వార ఫలం (30 ఆగష్టు - 05 సెప్టెంబర్) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు మొదట్లో పొందిన లాభాలను చివరి వరకు కొనసాగించే ప్రయత్నం గట్టిగా చేయుట మంచిది. శుక్ర, శని, ఆదివారాలలో ఇష్టమైన వారిని కలుస్తారు. నచ్చిన పనులను చేపట్టుట మూలాన లాభం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచిగా ఉంటుంది. సోమ, మంగళ వారాల్లో చేపట్టే పనుల పట్ల సరైన అవగాహన కలిగి ఉండుట తప్పక మేలుచేస్తుంది. బంధుమిత్రులతో నిదానంగా వ్యవహరించుట మంచిది. బుధ, గురువారాల్లో నచ్చని వార్తను వినే అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు బాధించే  అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు ఉండే అవకాశం ఉంది. శ్రమను కలిగి ఉంటారు. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల నిదానంగా ఉండుట సూచన. ఉద్యోగంలో మాత్రం తప్పని సరిగా నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది. కుటుంభంలో సభ్యుల మూలాన పనిభారం ఉంటుంది. నిదానంగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది.       

వృషభ రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. శుక్ర, శని, ఆదివారాల్లో ఆశించిన ఫలితాల్లో ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది. అనారోగ్యం మిమ్మల్ని భాదించే అవకాశం ఉంది జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో ప్రయత్నించిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగు ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళుట ఉత్తమం. బుధ, గురువారాల్లో ఆందోళనలు పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో చేయు ప్రయత్నాలు కలిసి వస్తాయి. నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు.  శ్రమించుట చేత పనులను సాధించుటకు అవకాశం కలదు. ప్రయత్నకార్యములలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. పెద్దల సహకారం అవసరం. మాతృవర్గం నుండి సహకారం అందుటకు అవకాశం కలదు. ధర్మసంభంద కార్యక్రమాలలో పాల్గొనుట తప్పక మేలుచేస్తుంది. వారం మొత్తంమీద ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. అవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయుట మంచిది.  

మిథున రాశి
ఈవారం ఆశించిన ఫలితాలు నిదానంగా చేతికి అందుతాయి. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. తలపెట్టిన పనులలో అభివృద్దిని కలిగి ఉంటారు. సోమ,మంగళ వారాల్లో పనులలో నిదానం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు వద్దు, నిదానంగా ఆలోచించి అడుగులు వేయుట కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో బాగుటుంది. మనోదైర్యంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు ఆస్కారం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు. చేపట్టిన పనులకు సంభందించిన లాభంను పొందుటకు అవకాశం ఉంది. సంతానమూలక సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండుట మంచిది. కలహాములకు మాత్రం దూరంగా ఉండుట మంచిది. ఉద్యోగంలో వచ్చు ఫలితాలు కొంత నిరాశను కలిగించే అవకాశం ఉంది జాగ్రత్తగా నడుచుకోండి. అధికారులకు అనుగుణంగా ఉండుట నిర్ణయంలో స్పష్టత అవసరం. ఖర్చులు పెరుగు సూచనలు కలవు. ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అందరితో సర్దుబాటుగా ఉండుట అనుకూలమైన ఫలితాలను కలగజేస్తుంది.  

కర్కాటక రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. శుక్ర, శని, ఆదివారాల్లో బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు పొందుతారు. పనులలో మాటపట్టింపులకు పోకండి. వ్యాపారస్థులు నిదానంగా వ్యవహరించుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సోమ, మంగళ వారాల్లో భోజనసౌఖ్యంను పొందుతారు. చేపట్టిన పనులలో ఉత్సాహంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది, మిత్రులనుండి సహకారంను పొందుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు. జాగ్రత్తలు పాటించుట మంచిది. ప్రయాణాలలో గాయములు అయ్యే అవకాశం కలదు, కావున ప్రయాణాలను వాయిదా వేయుట మేలు. గతంలో మీకున్న మంచి పరిచయాల మూలాన లాభంను పొందు అవకాశం ఉంది. శుభకార్యములలొ పాల్గొనుట మూలాన ఖర్చులు పెరుగు అవకాశం కలదు. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు, సరైన ఆలోచనలు చేయకపోతే ప్రయాసను పొందు ఆస్కారం ఉంది.

సింహ రాశి
ఈవారం కొంత ప్రణాళిక బద్దంగా నడుచుకుంటే తప్పక మంచి ఫలితాలను పొందు అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో బంధువులతో చేయు పనులు మంచి ఫలితాలను కలుగజేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయుటకు ఆస్కారం కలదు. సోమ, మంగళ వారాల్లో అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టు పనుల మూలాన అకారణమైన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో భోజనసౌఖ్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో ముందుకు వెళ్తారు సమయానికి పనులను పూర్తిచేయుట వలన గుర్తింపును పొందుతారు. వారంలో పనిభారం ఉండుట మూలాన సమయానికి భోజనం చేయుట మంచిది. సంచారం చేయుట మూలాన శారీరక శ్రమను పొందుటకు అవకాశం ఉంది. ధనంకు సంభందించిన విషయాల్లో ఆచ్తూచి వ్యవహరించుట మంచిది. బంధువులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది. అకారణంగా భయంను పొందుటకు అవకాశం కలదు. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు విందులలో పాల్గొంటారు. 

కన్యా రాశి
ఈవారం మీరు కొద్దిగా శ్రమను పొందితే చాలు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో లాభాలు మీ స్వంతం అవుతాయి. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయత్నకార్యములను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనులను పూర్తిచేయుటలో ఆసక్తిని కలిగి ఉంటారు. బంధు ప్రీతిని కలిగి ఉంటారు. సోమ, మంగళ వారాలలో బంధువులతో కలిసి చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలను కలుగజేయుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు.  సౌఖ్యంను పొందుతారు. బుధ, గురువారాల్లో మాత్రం అనుకోని ఖర్చులు కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించుట మేలు. మనోదైర్యంను కలిగి ఉండి నూతన ప్రయత్నాలు ఆరంభించే అవకాశం కలదు. ఉద్యోగంలో చిన్న చిన్న సర్దుబాటులు అవసరం. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు.  సౌఖ్యానికి ప్రాముఖ్యతను ఇస్తారు.

తులా రాశి
ఈవారం గతంలో మీరు ఎదురుచూసిన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది, అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మేలుచేస్తుంది. సోమ, మంగళ వారాల్లో ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. బంధువల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. ఇష్టమైన పనులను చేపడుతారు. బుధ, గురువారాలలో ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. విందులలో పాల్గొనేందుకు ఇస్టంను ప్రదర్శిస్తారు. అధికంగా సంచారం చేయుట మూలాన శ్రమను పొందుతారు. మంచి పనులు చేయుట మూలాన కీర్తిని పొందుతారు. గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. గృహలాభంను పొందుతారు. ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండుట ఉత్తమం. 

వృశ్చిక రాశి
ఈవారం ప్రతిపనిలో నిదానం అవసరం. ఆచితూచి అడుగులు వేయుట మంచిది. శుక్ర, శని, ఆది వారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో తప్పని సరిగా జాగ్రత్తలు పాటించుట మేలు. అజీర్తి మూలక ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ వారాలలో ఉద్యోగంలో పనిభారంను కలిగి ఉంటారు. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది నిదానంగా వ్యవహరించుట మంచిది. బుధ, గురువారాల్లో పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. రాజకీయ వ్యవహరాలలో ఆసక్తిని ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.  తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. చేపట్టిన పనులలో ఫలితాలు నిదానంగా వచ్చుటకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకు వెళ్ళుట అవసరం. కోపంను తగించుకోవడం మూలాన మేలు జరుగుతుంది. అధికారులతో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు.

ధనస్సు రాశి
ఈవారం మీరు పెద్దల సూచనలు పాటించుట మూలాన మేలుజరుగుతుంది. అలాగే ఓపికను కలిగి ఉండి ముందుకు వెళ్ళుట ఉత్తమం. శుక్ర, శని, ఆదివారాల్లో సమాజంలో చేపట్టిన పనుల వలన మంచిపేరును పొందుతారు. మానసికంగా ఆనందంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన లాభాలను కలిగి ఉంటారు. సోమ, మంగళ వారాలలో అనారోగ్య సమస్యల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. బుధ, గురువారాల్లో కుటుబంలో స్వల్ప వ్యతిరేకతలు కలుగుటకు అవకాశం ఉంది. సర్దుబాటు విధానం అవలంబించుట మంచిది. ఉద్యోగంలో శ్రమను పొందుతారు. అధికారుల మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. పనిలో తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనలను ఇతరులు వ్యతిరేకించే అవకాశం కలదు. చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు రాకపోవడం నిరుత్సాహంను పొందుతారు. రాజకీయ వ్యవహరాలలో ఆసక్తిని కలిగి ఉంటారు. వాటిలో పాల్గొనే అవకాశం కలదు. వ్యతిరేక వర్గం నుండి సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త.  

