18-08-2017 నుండి 24-08-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. గతంలో చేపట్టిన పనులకు సమాధానం చెప్పవలసి వస్తుంది, పూర్తిగా సిద్ధంగా ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో సాధ్యమైనంత మేర వివాదాలకు అవకాశం ఇవ్వకండి. పనులకు సంభందించిన విషయాల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇష్టమైన వారిని కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. సర్దుబాటు విధానం అవసరం అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. బద్ధకం వీడి పనులను ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. పెద్దలను కలిసే ఆస్కారం కలదు వారితో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం మంచిది.చిన్న చిన్న విషయాలకే హైరానాపడకండి. స్థిరమైన ఆలోచనలు చేసినచో మేలుజరుగుతుంది. 


మిథున రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాలకు అధికప్రాధాన్యం ఇస్తారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేయకపోవడం వలన ఇబ్బందులను తప్పించుకోగలుగుతారు. శ్రమను కలిగి ఉంటారు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పకపోవచ్చును. అనుభవజ్ఞులసూచనలను వినండి, వారిసూచనలు పాటించుట చేయండి . నిదానంగా పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది ఓపిక అవసరం. ఉద్యోగంలో నూతన అవకాశాలకు ఆస్కారం కలదు.   


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద సోదరులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. గతంలో రావల్సిన ధనం కొంతమేర చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన , తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. ప్రయాణాలు వాయిదావేయుట సూచన. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. వ్యాపారస్థులకు మాటవిషయంలో నిదానం అవసరం, వివాదములకు దూరంగా ఉండుట మంచది. 



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. పెద్దలనుండి ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక స్పష్టమైన విధానాలు కలిగిఉండుట మేలు. ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబంలో ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. విందులు,వినోదాల్లో పాల్గొనాలనే ఆకాంక్ష ఉంటుంది,ఆదిశగా అడుగులు వేస్తారు. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇవ్వడం చేస్తారు. 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో సమయపాలన పాటించుట ఉత్తమం. కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలు , నడవడిక వివాదాలకు దారితీస్తాయి. ఆరోగ్యంలో ఎటువంటి మార్పు ఉండదు. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనభరుస్తారు,భోజనసౌఖ్యం ఉంటుంది. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది,మానసికశ్రమను పొందుతారు. ప్రయాణాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చును కావున వాయిదావేయుట మంచిది. వ్యాపారస్థులకు కొంత నిదానం అవసరం సమయానుకూలంగా నడుచుకోండి. 


తులా రాశి :  ఈవారం మొత్తంమీద అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు.; జీవితభాగస్వామితో వివాదాలు పెరుగుతాయి, మీ తీరు ఇంకా ఇబ్బందిని కలిగిస్తుంది. బండుమిత్రులతో సమాలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. కొంతమేర ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. అధికారులతో కలిసి నూతన పనులను చేపడుతారు,వారితో సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది, పెట్టుబడులకు అవకాశం ఉంది. 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. గతంలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన దృష్టిని సారించుట మంచిది.పెద్దల అభిప్రాయాలు గౌరవించుట వలన మేలుజరుగుతుంది. 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి చేయుప్రయత్నాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చును.  ప్రతిపనిలో నిదానం అవసరం. కొన్ని కొన్ని విషయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్థి విషయంలో సమస్య ఒక కొలిక్కి వస్తుంది.   



మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారుల సూచనల మేర మాత్రమే ముందుకు వెళ్ళండి,సొంత నిర్ణయాలు వద్దు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త అవసరం లేకపోతే వారివిషయంలో ఆందోళన తప్పకపోవచ్చును. వ్యాపారస్థులకు బాగుంటుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొన్ని కొన్ని నిర్ణయాల్లో సీక్రెసీ కలిగి ఉండుట మేలు.   




కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద పెద్దలనుండి ఆశించిన మేర సహకారం, గౌరవం పొందుతారు. చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. చేపట్టు పనులకు సంభందించిన విషయాల్లో ప్రణాలిక అవసరం. సమయం విషయంలో సరైన ఆలోచనలు చేయుట ద్వార పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. మాటలు పొదుపుగా వాడుట వలన విభేదాలు తగ్గుతాయి. నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు పెద్దల నుండి సహకారం లభిస్తుంది.


మీన రాశి :  ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనల్లో స్పష్టత కలిగి ఉండుట వలన లబ్దిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతమేర ఊరట పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో కాస్త సర్దుబాటు విధానం మంచిది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. సరదగా గడుపుటకు ఇష్టపడుతారు. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకండి. మిత్రులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు