
కావలిసిన పదార్ధాలు: నెయ్యి, సేమ్యా, జీడిపలుకులు, పంచదార, పాలు, యాలకులు
తయారుచేసే విధానం: ముందుగా రైస్ కుక్కర్ లో నెయ్యి వేడి చేసుకుని జీడిపలుకులను దోరగా వేయించాలి. తరువాత సేమ్యాలను వేసి కొంచెం వేగాక పాలు పోయాలి. ఒక పది నిముషాలు మరగనివ్వాలి. మరుగుతున్న పాలలో యాలకులను వేయాలి. చివరగా పంచదారను వేసి కలపాలి. అంతేనండీ..సులువుగా చేసిన ఈ సేమ్యా పాయసం ఎంతో రుచిగా వుంటుంది..