ఉన్న ఒక కన్ను తీసి ఆ రచయితకి ఇస్తుంది.

అయినా శిల్పం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది..మళ్ళి ఏమైంది  అని చిలుక అడుగగా అటు చూశావా ఆ చిన్న పాప తన దగ్గర ఉన్న నెయ్యి అమ్మి ఆ డబ్బుతో ఇంటికి వెళ్ళాలి కాని ఆ నెయ్యిని నేలపాలు చేసుకొని ఏడుస్తున్నది..డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తనని కొడుతాడు కావున నీవు వెంటనే నా మరో కన్ను తీసుకోని ఆ పాపకి ఇచ్చిరా అంటుంది.

చిలుక నేను అలా చేయలేను ఎందుకంటే నీవు గుడ్డిదానివి అయిపోతావు అంటుంది. అయినా పర్వాలేదు వెళ్లి ఇవ్వు అంటుంది . సరే అని చిలుక శిల్పం యొక్కమరో కన్ను తీసి ఆ పాపకి ఇస్తుంది.

శిల్పం ఇప్పుడు నీవు వేరే అడవికి వెళ్ళు అనగానే లేదు లేదు నేను వెళ్ళలేను ఎందుకంటే ఇప్పుడు నీవు చూడలేవు కనుకు నేను నీ దేశ ప్రజల బాధల గురించి చూసి నీకు చెప్తూ ఉంటాను అంటుంది .అలా ఆ చిలుక రాజ్యంలో జరిగే బాధలు చెప్పి శిల్పంలో ఉన్న వజ్రాలు అన్ని బాధపడేవారికి ఇస్తూ ఉంటుంది.అలా ఆ శిల్పంలో ఉన్న వజ్రాలు అన్ని అయిపోతాయి.

ఆ రాజ్య వాతావరణం అంతా మారిపోతూ ఉండటంతో చిలుక శిల్పంతో నేను ఇంకా వెళ్లి వస్తాను అంటుంది.సరే చివరికి నీవు వేరే అడవికి వెళ్ళిపోతున్నావా అంటుంది . లేదు లేదు ఈ వాతావరణంతో నాకు ఆరోగ్యం క్షీణించినది కావున నేను ఇంక చనిపోతున్నా అని చెప్పి తన పాదాల దగ్గరే చనిపోతుంది. ఆ శిల్పం ఏడ్చి ఏడ్చి ఆ బాధను తట్టుకోలేక కుప్పకూలిపోతుంది.

అలా వారి జీవితాలు మొత్తం ఒకరికి సహాయం చేయడంతోనే పరిపూర్ణం అయ్యాయి

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు