1) భారతదేశం సర్వమత సమ్మేళనం, ఎవరి మతాల పండుగలు వారు నిర్వహించుకునే స్వేచ్చ వారికుంది. ఈ క్రమంలో ఒక్కో సారి రెండు మతాల పండుగలు కలిసి వచ్చినప్పుడు, ఒకరి ఆచారాలకు మరొకరు అడ్డు రాకుండా శాంతియుత వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే ప్రోత్సహించాలి, బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ, మేం చెప్పినట్టు వినకపోతే మా బాధ్యత కాదని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు.
2) వినడానికీ, అనుకోవడానికీ ఇలాంటివి బాగానే ఉన్నా, ఆచరణలోకొచ్చేటప్పటికి, చాలా సున్నితమైన అంశం, రెండు మతాల సంబరాలు కలిసి జరుపుకునేప్పుడు కచ్చితంగా ఏదోక అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుంది, అల్లరి మూకలు మధ్యలో ప్రవేశించి, రెచ్చగొట్టే ప్రమాదం కూడా ఉంటుంది ఒకరి సంబరాలకు మరొకరు కొంచెం పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం చెప్పడం ఏమాత్రం తప్పు కాదు....అదే కరెక్ట్.
పై రెండింట్లో ఏది కరెక్ట్...?