1.చిత్ర సమీక్షలు పూర్తిగా సమీక్షకుల దృష్టి కోణానికి సంబందించినవి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎవరికైనా వుంది. వాటి ద్వారా చిత్ర దర్శకులు , నిర్మాతలు తమ లోపాలను తెలుసుకుని సవరించుకోవాలి. అంతేకానీ ప్రశంసలను మాత్రమే కోరుకోవడం , విమర్శలు రాస్తే ద్వేషాలు రగలడం సమంజసం కాదు.
2.కోట్లు గ్రుమ్మరించి , సాంకేతిక నిపుణుల , కళాకారుల శ్రమ , ప్రతిభతో నెలలు శ్రమించి నిర్మించిన సినిమాలపై సమీక్షలు రాసేప్పుడు ఇష్టం వచ్చినట్టు రాసేయకుండా సంయమనంతో రాయాలి. సమీక్షల ఆధారం గా ఒక్కోసారి సినిమాల భవిష్యత్తు తలక్రిందులవుతుంది. దాని మీద ఆధారపడిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకమవుతుంది.
పై రెండింట్లో ఏది కరెక్ట్...?