జనరేషన్‌ మారుతోంది గురూ! - ..

generation changed

ఒకప్పుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అంటే అదొక జడ పదార్థం. అయినప్పటికీ కూడా అదొక అద్భుతం. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది ఇంటర్నెట్‌ అనడం నిస్సందేహం. రానురాను ఇంటర్నెట్‌లో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. దానికి కారణం 'స్పీడ్‌'. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఎంత స్పీడ్‌గా ఉంటే, ఇంటర్నెట్‌ ప్రపంచంలో అద్భుతాలు అంత స్పీడ్‌గా జరుగుతాయనడానికి ప్రపంచం సాధిస్తోన్న అద్భుతమైన ప్రగతిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2జి దాటి, 3జి వెళ్ళిపోయి ఇప్పుడంతా 4జి ఫీవర్‌ నడుస్తోంది. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ ఏ మూల విన్నాసరే ఒకటే మాట అదే 4జి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాదు, దాంతో సరికొత్త అద్భుతాల ఆవిష్కరణ కూడా చేయగలుగుతుండడం గొప్ప విషయం. ఇది ప్రపంచం సాధించిన, సాధిస్తున్న అద్భుత విజయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అదీ ఇదీ అని కాదు అన్ని రంగాల్లోనూ ప్రగతికి ఇంటర్నెట్‌ స్పీడ్‌ కారణమవుతోంది. అందుకే ఇప్పుడున్న స్పీడ్‌ సరిపోదు, ఇంకా కావాలి అనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ కన్పిస్తోంది.

ఇప్పుడంటే 4జీ ద్వారానే అత్యధిక వేగాన్ని అందుకుంటున్నాం. ముందు ముందు ఆ స్పీడ్‌ మరింతగా పెరిగితే, అది 5జి ద్వారా సాధ్యమైతే, ఆ అద్భుతం గురించి ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? 2020 నాటికి 5జి నెట్‌ వర్క్‌కి సంబంధించి పూర్తిస్థాయిలో తీపి కబురు అందుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా 2035 వరకు ఈ వేగాన్ని అందుకోలేమని భావించినా, అంతకన్నా చాలాముందే శుభవార్త వినవచ్చునన్నది నిపుణుల మాట. సామాన్య మానవుడికి తెలియని శాస్త్ర సాంకేతిక సంబంధ విషయాలే కాదు, సామాన్యుడికి ఉపయోగపడే అనేక విషయాల్లోనూ ఇంటర్నెట్‌ వేగం ఎంతో ఉపకరిస్తోంది. ప్రభుత్వాలు తమ పరిపాలన కోసం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సమాచార మార్పిడే ఇందులో కీలకం. సంప్రదాయ ఇంటర్నెట్‌ కనెక్షన్లకు ధీటుగా స్మార్ట్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఎదుగుతూ వస్తుండడం శుభ పరిణామం.

టెక్నాలజీతో మంచి మాత్రమే కాదు, చెడు కూడా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆ చెడుని తగ్గించలేకపోతున్నాం. అదొక్కటీ మినహాయిస్తే, ఇంటర్నెట్‌కి సంబంధించి కొత్త 'జనరేషన్‌' మానవాళికి మరింత మెరుగైన జీవన విధానాన్ని అందించడం చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు సాధారణ మెయిల్‌ పంపించడానికే తిప్పలు పడే పరిస్థితులుండేవి. ఇప్పుడలా కాదు, పెద్ద మొత్తంలో డాటాని క్షణాల్లో ప్రపంచమంతా తిప్పేస్తున్నాం. ఇది ఇంటర్నెట్‌ సాధించిన పెను విప్లవం. చెడు కంటే మంచి చాలా ఎక్కువగా ఉండటం వల్లేనేమో ఇంటర్నెట్‌ ప్రపంచానికి దిక్సూచిగా మారుతోంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి