ఉసిరితో జలపాతాల్లాంటి కురులు మీ సొంతం.. - ..

amla is hair expert

జుట్టును రక్షించుకోవడానికి ఎన్నో పదార్థాలను ఉపయోగిస్తుంటాము. వాటిలో ఆమ్లా ఒకటి. ఉసిరికాయను దీన్నే ఉసిరికాయ అని పిలుస్తారు. జుట్టు ఆరోగ్యం కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉసిరికాయను ఉపయోగిస్తున్నారు. జుట్టుకు ఉపయోగించడం వల్ల ఇది జుట్టును నల్లగా నిగనిగలాడేట్లు,ప్రకాశవంతంగా మార్చుతుంది.

ఇది ఏజింగ్ సమస్యలను నివారించడంలో శక్తివంతమైన మూలిక. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఉసిరికాయ జ్యూస్ రోజూ తాగే వారు , జుట్టుకు రంగు వేయక్కర్లేదు.

ఈ మద్య జరిపిన పరిశోధనల్లో ఉసిరికాయను రెగ్యులర్ గా ఉపయోగించే వారిలో వ్యాధినిరోధకత పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది, ఇంకా క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది అని కనుగొన్నారు.

బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...!

ఇటువంటి సూపర్ హెర్బ్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఆరెంజ్ లో కంటే 20 రెట్లు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉన్నాయి. అలాగే మినిరల్స్ కూడా శరీరానికి అవసరం అయ్యేన్ని ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతాయి. కిడ్నీ స్టోన్స్ ను కరిగిస్తాయి.వీటన్నింటికంటే జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. జుట్టు సమస్యలను నివారిస్తాయి. ఉసిరికాయలో ఉండే గుణాలు, జుట్టును ఆరోగ్యంగా, షైనీగా మార్చుతాయి.

షాంపు, కండీషన్ గా పనిచేస్తుంది. ఈ క్రింది సూచించిన  మార్గాలు మీరు కోరుకున్న జుట్టును పొందడానికి సహాయపడుతాయి.

ఆమ్లా వాటర్ తో చర్మం, జుట్టు సమస్యలు మాయం
1. మ్రుదువైన జుట్టుకోసం ఆమ్లా పౌడర్:


ఆమ్లాను కాయగా కంటే పౌడర్ గా ఉపయోగించడం చాలా సులభం . ఇది చాలా చౌకగా మరియు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ , మీ రెగ్యులర్ నూనెలో కలిపి తలకు అప్లై చేయాలి. రెగ్యులర్ గా వాడుతుంటే, జుట్టుకు మంచి మెరుపు వస్తుంది. ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నాణ్యత పెరుగుతుంది.
2. జుట్టు పెరుగుదలకు ఆమ్లా పౌడర్, హెన్నా:


హెన్నాకు ఉసిరికాయ పౌడర్ కలిపడం వల్ల రెండూ జుట్టుకు గ్రేట్ గా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హెన్నా నేచురల్ కలర్ కలది. జుట్టుకు మంచి రంగును అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయపొడిలో 3 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ మిక్స్ చేసి, వాటర్ కలిపి సరిపడా నీళ్ళ పోసి బాగా కలపాలి. ఐదు , ఆరుగంటలు అలాగే ఉంచి, తర్వాత తలకు అప్లై చేయాలి. రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
3. జుట్టు రాలడం తగ్గించే ఆమ్లా వాటర్ :
3. జుట్టు రాలడం తగ్గించే ఆమ్లా వాటర్ :

ఆమ్లా వాటర్ ను తలస్నానం చేయడానికి లేదా తలస్నానం చేసిన తర్వాత చివర్లో తలారా పోసుకోవడానికి ఉపయోగిస్తే, జుట్టు రాలడం తగ్గుతుంది. 5 ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి, నీళ్ళలో వేసి ఉడికించాలి. 15 నిముషాల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి, కూల్ చేయాలి. ఈ వాటర్ ను తలకు అప్లై చేసి వాష్ చేయాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా తలారా పోసుకోవాలి.
4. ఆమ్లా, శీకాకాయ హెయిర్ మాస్క్ :

జుట్టుకు మరో వండర్ ఫుల్ పదార్థం, శీకాకయ, ఆమ్లాతో మిక్స్ చేసి జుట్టుకు ఉపయోగించాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్ లో 2 టేబుల్ స్పూన్ల శీకాకాయ పౌడర్ కలిపి, సరిపడా నీళ్ళు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి, అరగంట అలాగే ఉండి, ఆరిన తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి.
5.ఆమ్లా నూనె, చుండ్రునివారణకు ఆమ్లా ఆయిల్ :


ఆమ్లా ఆయిల్ రోజూ ఉపయోగిస్తుంటే, జుట్టుకు మంచి పోషణ వస్తుంది. దాంతో జుట్టు సాప్ట్ గా పెరుగుతుంది. పొడి జుట్టు, దురద లక్షణాలను నివారిస్తుంది. హెయిర్ ఫాలీసెల్స్ కు బలాన్నిస్తుంది. జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది. 4 ఉసిరికాయలను ముక్కలుగా చేసి, రెగ్యులర్ నూనెలో వేసి నూనె వేడి చేయాలి. తర్వాత ఈ నూనెను జుట్టు పొడవునా అప్లై చేయాలి. రాత్రుల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం షాంపుతో తలస్నానం చేస్తేం మంచి ఫలితం ఉంటుంది. రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి