1) ఆన్ లైన్ గేంస్....పిల్లల మెదడుకు పదును పెడతాయి....వాళ్ళు వాటిలో దూసుకుపోతూంటే చూసే పెద్దవాళ్ళకు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంటుంది...పిల్లలు అడిగిన టాబ్స్, స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చి ఇలాంటి గేంస్ ని ఎంకరేజ్ చేయాలి.....వారిలోని క్రీడాస్ఫూర్తికీ, సాంకేతిక ప్రగతికీ, సృజనాత్మకతకీ దోహదపడాలి.....
2) ఏమాత్రం శారీరక వ్యాయామం లేని ఇలాంటి ఆటలను ప్రోత్సహించడం క్రీడాస్ఫూర్తి కానేకాదు....పైగా వీటికి బానిసలైపోయి, గంటలు గంటలు వెచ్చించడం వల్ల ఊబకాయానికి దారి తీస్తోంది...కళ్ళకు చిన్నతనంలోనే ఇబ్బందులొస్తున్నాయి. వాటిలో లీనమైపోయి, గెలవాలనే పట్టుదలతో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. ఆత్మహత్యలకు దారి తీస్తోన్న బ్లూ వేల్ లాంటి గేం కూడా ఇలా వచ్చిందే....వాటి జొలికి అస్సలు వెళ్ళనివ్వ వద్దు...
పై రెండింట్లో ఏది కరెక్ట్..