చిన్నదా? పెద్దదా? సక్సెస్సే మాట్లాడాలి - ..

small or big but only success

సినిమా అంటేనే పెద్ద ప్రహసనం, ప్రారంభం దగ్గర్నుంచీ, నిర్మాణం, విడుదల ఇలా ఒక్కటేమిటి అంతా ఓ యజ్ఞంలా సాగుతుంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, కష్టం ఒక్కటే. అంతేగా చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అంటుంటారు మన పెద్దలు. అలాగే చిన్న సినిమా కష్టం చిన్న సినిమాది. పెద్ద సినిమా కష్టం పెద్ద సినిమాది. మొత్తానికి కష్టం మాత్రం కామనే. సినిమా విడుదలై విజయం సాధించాక ఆ కష్టాన్నంతటినీ మర్చిపోయేలా చేస్తుంది. అదీ సినిమా అంటే. జయాపజయాలు మామూలే ఇక్కడ. అయితే ఇప్పుడు సినిమా సక్సెస్‌ ఈక్వేషన్స్‌ మారిపోయాయి. కొన్ని పెద్ద సినిమాలు సక్సెస్‌ అయినా కానీ నిర్మాతలకి లాభం తెచ్చిపెట్టడంలో ఫెయిలవుతున్నాయి. అలాగే కొన్ని చిన్న సినిమాలు ఫెయిలైనా కానీ, దాని వల్ల ఎవ్వరికీ పెద్దగా ఇబ్బంది ఉండడం లేదు. ఇదో రకమైన మాయ. అయితే పూర్తిగా దీన్ని మాయ అనడానికి వీల్లేదు. ప్లానింగ్‌ ఉండాలి కదా దేనికైనా. ఆ ప్లానింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటే, ఏ సినిమా అయినా విజయం సాధించొచ్చు. కాసుల వర్షం కురిపించొచ్చు. ఈ ప్లానింగ్‌ తప్పితే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి అయినా సినిమా కష్టాలు తప్పవు మరి. 
చిన్న సినిమాలు విజయం సాధించిన ప్రతీసారి ఈక్వేషన్స్‌ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూ ఉంటుంది. చిన్న సినిమా సాధించే విజయానికి ఆ ప్రత్యేకత ఉంటుంది. స్టార్‌ హీరోల సినిమాలు విజయం సాధిస్తే పెద్దగా గొప్ప విషయం కాదు. కానీ ఏమాత్రం ఇమేజ్‌ లేని ఓ చిన్న హీరో సినిమా విజయం సాధించింది అంటే అది ప్రత్యేకమైన విషయమే కదా. 'పెళ్లిచూపులు' సినిమా ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పటికీ ఇండస్ట్రీలో చర్చించుకుంటూనే ఉంటారు. చిన్న సినిమా సాధించే విజయం ప్రత్యేకత ఇలా ఉంటుంది మరి. తాజాగా 'ఫిదా' కూడా అలాంటి సినిమానే. చిన్న సినిమాగా స్టార్ట్‌ అయ్యి పెద్ద విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండుతోంది ఈ సినిమాతో. అందుకే ఈ సినిమా గురించి ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలా చిన్న సినిమా, పెద్ద సినిమాల గురించి మాట్లాడుకోవడం అని కాదు కానీ, కొత్త తరం ఆలోచనల్లో మార్పు ఆ రకంగా ఉంది. అలాగే వేగంగా సినిమా నిర్మాణం, లో బడ్జెట్‌ ఇవన్నీ చిన్న సినిమా ప్రత్యేకతలగానే చెప్పుకోవచ్చు. ఇదిగో చూడండి ఈ మధ్య సెల్‌ఫోన్‌తో కూడా సినిమాని చిత్రీకరించేస్తున్నారు. అలాంటి సినిమాలకి జస్ట్‌ గుడ్‌ టాక్‌ వచ్చిందంటే చాలు, అది ఆ సినిమా సాధించిన విజయంగానే పరిగణించాలి కదా. అదే పెద్ద సినిమా విషయానికి వస్తే, భారీ బడ్జెట్‌, కమర్షియల్‌ ఈక్వేషన్స్‌ ఇలాంటివి ఒక్కోసారి ప్రతిబంధకాలుగా మారతాయి. అవి ఆ సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఆ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా సాధించే 'సక్సెస్సే' మాట్లాడుతుంది. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు