'ఐ లైక్ ఇట్ థిస్ వే' ఇండిపెండెంట్ ఫిలిం సమీక్ష - మాధవ్

I Like It This Way - An Independent Film by Prema Malini Vanam || Archana || Shivakumar

డైలాగ్ విత్ ప్రేమ అంటూ తన విలక్షణమైన ఇంటర్వ్యూలతో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న " ప్రేమ " గారు , బిగ్ బాస్ ఫేం ' అర్చన ' సన్ యుక్తంగా నిర్మించిన ' ఐ లైక్ ఇట్ దిస్ వే ' స్వతంత్ర చిత్రం విడుదలైన అతి తక్కువ రోజులలోనే వ్యూస్ మైలు రాళ్ళను దాటుకొంటూ దూసుకుపోతోంది...అర్చన నటనా ప్రతిభ, ప్రేమ గారి రచనా పాటవం , గంగాధర్ అద్వైత సంభాషణా చాతుర్యం కలబోసి రూపొందించిన స్వతంత్ర చిత్ర సమీక్ష ఈవారం గోతెలుగు పాఠకులకు ప్రత్యేకం......

ప్లస్ పాయింట్స్ : హీరో- హీరోయిన్ల నటన....సంగీతం, సంభాషణలు, పాటలు, స్క్రీన్ ప్లే...మొత్తానికి అన్నీ...!
మైనస్ పాయింట్స్...: చిత్రం ' నిడివి '
మరీ యాభై నిముషాలు తీయకుండా ఇదే సబ్జెక్టుని కుదించి తీస్తే బాగుండేది...
మొత్తంగా చెప్పాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్!

ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " ఇది 56 నిముషాల ఇండిపెండెంట్ ఫిలిం మాత్రమే అనుకుంటే పొరపాటే ... ఎన్నో బుర్రల్లో ఉన్న ఆలోచనల చీకటి పొరలను తొలగించే వెలుగు కిరణం . కన్నీళ్లకు జెండెర్లు ఉండవు , ప్రేమకు అవధులు ఉండవు , కండిషన్స్ పెడుతూ ఉంటె అది ప్రేమే అవ్వదు అని సున్నితంగా చెప్పిన ఇండిపెండెంట్ ఫిలిం ఈ ""ఐ లైక్ ఇట్ థిస్ వే ". కాలం మారుతుంది కాలం తో పాటు మనుసులు మారాలి . పురుషాధిక్యం ,స్త్రీ ఆధిక్యం అంటూ ఏమి లేకుండా మనుషులు ,మనసులు వాటి ఊసులు ఇవే కనిపిస్తాయి ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " ఇండిపెండెంట్ ఫిలిం లో .రెండే పాత్రలు తమ అంతరంగాలని పంచుకుంటూ 56 నిముషాలు ప్రయాణిస్తాయి .

ఇందులో ప్రేమ ఉంటుంది ..తమ మనసుకి నచ్చిన వారు దొరికారు అనే సంతృప్తి ఉంటుంది ..ఎక్కడ వెళ్ళిపోతారో అనే బాధ ఉంటుంది .ప్రేమ ఉన్న చోట బాధ ఉంటుంది అని ఎవరో కవి అన్నట్టు ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " లో కూడా రెండు ట్రావెల్ అవుతూ ఉంటాయి . జీవితం మీద క్లారిటీ ఉండి తమ లైఫ్ పార్టనర్ ఎలా ఉంటె తమకు నచ్చుతుందో అనే క్లియర్ ఐడియా ఉన్న రెండు మెచూర్డ్ మనసుల కధే ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే ". .సున్నితమైన కథను తీసుకున్న డైరెక్టర్ ప్రేమమాలిని వనం కధకు తన డైరెక్షన్ విజన్ తో న్యాయం చేసారు . చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని కూడా నటీనటుల నుండి రాబట్టడం లో డైరెక్టర్ ప్రేమ మాలిని సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి .తాను రాసుకున్న కాదని సోషల్ పాయింట్ ని జోడించి చక్కని నరేషన్ ఇచ్చి ఆడియన్స్ కి "ఐ లైక్ ఇట్ థిస్ వే " రీచ్ అయ్యేలా చేసారు డైరెక్టర్ . నటీ నటులు గ అర్చన ,శివ ఇద్దరు స్టోరీ ని తమ యాక్టింగ్ తో రసవత్తరంగా ప్రెజెంట్ చేసారు . అందమైన ఫ్రేమ్స్ తో కెమెరా పనితనం లో సాయి సంతోష్ తన బాధ్యతను నిర్వర్తించాడు .56 నిముషాలు ఇద్దరు మనుషుల మధ్య సంభాషణలు రాయడం అంటే కత్తి మీద సామే ,ఆలా అని డైలాగ్స్ కామెడీ గ ఉండకూడదు సబ్జెక్టు ని డిస్టర్బ్ చెయ్యకూడదు ఇవి దృష్టిలో పెట్టుకొని చక్కటి నాచురల్ వె లో డైలాగ్స్ ని అందించాడు గంగాధర్ అద్వైత . ఆసక్తిగా చూస్తే ఈ "ఐ లైక్ ఇట్ థిస్ వే " ఇండిపెండెంట్ ఫిలిం మన ఆలోచన ధోరణిని కొంచం ఐన మార్చేస్తుంది అనడం లో సందేహం లేదు ..ఒక్క మాటలో చెప్పాలంటే "ఐ లైక్ ఇట్ థిస్ వే " అనేది మనసు కు మనిషి కి మధ్య కొత్త దారి!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి