డ్రీమర్స్‌ - 'కల' చెదిరిపోయినట్టేనా.? - ..

great destination

అమెరికా యానం చాలామందికి ఓ 'కల'. దాన్ని సాకారం చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అదొక గ్రేట్‌ డెస్టినేషన్‌గా మారిపోయింది భారతీయులకి. ప్రపంచంలోని వివిధ దేశాలతో పోల్చితే, అమెరికా వెళ్ళాలనుకునే భారతీయుల ఆలోచనలు ప్రత్యేకంగా వుంటాయి. వేలాదిమంది, లక్షలాది మంది భారతీయులు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికా సంస్కృతీ సంప్రదాయాలతో వారంతా మమేకమైపోయారు కూడా. అయితే, డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక భారతీయులకి అక్కడ అభద్రతాభావం పెరిగిపోయింది. భారతీయులనే కాదు, అమెరికాలో నివసిస్తున్న ఇతరదేశాలకు చెందినవారందరి పరిస్థితీ ఒకేలా తయారైంది. అమెరికా, అమెరికన్లకు మాత్రమే అన్న నినాదాన్ని అధ్యక్ష ఎన్నికల్లోనే ట్రంప్‌ గట్టిగా వినిపించారు. అయితే, అమెరికా లాంటి దేశంలో ఆ నినాదం పనిచేయదని చాలామంది భావించారు. కానీ వారి ఆలోచనలకు విరుద్ధంగా ట్రంప్‌, తాను చేయాలనుకున్నదే చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'డ్రీమర్స్‌'కి చెక్‌ పెట్టేశారాయన. 

డ్రీమర్స్‌ అంటే, అమెరికాకి చిన్న వయసులోనే తల్లిదండ్రులతోపాటే వెళ్ళి, అక్కడే స్థిరపడిపోవడం. వీరికి ఇమ్మిగ్రేషన్‌ నుంచి వెసులుబాటు కల్పిస్తూ, బారక్‌ ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేయడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది. సుమారుగా 20 వేల మంది భారతీయులు ట్రంప్‌ తాజా నిర్ణయంతో ఇబ్బంది పడతారనేది ఓ అంచనా. అయితే డ్రీమర్స్‌ మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంకో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దానికి కారణం అమెరికాలోని చాలా రాష్ట్రాలు ట్రంప్‌ నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తుండడమే. అయినప్పటికీ కూడా ట్రంప్‌ దేశాధ్యక్షుడు గనుక, డ్రీమర్స్‌కి భవిష్యత్తులో ప్రమాదం పొంచే ఉందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు డ్రీమర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌, భవిష్యత్తులో ఇంకెంత ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారోనని అక్కడి భారతీయులు, ఇతర దేశాలకు చెందినవారు ఆందోళన చెందడం సహజమే. 

డ్రీమర్స్‌కి కొంత సానుకూల అంశమేమిటంటే, ప్రతిష్టాత్మక సంస్థలు ట్రంప్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. డ్రీమర్స్‌ కావొచ్చు, వలసదారులు కావొచ్చు దేశంలో కొంత మేర వారికి భరోసా ఉండాల్సిందేనని లేనిపక్షంలో అమెరికా భవిష్యత్‌ అగమ్యగోచరమవుతుందని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అభివృద్ధిలో అమెరికన్ల కంటే కూడా వలసదారులదే ఎక్కువ పాత్ర అని ఆయా సంస్థలు నొక్కి వక్కాణిస్తుండడం గమనించదగ్గ అంశం. ఏదేమైనా డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక, అమెరికాని డెస్టినేషన్‌గా భావించే భారతీయుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. అమెరికాకి ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాలను భారతీయులు ఎంచుకోవడం జరుగుతోంది.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు