రాం గోపాల్ వర్మ.....ఈపేరే ఒక సంచలనం...ఈయన వ్యక్తిత్వం ఒక ప్రపంచం.....సినిమాలతో, వాటి హిట్లూ, ఫ్లాపులతో సంబంధం లేని ఒక క్రేజ్ ఈయన సొంతం...ఆయన దారిని అనుసరించేవాళ్ళు కొంతమందైతే, ఆయన హావభావాలను అనుకరించేవాళ్ళు మరికొందరు....ఇది హాస్యానికైతే కొంచెం తేలికే కావొచ్చు కానీ, సీరియస్ గా రాం గోపాల్ వర్మ అనే పాత్రనొకదాన్ని సృష్టించి, ఆయనను అనుకరిస్తూ, పాత్రను నడిపించడమనేది కష్టమే..ఆ పాత్రకు డైలాగులు రాయడం ఇంకా కష్టం....ఎందుకంటే, ఆర్జీవీ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకునే రాం గోపాల్ వర్మ....ఎప్పుడేం మాట్లాడతారో, దేనికెలా స్పందిస్తారో ఎవ్వరికీ అర్థం కాదు....ఆయనది అహం అంటామో, అదో ప్రపంచమనే అంటామో మనిష్టం....ఆయన అది కూడా పట్టించుకోరు....అయన సినిమాలకి ఎంచుకునే ఇతివృత్తాలూ, పాత్రలూ, నటీనటుల ఎంపికా, పూర్తిగా ఆయన సొంతం...వీటిలో ఆయన మీద ఎవరి ఒత్తిడీ, ఎవరి మార్కెట్ ఏమీ ఉండదు....
ఇవన్నీ ఆర్జీవీ గురించీ, ఈ అహం షార్ట్ ఫిలిం గురించి కూడా వర్తిస్తాయి....ఆర్జీవీ పాత్ర చాలా వరకు పండిందనే చెప్పవచ్చు....ఇంకా ఎమీ లేకుండానే ఏదో ఉన్నట్టు చూపించే ఆర్జీవీ సినిమాల స్టయిల్ ను కూడా బాగా చూపించారు...ఇంకా చెప్పడం కంటే ఈ షార్ట్ ఫిలిం చూసి మీరే ఎంజాయ్ చెయ్యవచ్చు...