స్ట్రెస్‌ తగ్గిం'చైనా'! - ..

stress

ఒత్తిడిని తగ్గించుకోవడమెలా? అనే ప్రశ్న చాలా సర్వసాధారణంగా వినిపిస్తోంది ఇటీవలి కాలంలో. ఎల్‌కేజీ విద్యార్థి నుంచి 70 ఏళ్ళ వృద్ధుడిదాకా స్ట్రెస్‌కి ఎవరూ అతీతం కాదిప్పుడు. మరి స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? అనంటే, దానికి అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చేశాయిప్పుడు. స్ట్రెస్‌ బాల్‌, స్పిన్నర్స్‌, ఇంకా ఏవేవో వస్తువుల్ని స్ట్రెస్‌ తగ్గించుకోవడానికి వినియోగిస్తున్నాం. చాలావరకు ఇవన్నీ చైనా మేడ్‌ వస్తువులే. వీటితో స్ట్రెస్‌ తగ్గుతుందా? లేదా? అని ఆలోచిస్తే అవి కొంతవరకు మాత్రమే రిలీఫ్‌ ఇస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ మార్కెట్‌పై చైనా ఉత్పత్తులు దాడి చేయడం ఎప్పటినుంచో ఉన్నది. స్ట్రెస్‌ రిలీఫ్‌ కోసమంటూ సరికొత్త ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి చైనా నుంచి తరలి వస్తున్నాయి. దురదృష్టవశాత్తూ వాటికి బానిసలైపోవడం ద్వారా కొత్త స్ట్రెస్‌ మళ్ళీ మన నెత్తినే వచ్చిపడుతోంది. స్ట్రెస్‌ లేదా ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సులభమైన మార్గాలు ఎన్నో అందుబాటులో ఉన్నాసరే, వివిధ రకాల ఉత్పత్తులను వాడటం ఓ స్టైల్‌గా మారిపోయిందిప్పుడు. 

పిల్లలైనా, పెద్దలైనా ఒత్తిడిని తగ్గించుకోవడానికి సింపుల్‌ సొల్యూషన్స్‌ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోనే చాలా కన్పిస్తాయి. కాస్సేపు గార్డెనింగ్‌ చేస్తే, దానికన్నా స్ట్రెస్‌ రిలీఫ్‌ ఇంకోటుండదు. కాస్సేపు ధ్యానం, సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేయడం ఇవన్నీ స్ట్రెస్‌ తగ్గించేవే. కానీ దురదృష్టవశాత్తూ ఈ మార్గాల్లో స్ట్రెస్‌ తగ్గించుకోవడం నామోషీగా భావిస్తున్నాం. నిజానికి స్ట్రెస్‌ తగ్గించుకునే ఉపకరణాలతో కొత్త సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటారు వైద్య నిపుణులు. సంప్రదాయ మార్గాల్లో స్ట్రెస్‌ తగ్గించుకోవడం కంటే ఉత్తమం ఇంకేమీ లేదని వారు చెబుతారు. వైద్య నిపుణులు సూచించినప్పటికీ వాటిని మనం ఫాలో అవకపోవడం ఘోర తప్పిదమే అవుతుంది కదా! భారతదేశంపై దండెత్తాలనీ, యుద్ధం చేయకుండానే భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనీ చైనా చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఉత్పత్తుల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోన్న మాట వాస్తవం. అలాగని చైనా వస్తువుల్ని మనం నిజంగానే ఉపయోగించకుండా ఉంటామా? అంటే అదీ జరగదు. 

మేక్‌ ఇన్‌ ఇండియా అనే ప్రమోషన్‌ ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఎంత గట్టిగా జరుగుతున్నప్పటికీ అది కేవలం ఓ పబ్లిసిటీ స్టంట్‌గానే మారుతోంది. చైనా ఉత్పత్తులు అత్యంత తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి పట్ల ఆకర్షణ నానాటికీ పెరుగుతూ వస్తోంది. టెలికాం రంగం సహా వివిధ రంగాల్లో ఉత్పత్తులు చాలావరకు చైనావే ఉంటున్నాయి. ఆఖరికి స్ట్రెస్‌ తగ్గించే ఉత్పత్తులూ చైనావే అవుతుండడం శోచనీయం. భారతీయతే ఓ పెద్ద స్ట్రెస్‌ రిలీఫ్‌. సంప్రదాయ పద్ధతుల్ని ఆశ్రయిస్తే ఎవరైనా స్ట్రెస్‌ నుంచి చాలా తేలిగ్గా బయటపడొచ్చు. వృధా ఖర్చు, అనవసరపు ఆరోగ్య సమస్యలు - వీటిని దృష్టిలో పెట్టుకుని చైనా స్ట్రెస్‌ రిలీఫ్‌ ఐటమ్స్‌ నుంచి దూరంగా ఉండటం మేలు. 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు