అమ్మాయీ కొంచెం జాగ్రత్తోయీ! - ..

ladies be carefull

అతి సర్వత్రా వర్జయేత్‌! అంటారు. పస్తుత పరిస్థితుల్లో ఆడవారికి మగవారితో సమానంగా అన్ని హక్కులూ దక్కాలనే భావంతో అమ్మాయిలకు విపరీతమైన స్వేఛ్చ లభిస్తోంది. దాంతో హద్దులు మీరి అమ్మాయిలు అనేక అనర్ధాలను కొని తెచ్చుకుంటున్నారు. అనర్ధం జరిగిపోయాక బాధపడితే దక్కేది నష్టమే కానీ లాభం ఉండదు. అందుకే కొంచెం ఆలోచించి ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తే బావుంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తల్లితండ్రులు చిన్నతనం నుండే జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పిల్లలే కదా అని అబ్బాయిలతో స్నేహం లైట్‌ తీస్కోకూడదు. ఆ విషయంలో మితిమీరి వ్యవహరించకుండా, కొన్ని పరిమితులుంటే మంచిది. అలాగే వారి శరీరం పట్ల చిన్నతనం నుండే అవగాహన కల్పించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. తెలిసినవారైనా, తెలియనివారైనా అనవసరంగా అమ్మాయిల శరీర భాగాలను తడుముతుంటే అనుమానించాలి. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిది మొదటి బాధ్యత. అమ్మాయి తన పట్ల ఇతర వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాలు తల్లితో చెప్పుకోగలిగే స్వేచ్ఛ, వెసులుబాటు ఆమెకి కలిగించాలి. తల్లి, కూతురుతో ఫ్రెండ్లీగా మెలగడంతో ఇవి సాధ్యపడతాయి. ఎలాంటి విషయమైనా తల్లితో తాను పంచుకోగలననే భరోసా అమ్మాయికి కల్పించాలి. అంతేకానీ బిజీ లైఫ్‌ అంటూ అమ్మాయిల్ని తమకు నచ్చిన దోవలో నడిచేందుకు ప్రేరేపించకూడదు.

ఇక కాలేజీ పిల్లల విషయంలో రకరకాల అవగాహనలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ యువత నేరాల పాలిట పడుతూనే ఉంది. రీసెంట్‌గా జరిగిన ఎన్నో గాథలు తెలిసిన వారే తమ పాలిట శత్రువులై ప్రాణాల్ని హరించేసిన ఘటనలు ఎన్నో మనసుని కలిచి వేస్తాయి. చిన్నతనం నుండే అమ్మాయిలకు మగవారి పట్ల, అపరిచిత వ్యక్తుల పట్ల కొంతైనా అవగాహన ఉంటే ఒక వయసుకు వచ్చే సరికి ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను కొంతలో కొంతైనా బేరీజు వేసుకోగలగే సామర్ధ్యం అమ్మాయిలకు ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ అపాయాల బారిన పడితే అమ్మాయిలు తమని తాము రక్షించుకునేందుకు పిప్పర్‌ స్ప్రే, ఎలక్ట్రిక్‌ షాక్‌ స్టిక్స్‌ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని తమ వెంట ఉంచుకొనే ప్రయత్నం చేయాలి. స్నేహితుల పట్ల, బంధువుల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల వల్ల కన్నా, అయిన వారి నుంచే అతి ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. అందుకే అమ్మాయిలు ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదు. 

వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాల్లో చిక్కుకుని, అనవసరమైన ఆకర్షణలకు లోనై తమ నిండు జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో తల్లితండ్రులు తమ పిల్లల వైఖరిని ముందుగానే గుర్తించాలి. సౌమ్యంగా వారు అర్ధం చేసుకునేందుకు తగిన మార్గాలు అన్వేషించాలి. మృగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సింది ప్రభుత్వాలే. అయితే బలి పశువులు అవుతోంది ఆడపిల్లలే కాబట్టి తగు జాగ్రత్తలు తప్పని సరి. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు