జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

గాడిద : దొంగ దూరినప్పుడు నువ్వు మొరగలేదేం..?
కుక్క : వాడు శునకసూక్తం చదివాడు ! మెచ్చి, నోర్మూసుకున్నాను..!
గాడిద : ఆ సంగతి నువ్వు నాకు చెప్పద్దూ ? అరిచి చావు తన్నులు తిన్నాను !!


పొట్టిపాము : కప్పకి పూజలు చేసి ఊరేగిస్తూంటే, నువ్వు సంబరపడిపోతున్నావే?
పొడుగు పాము : ప్రజల నమ్మకం ! వానలు కురుస్తాqయని !!
పొట్టిపాము : వానలు కురిస్తే?
పొడుగుపాము : కప్పలు వృద్ధి పొందుతాయి ! మనం వాటిని  పట్టి విందు చేసుకోవచ్చుగా !!


సిపాయి : పొరుగు రాజ్యం నుంచి తాఖీదు వచ్చింది.
రాజు : చదువు !
సిపాయి : తాఖీదులో ఏమీ లేదు ప్రభో !
మంత్రి : నిమ్మరసంలో రాసుంటారు. తాఖీదుకి సెగ చూపించు, అక్షరాలు కనిపిస్తాయి !
సిపాయి : అలాగే !
( మంట సెగ చూపిస్తూండగా, తాఖీదు తగలబడి కాలిపోతుంది , సిపాయి బిక్కమొహం వేస్తాడు ! ఇంతలో )
రెండవ సిపాయి : పొరుగు రాజ్యం నుంచి ఇంకో తాఖీదు వచ్చింది !
రాజు : చదువు !
రెండవ సిపాయి : మొదటి తాఖీదుని అలక్ష్యం చేసి తగులబెట్టినందుకు మీమీదికి దండెత్తి వస్తున్నాం...ఖబడ్దార్...!!


నీటిబొట్టు : నన్ను పట్టుకోవడం, నీ వశం కాదు ! తలుచుకుంటే నవ్వాగడం లేదు !!
తామరాకు : మొత్తం నీమీదే తేలుతుంటాను ! నిన్ను పట్టుకోవడమెందుకులే !!


రాజు : మంత్రీ, ప్రజల నుండి పన్ను వసూలు చేశారా ?
మంత్రి : ప్రజల సొమ్ములో సగం మీరు తిని, మిగతాది చక్రవర్తికి కడుతున్నారు గనుక, నేరుగా చక్రవర్తి గారికే పన్ను కడతామంటున్నారు ప్రజలు....రాజా...!


 

రాకుమారి : నాన్నా మొదటి రోజున, మీ అల్లుడు గారు, నా జడపట్టీ బాగుందన్నారు. ! నిన్న అది మాయమైంది ! నిన్నటి రోజున , నా వడ్డాణం నచ్చిందన్నారు ! ఈరోజు అది కనిపించలేదు !!
తండ్రి రాజు : అల్లుడు గారిని అనుమానించడం భావ్యం కాదమ్మా, !
రాకుమారి : నా అనుమానం మీ అల్లుడి మీద కాదు ! ఆయన గారి ప్రియురాలి మీద నాన్నగారూ!


 

రామయ్యశెట్టి : వారానికోసారి , నువ్వు రాజుగారి కొలువులో , పద్యం పాడి, కానుకలు తెచ్చుకుంటావ్ కదా ? ఆ కానుకలు ఏమయ్యాయి?
కవిరాయుడు : ప్రతిసారీ దొంగలు అటకాయించి దోచుకుంటారు !
రామయ్యశెట్టి : రాజుగారికి ఫిర్యాదు చెయ్యకపొయ్యావా?
కవిరాయుడు : ఆ దొంగలు రాజుగారు నియమించిన వాళ్ళని తెల్సింది..!




వింజామర కన్య : బాగా వెడల్పైన ఒక కొత్త సిమ్హాసనాన్ని రాజుగారు చేయిస్తున్నారటగా ?
రెండో వింజామర కన్య : ష్...మెల్లగా మాట్లాడు ! రాజుగారు, పట్టమహిషితోబాటు, చిన్న రాణులను కూడా తన పక్కన కూర్చోపెట్టుకోబోతున్నారట!!


 

సేనాధిపతి : శత్రురాజు, మనందరి తలలు నరికి , కోట గుమ్మానికి తోరణాలు కడతాడని ప్రతిజ్ఞ చేశాడట ప్రభో!
ప్రభువు : వెంటనే మన కోట గుమ్మాన్ని తొలగించండి ! తోరణాలు ఎక్కడ కడతాడో చూద్దాం !!
 

 


రాజు : చప్పట్లు చరిస్తే వెంటనే రావాలని తెలియదా ?
భటుడు : నేను గంట కొడితే వచ్చే భటుడ్ని రాజా ! చప్పట్లు కొడితే వచ్చే భటుడు, ఈరోజు శలవు పెట్టాడు !!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి