ఎన్టీయార్‌ 'బిగ్‌బాస్‌' వర్సెస్‌ రానా 'నెం.1 యారీ' - ..

NTR big boss Vs RANA No:1 yari

తెలుగు బుల్లితెరపై రెండు సంచలనాత్మక షోస్‌ బుల్లితెర వీక్షకులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంత ఎక్కువగా టీవీలకు బుల్లితెర వీక్షకులు కనెక్ట్‌ అయ్యేలా చేస్తున్నాయి ఆ రెండు ప్రోగ్రామ్స్‌. వీటిని హోస్ట్‌ చేస్తున్న యంగ్‌ హీరోలిద్దరూ ఎవరికి వారే అన్నట్టుగా ఆ ప్రోగ్రామ్స్‌ని నడిపిస్తున్నారు. అందులో ఒకరు 'భళ్ళాలదేవుడు' దగ్గుబాటి రానా అయితే, ఇంకొకరు యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌. దగ్గుబాటి రానా 'నెం.1 యారీ' అంటూ వారానికోసారి ప్రేక్షకుల్ని పలకరిస్తోంటే, ఎన్టీయార్‌ 'బిగ్‌బాస్‌' ప్రతిరోజూ బుల్లితెర వీక్షకులకు దర్శనమిస్తూనే ఉంది. వారాంతాల్లో మాత్రం రెండ్రోజులపాటు ఎన్టీయార్‌ ఆ ప్రోగ్రామ్‌కి విపరీతమైన 'కిక్‌' అందిస్తున్నాడు. మరి టిఆర్‌పి రేటింగుల పరంగా ఏ షో ముందంజలో ఉంది? యావరేజ్‌ రేటింగ్స్‌ ఏ షో ఖాతాలో ఎక్కువగా ఉన్నాయి? రెండు షోస్‌ మధ్య వ్యత్యాసాలేంటి? వంటి విషయాల్ని తెలుసుకుందాం.

బిగ్‌బాస్‌ - వీకెండ్స్‌లో బిగ్‌బాసే

వారాంతాల్లో ఎన్టీయార్‌ కనిపించేసరికి షో స్వరూపమే మారిపోతోంది. తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎన్టీయార్‌ బీభత్సంగా అలరించేస్తున్నాడు. ఎన్టీయార్‌ ఎప్పుడొస్తాడా? అని బుల్లితెర వీక్షకులు వారంలో ఐదు రోజులపాటు ఎదురుచూడాల్సి వస్తోంది. హౌస్‌ మేట్స్‌ అయితే ఎన్టీయార్‌ని వారంలో రెండు రోజులపాటు చూసి ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతుండడం జరుగుతోంది. కానీ ఓ చిన్న సమస్య. అదేమిటంటే ఈ షో వివిధ రూపాల్లో ఆన్‌లైన్‌లో దర్శనమిస్తోంది. కొందరు ఈ షోని కాపీ చేసి, సోషల్‌ మీడియాలో ఉంచేస్తున్నారు. హాట్‌స్టార్‌ వంటి వాటిల్లోనూ బిగ్‌బాస్‌ షో దొరుకుతోంది. కాబట్టి కొందరు అటువైపుకు మళ్ళడంతో షోకి రియల్‌గా దక్కాల్సినదానికంటే తక్కువ టీఆర్‌పి రేటింగ్స్‌ దక్కుతున్నాయి. అవి కూడా తక్కువేం కాదు, బుల్లితెర సంచలనాల స్థాయిలోనే ఉన్నాయి. యావరేజ్‌గా చూసుకుంటే వీకెండ్స్‌లో 7.7, మిగతా రోజుల్లో 5.47 రేటింగ్స్‌ దక్కుతున్నాయి ఈ షోకి. ఈ రెండిటి యావరేజ్‌ తీసుకుంటే 7 కంటే తక్కువ రేటింగ్‌ బిగ్‌బాస్‌కి దక్కుతోందని చెప్పవచ్చు.

నెం.1 యారీ - రియల్‌ నెంబర్‌ వన్‌

బుల్లితెర రియాల్టీ షోలలో ఇదొక గేమ్‌ ఛేంజర్‌. ఇటువంటి షోస్‌ ఇంతకు ముందు చాలా వచ్చినా, రానా మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ఇద్దరు సెలబ్రిటీల్ని తీసుకొచ్చి, వారితో రకరకాల ఆటలు ఆడిస్తున్నాడు. ఆద్యంతం ఈ షో రసవత్తరంగా సాగుతోంది. దాంతో రానా 'నెం.1 యారీ' షో కోసం ఎదురుచూస్తున్న బుల్లితెర వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పైగా, ఛానల్‌లో వచ్చే షో తప్ప, ఇంకెక్కడా అంటే ఆన్‌లైన్‌లో ఇది దొరకకుండా నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా టిఆర్‌పి రేటింగ్స్‌ 'నెం.1 యారీ'కి విపరీతంగా వస్తున్నాయి. యావరేజ్‌ తీసుకుంటే 7.35గా ఉంది.

ఏదేమైనా బుల్లితెరపై ఇద్దరు యంగ్‌ హీరోలు తమ ప్రోగ్రామ్స్‌తో చెలరేగిపోతోంటే బుల్లితెర వీక్షకులకు లభించే ఆ కిక్‌ అద్భుతః అనాల్సిందే.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు