ఇది వరకట్లో ఒక్కసారి సినీ రంగంలోకి అడుగు పెడితే ఇక వాళ్ల జీవితం అక్కడే అంకితమైపోతుంది. స్టడీస్, పర్సనల్ లైఫ్ అనేవి పర్సనల్‌గా ఉండేందుకు వీలుండేది కాదు. ఇక చదువు నుండి వచ్చిన వారైతే, ఒన్స్ సినీ రంగంలోకి అడుగు పెడితే, ఇక అంతే వారి చదువులు అటకెక్కేసినట్లే. కానీ ఇప్పుడలా కాదు. ప్రస్తుతం హీరోయిన్లు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తమ సొంత లైఫ్‌కే ఇస్తున్నారు. స్టడీస్ నుండి వస్తున్న అమ్మాయిలైతే, సినిమాల కారణంగా చదువుకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటున్నారు. చదువుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గతంలో హీరోయిన్లు ఒక్కసారి సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు అనుకునేవారు. అందుకోసం చదువేంటి ఇక దేన్నైనా వదులుకొనేవారు. కానీ ఇప్పుడు వస్తున్న ముద్దుగుమ్మలు వస్తూ వస్తూనే కొన్ని పక్కా లెక్కలతో ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చిన అరుదైన అవకాశాల్నైనా వదులుకుంటున్నారు కానీ, పర్సనల్ లైఫ్‌ని మాత్రం వదులుకోవడానికి అస్సలు ఇష్ట పడడం లేదు. ఈ ఆలోచనని ఇప్పటి యూత్ ఇన్సిపిరేషన్‌గా తీసుకోవాలి. అవును నిజమే యూత్, సినిమా వాళ్లలో తమని తాము ఊహించుకుంటూంటారు. స్టైలింగ్‌లోనూ, కొన్ని రకాల ఆటిట్యూడ్స్‌లోనూ తమని సినిమా వాళ్లతో అనురించుకుంటున్నారు నేటి యూత్. అలాంటి వారికి ప్రస్తుతం వస్తున్న ముద్దుగుమ్మల ఆదర్శం గొప్పదే అని చెప్పాలి.
చదువుకు ప్రాధాన్యత ఇస్తే, అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అలాగే తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మల కారణంగా ఓ మంచి మెసేజ్ యూత్‌కి పాస్ అవుతుందనే చెప్పాలి ఈ రకంగా. తమ అభిమాన తారలు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి నేటి యువత కూడా తమ ప్రాధాన్యతల్ని సరైన రూపంలో ఎంచుకుంటోంది. తాజాగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయి పల్లవి 'ఫిదా' సినిమాకి ముందు 'ప్రేమమ్'లో నటించింది. అయితే అప్పుడే 'ఫిదా'లో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ, స్టడీస్‌కి ప్రాధాన్యత ఇచ్చి స్టడీస్ పూర్తి చేశాకే సినిమా షూటింగ్‌కి హాజరయ్యింది. అలాగే చాలా మంది ముద్దుగుమ్మలు ఓ వైపు, చదువు, మరో వైపు బిజినెస్ ఇలా, పలురకాల ప్రొఫిషన్స్‌లో ఉంటూనే, నటనలోనూ రాణిస్తున్నారు. ముద్దుగుమ్మలు రాశీఖన్నా, రకుల్ ప్రీత్‌సింగ్, కాజల్, ప్రణీత ఇలా ఒక్కరేమిటి చాలామందే ముద్దుగుమ్మలున్నారు. ఏది ఏమైనా సమాజానికి నేటి తరం అందాల భామలు ఇస్తున్న ఈ మెసేజ్ అభినందనీయమే.