మకర రాశి
ఈవారం మీరు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండుట, అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. శుక్ర, శని, ఆదివారాలలో కుటుబంలో సౌఖ్యంను పొందుతారు. ఇతరులకు సేవ చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు, తోటివారు మీ వలన సహకారంను పొందుతారు. సోమ, మంగళవారాలలో చేసిన పనుల మూలాన గౌరవాభివృద్ధిని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. మానసికంగా ధృడంగా ఉంటారు సంతోషంను పొందుతారు. బుధ, గురువారాల్లో అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. మోకాళ్ళనొప్పుల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. అనుకోని వార్తలను వినుట మూలాన కొంతమేర భాదను కలుగు అవకాశం కలదు. అనుకోని సంఘటనలు కలుగుట మూలాన తీరని సంతాపమును పొందుటకు అవకాశం కలదు. అకారణంగా భయంను పొందుటకు అవకాశం కలదు.  నిదానంగా వ్యవహరించుట మేలు. అధికారుల మూలాన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చేయండి, లేకపోతే నష్ట పోయే అవకాశం ఉంది. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. కులాచారముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు, పాటించే ప్రయత్నం చేస్తారు.

కుంభ రాశి
ఈవారం మీరు ప్రతి పనిని బాగా ఆలోచించి చేయుట మూలాన అనుకున్న ఫలితాలను పొందు వీలుంది. శుక్ర, శని, ఆదివారాలలో కొంత భిన్నమైన ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం కలదు.  ఓపికను వహించుట మంచిది. సోమ, మంగళ వారాలలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. కుటుబంలో సౌఖ్యంను కలిగి ఉంటారు. నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బుధ, గురువారాలలో ధనాదాయం పెరుగుటకు ఆస్కారం కలదు. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. అందరిలోను గుర్తింపును కలిగి ఉంటారు. పనులలో ఫలితాలు వెంటనే రాకపోతే నిరుత్సాహం కూడదు. ఇతరులకు సేవచేయుట మూలాన మంచి పేరును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. అధికారులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో స్వల్ప పనిభారంను పొందుటకు అవకాశం కలదు. అభివృద్దిని కలిగి ఉంటారు దూరప్రదేశముల నుండి అనుకూలమైన వార్తను వింటారు. విందులలో వినోదాలలో పాల్గొనే అవకాశం కలదు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు.  

మీన రాశి
ఈవారం మీరు సంతోషంను పొందుతారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ఫలితము వచ్చుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఉత్సాహంను కలిగి ఉండి ముందుకు వెళ్తారు. విజయంను పొందుటకు అవకాశం కలదు. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. షాపింగ్ కోసం సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. శుక్ర, శని, ఆదివారాలలో కొంత పనుల ఒత్తిడి మూలాన ఆందోళన పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ వారాలలో ఒకవార్త కొంత భాధకు గురిచేస్తుంది. నిదానంగా వ్యవహరించుట మంచిది. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు. బుధ, గురువారాలలో కుటుంబంలో సౌఖ్యంను పొందుతారు. నచ్చిన పనులను చేపడుతారు. లాభం ఉంటుంది. మీ వలన తోటివారు సహాయంను పొందుటకు ఆస్కారం కలదు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. చర్చల పట్ల మక్కువను కలిగి ఉంటారు. విద్యా సంభందమైన విషయాల్లో ఆసక్తిని కలిగి ఉంటారు. పెద్దల ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళుట తప్పక అనుకూలిస్తుంది. కోపంను కలిగి ఉంటారు. శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతి పనిలో ఒకటికి రెండు సార్లు అలోచించి మొదలు పెట్టుట వలన మంచిది. మంచి ఫలితాలు కలుగుతాయి. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి