ఒత్తిడికి చిక్కొద్దు, చిత్తుగా ఓడించెయ్యాలంతే - ..

pressure

క్యాన్సర్‌, హెచ్‌.ఐ.వీ వంటి వ్యాధుల కన్నా ఘోరంగా మనుషుల ప్రాణాల్ని కబళించేస్తోంది మానసిక వ్యాధి. ఈ వ్యాధికి ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి. వయసుతో సంబంధం లేని వ్యాధి ఇది. ప్రధానంగా యువత ఈ వ్యాధికి బలైపోతోంది. స్కూలు స్థాయి నుంచే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. ఉద్యోగం చేసే స్థాయికి వచ్చేసరికి ఆ ఒత్తిడి వెయ్యి రెట్లు పెరిగిపోతోంది. ఇదివరకటి రోజుల్లో స్కూలు స్థాయిలో, కాలేజీ స్థాయిలో ఒత్తిడి ఉండేది కాదు. ఉద్యోగం, వ్యాపకం ఓ బాధ్యతతో కూడుకున్నవిగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు. పలు రకాలుగా మనిషిని ఒత్తిడి వేధిస్తోంది. దాన్ని జయించే క్రమంలో కొత్త మార్గాలను అన్వేషిస్తుంటే, వాటివల్ల ఒత్తిడి తగ్గకపోగా మరింత పెరుగుతోంది. కొందరు ఒత్తిడి నుండి దూరం అయ్యే క్రమంలో చెడు అలవాట్లకు కూడా బానిసలు అవుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం కాదు కదా, అది మన మనసుని మరింత కుంగదీసేస్తుంది. ఈ ఒత్తిడిని జయించేది ఎలా? మానవాళికే ముందు ముందు పెను సవాలుగా మారనుంది. కాబట్టి ఒత్తిడిని జయించడం ఎలాగో తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ అత్యవసరం.

ఒత్తిడిని ఛేదించేందుకు ప్రస్తుతం యువత సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని టైం పాస్‌ చేయాలని అనుకుంటోంది. కానీ అలా చేయడం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. అలాగే టీవీ చూస్తూ ఒత్తిడిని దూరం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అది కూడా తప్పేం కాదు కానీ, టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో మనం ఎంచుకున్న ప్రోగ్రాంస్‌ ఎంతవరకూ మన ఒత్తిడిని దూరం చేయగలవనే ఆలోచన చేయడం ముఖ్యం. అలాగే కుటుంబ సభ్యులతో కాస్సేపు సరదాగా గడిపినా ఒత్తిడి నుండి దూరం కావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కిచెన్‌లో గడపడం, కలసి భోజన చేయడం లాంటివి చేసినా ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చు. అంతేకానీ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనుషులకీ, సమాజానికి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకోవడం సరైన పద్ధతి కాదు. అలాగే బుక్‌ రీడింగ్‌ ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలా రీడ్‌ చేసే సబ్జెక్ట్‌ మనకి ఇంట్రెస్టింగ్‌గానూ, ఎంటర్‌టైనింగ్‌గానూ ఉండేలా చూసుకోవాలి. ఫలానా బుక్కే చదవాలి. ఫలానా పనే చేయాలి అని ఒక్కటే టార్గెట్‌ని పెట్టుకోకూడదు. ఇంత టైం అని ఫిక్స్‌ చేసుకుని వివిధ రకాల పనుల్లో మన మెదడును ట్రాన్స్‌పర్‌ చేయిస్తూ ఉంటే ఒత్తిడి నుండి తేరుకోవడం చాలా తేలిక. అలాగే కొన్ని కొన్ని చిట్కాలను ఉపయోగించి కూడా ఒత్తిడి నుండి దూరం కావచ్చు. 

ఉదయం లేవగానే కాస్సేపు యోగా, వ్యాయామంలాంటివి చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. ఎలాంటి ఒత్తిడినైనా ఈ రకంగా జయించవచ్చు. అలాగే ఇష్టమైన ఆహారం, స్వయంగా వండుకుని తినడంలోనూ రిలాక్స్‌డేషన్‌ ఉంటుంది. ఖచ్చితమైన ప్రణాళికలు గమ్యాన్ని చేరువ చేస్తాయి. దురలవాట్లు గమ్యాన్ని దూరం చేస్తాయి. మంచి చెడులపై విచక్షణ లక్ష్య సాధనలో ఎంతో ఉపయోగపడుతుంది. సముద్రం లోతుల్ని, ఆకాశం ఎత్తుల్నీ చూసేస్తున్నాం. ఆఫ్ట్రాల్‌ మనం సృష్టించుకున్న ఒత్తిడిని జయించలేమా! 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు