జయజయదేవం - డా . ఎస్ . జయదేవ్ బాబు

చిత్రగుప్తుడు : ఇతడు జీవితాంతం అబద్ధాలు చెబుతూ గడిపాడు ! ఇతడికి తగిన శిక్ష విధించండి యమ ప్రభో !
నరుడు : నాకు పుట్టిన పిల్లలందరూ ఆడపిల్లలే ! వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేశాననుకున్నారూ??

-----------------------------------

 


కామినీ పిశాచి : నన్నెవరో మోహిస్తున్నారని అనుమానంగా ఉందే !
మోహినీ పిశాచి : నాక్కూడా అలాంటి అనుమానమే ! నన్నెవరో కామిస్తున్నారు !
(ముళ్ళపూడి వారికి క్షమాపణలతో )

-----------------------------------------------

 

కొడుకు : సంతోషించు నాన్నా ! నీకు కొడుకుగా పుట్టినందుకు నిన్ను పున్నామ నరకం నుండి తప్పిస్తాను !!
తండ్రి : నిన్ను కొరగాని కొడుకుగా కన్నందుకు , ముందు నేననుభవిస్తున్న ఈ నరకం నుండి తప్పించు ! తర్వాత ' పున్నామ ' సంగతి ఆలోచిద్దాం.!!

--------------------------------------------------

 

వినాయకుడు : తమ్ముడూ..భూ ప్రదక్షిణ చేశావు కదా..ఏమిటీ విశేషాలూ?
సుబ్రహ్మణ్యుడు : ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం ! ఓజోన్ పటలంలో పెద్ద చిల్లు.!!

-------------------------------

 

ఒకడు : ధనవంతుల డబ్బును బీదలకి పంచడం అంటే ఏదైనా ఉదాహరణ చెప్పు? ?
మరొకడు :  నలభై మంది దొంగలు దోచి దాచిన సొమ్మును ఆలీబాబా గోనెసంచుల్లో  లో తెచ్చి బీదవాళ్ళకి పంచిపెట్టాడన్న కథని నువ్వినలేదా?

-----------------------------------

 

గోపిక ఒకటి : ఒకరి చీరలు మరొకరు కట్టుకున్నాం గమనించావా?
గోపిక ఇంకొకటి : క్రిష్ణుడు చీరలని తిప్పిచ్చేప్పుడు మనం చూసుకోలేదు! చేతులెత్తి దణ్ణం పెడుతూ కళ్ళు మూసుకున్నాం కదా!

----------------------------------

 

ఒక గుండు : విమాన వెంకటేశ్వరుడ్ని దర్శనం చేసుకున్నావా? ఏమని దణ్ణం పెట్టుకున్నావ్?
రెండో గుండు : నెమ్మదిగా నా ఇష్టం వచ్చినంత సేపు నిలబడి నిన్ను సేవించుకున్నానయా......కృతజ్ఞతలు స్వామీ....అని!!

----------------------

 

ముని : నేను అస్ఖలిత బ్రహ్మచారిని !
ఊర్వశి : అందుకే ఇంతదూరం నీకడకొచ్చానయ్యా మగడా !!

------------------------

 

చిన్న పురోహితుడు : ప్రధాన పురోహితుల వారికి కోపం వచ్చి నిన్ను తిట్టారా, ఏమని??
మరో చిన్న పురోహితుడు : గుడి మెట్ల మీద కండువా పరిచి కూచే అని...పోరా అని...!
చి.పు : కారణం ?
మ.చి.పు. : మంత్రాలు తప్పుగా చదివినందుకు..

---------------------------------

మంత్రి : ఇతడ్ని శిక్షించాలి ప్రభో ! మీరు శత్రు రాజుకి రాయమన్న లేఖలో వీడు తప్పు రాశాడు ప్రభో !
రాజు : మనం రాయమన్నదేమిటి? వీడు రాసిందేమిటి??
మంత్రి : " మీతో సంధి, సమ్మతమా" అని రాయమంటే, " మీరో పంది, సమ్మతమా?" అని రాశాడు ప్రభో!!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి