బాత్..బాత్..బాద్..బాద్.... - సిరాశ్రీ

bat...bat...bad...bad

"హైదరాబాద్"

"సికింద్రాబాద్" అనే పేర్లు ఎలా వచ్చాయో వివరించే సరదా కథ.

పూర్వం 400 ఏళ్ళకు ముందు భాగ్యనగరంలో అసదుద్దీన్, అక్బరుద్దీన్ అనే ఇద్దరు ముస్లిం సోదరులు, మూసీనది పక్కన బాతులు మేపుకుంటూ జీవనం చేసేవారు.

ఆ ఇద్దరు సోదరులు ప్రతిరోజూ చాలా దూరం తిరుగుతూ బాతులు కాసేవారు. ఒకనాడు వారు బాతులు కాస్తుండగా, ఉన్నట్లుండి ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది..

ఆ ఉరుముల శబ్దానికి బాతులు చెల్లాచెదరై, మూలమూల ప్రాంతాలకు  వెళ్ళిపోయాయి.

అన్నదమ్ములిద్దరూ అష్టకష్టాలు పడి బాతులన్నిటినీ ఇంట్లోని దొడ్డిలోకి చేర్చగలిగారు.

పెద్దవాడైన అసదుద్దీన్ కి సందేహం వచ్చి బాతులన్నిటినీ లెక్కించగా,

ఒక్క బాతు తక్కువగా ఉంది.

వెంటనే అన్నదమ్ములిద్దరూ తప్పిపోయిన బాతును వెతికి పట్టుకోవడానికి బయలుదేరారు.

అసదుద్దీన్ భాగ్యనగరం వైపు, అక్బర్ నేటి సికింద్రాబాద్ ఉన్న ప్రాంతం వైపు వెళ్ళారు.

ఈ ఇద్దరికీ కూడా తెలుగు సరిగ్గా రాదు.

అసదుద్దీన్ భాగ్యనగరం అంతా తిరుగుతూ "హేదిరాబాతు" "హేదిరాబాతు" అంటూ వెతికి, వేసారిపోయి, తమ్ముడున్న చోటికి వచ్చాడు.
|
అప్పుడే అక్బరుద్దీన్ కి బాతు దొరికింది.

వాడు సంతోషంతో అరుస్తూ "సిక్కిందిరాబాతు" "సిక్కిందిరాబాతు" అంటూ, తనకు దొరికిన బాతుని అన్నకు సంతోషంగా ఇచ్చాడు.

వాళ్ళిద్దరూ బాతుని తీసుకుని ఇంటికి వెళ్ళారు.

కాలక్రమేణా  ఆ అన్నదమ్ములు పలికిన మాటలే కొద్దిగా మార్పు చెంది, "హైదరాబాద్" "సికింద్రాబాద్" గా స్థిరపడ్డాయి..