ఆర్గానిక్‌ ఫుడ్‌లో నిజమెంత - ..

organic food is true

ఒకప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు మొదలైనవి సహజమైన పద్ధతిలోనే పండించేవారు. సహజ సిద్ధంగా తయారు చేసిన యూరియా, క్రిమి సంహారకాలను పంటల కోసం వాడేవారు. కానీ ఇప్పుడులా కాదు. విషపూరితమైన క్రిమి సంహారకాలను పంటలు పండించేందుకు ఉపయోగిస్తున్నారు. తద్వారా మనం తినే ఆహారం కూడా విషతుల్యం అవుతోంది. ఏది కొందామన్నా కల్తీ. తాగే నీరు దగ్గర నుండీ, పిల్లలు తాగే పాలు, పాల పదార్ధాలు, బియ్యం, పప్పు దినుసులు ఇలా ఒక్కటేమిటీ సర్వం కల్తీనే. విత్తన దశలోనే ఈ కల్తీ మొదలై పోతోంది. ఉత్పత్తిని పెంచే క్రమంలో విత్తన దశలోనే పలు రకాల విష పదార్ధాలను ఉపయోగిస్తున్నారు. దాంతో పంట చేతికి వచ్చేసరికే సగం విషం అయిపోతోంది. ఇక మార్కెట్‌కి వచ్చాక అది నిల్వ చేసేందుకు మరిన్ని పెస్టిసైడ్స్‌ వాడకంతో టోటల్‌గా మనం తినే ప్రతీ ఆహారం విషతుల్యంగానే మారపోతోంది. దాంతో నగరాల్లో ఉండేవారు ఆర్గానిక్‌ ఫుడ్‌ వైపు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. పలు చోట్ల ఆర్గానిక్‌ ఫుడ్‌ పేరు చెప్పి పలు రకాలుగా మోసం జరుగుతోంది. అయితే ఈ ఆర్గానిక్‌ ఫుడ్‌లో నిజమెంతో తెలీని పరిస్థితి. అయినా కానీ కొంతలో కొంతైనా ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటే బెటరే కదా నగరవాసులు ఆకర్షితులవుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా మారిపోయింది ఆర్గానిక్‌ ఫుడ్‌ వినియోగం. 

కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎలాగూ తప్పవు. బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిందే. పప్పుదినుసుల ఇతరత్రా వంటివి. అయితే కొన్నింటిని మన ఇంట్లోనే పండించుకునే అవకాశాలున్నాయి. అందుకు నగర వాసులు కొంత ఉత్సాహం ప్రదర్శించాలి. ఆకుకూరలు వంటి వాటిని చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవడం ద్వారా కొంత విషపూరిత ఆహారం నుండి దూరంగా ఉండొచ్చు. అలాగే చిన్న చిన్న కూరగాయల వంటి వాటిని కూడా కుండీల్లో పెంచే ఏర్పాట్లు చేసుకుంటే, కొన్ని క్రిమి సంహారకాల నుండి విముక్తి దొరికే అవకాశం. అలాగే మార్కెట్లో లభించే ప్రతీ ఆహార పదార్ధాల్ని కొనుగోలు చేసే ముందే ఒకింత ఆలోచించాలి. ఆర్గానిక్‌ అనే వాటిపై మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆర్గానిక్‌ పేరు చెప్పి డబుల్‌ రేట్లు వెచ్చిస్తున్నాయి కొన్ని సూపర్‌ మార్కెట్లు. వినియోగదారునికి జేబుకి చిల్లు ఆరోగ్యం మాత్రం షరా మామూలుగానే గుల్లవుతోంది. పండ్లు తదితర ఆహార పదార్ధాల విషయంలో పండించేటప్పుడు వాడే క్రిమి సంహారకాలు ఒక ఎత్తైతే, వాటిని భద్ర పరిచే క్రమంలో నిల్వ చేయడానికి మరింత విష పూరితమైన మందులను వాడేస్తున్నారు. అలాంటి పండ్లను తీసుకున్న మానవాళికి తలెత్తే ఆరోగ్య సమస్యలు చాప కింద నీటిలా తెలియకుండా మన ఆరోగ్యాన్ని కబళించేస్తున్నాయి. రోజుకి ఓ యాపిల్‌ తింటే చాలు డాక్టర్‌ని దూరంగా పెట్టొచ్చు అంటుంటారు. కానీ ఆ యాపిల్‌ తినడం వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. టోటల్‌గా ఈ విష పూరితమైన ఆహారంతో మానవ శరీరం మెల్ల మెల్లగా విషతుల్యం అయిపోతోంది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు