మీ ప్రాణం మీది కానే కాదు - ..

leave and let leave

బతికేందుకే అవకాశం ఉంది. నా ఇష్టం నా ప్రాణం నేను తీసుకుంటానంటే కుదరదు. బతికి సాధిస్తే దేశం నీ గొప్పతనాన్ని గుర్తిస్తుంది. చచ్చి సాధించాలనుకుంటే నీ సొంత మనుషులు కూడా నీ మరణం పట్ల జాలి చూపించరు. ఆత్మహత్య మహాపాపం. ఆ మహా పాపాన్ని చాలా సింపుల్‌గా అన్వయించేసుకుంటున్నారు. విచక్షణ లేకుండా చిన్న కారణాలకే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ ఆత్మహత్యల సంఖ్య ఎక్కువయిపోయింది. ఒక్క క్షణం ఆలోచిస్తే, ముందు జీవితం ఎన్నో నేర్పిస్తుంది. కానీ ఆ ఒక్క క్షణాన్ని నిర్లక్ష్యం చేస్తూ తమ జీవితంతో పాటు, తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు కూడా రోడ్డున పడేలా చేస్తోంది నేటి యువత. ఎవరిచ్చారు నీ చావును నీవు కొని తెచ్చుకునే హక్కు. చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవంటారు. కానీ ప్రస్తుతం చావును మాత్రం తన చేతుల్లోకి తీసేసుకుంటున్నారు.

మరో పక్క ఐదారు తరగతుల నుండే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పిల్లలు ప్రతిభ చూపిస్తున్నారు. అలాంటి వారిని చూస్తే ముచ్చటేస్తోంది. మరో పక్క అన్నీ తెలిసి, జ్ఞానం సంపాదించిన యువతేమో ఇలా క్షణికావేశానికి గురై అనవసరంగా నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. ఇలాంటి వారిని చూస్తే బాధేస్తోంది. ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే, ముందు ముందు కొత్త జీవితం ఎంతో ఉంటుందనీ గమనించాలి. చిన్నతనం నుండే ధైర్యాన్ని నూరి పోయాలి పెద్దలు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వెన్ను ధైర్యం పెద్దలు, పిల్లలకి కల్పించాలి. ఎన్ని కష్టాలైనా రావొచ్చుగాక. రెండు కాళ్ళూ, రెండు చేతులూ లేనివాళ్ళు కూడా అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. అలాంటి తరుణంలో మార్కులు తక్కువ వచ్చాయననీ, ప్రేమలో మోసపోయామనీ ప్రాణాలు తీసుకుంటే అది సిగ్గుమాలిన విషయం.

తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఐదుగురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అందర్నీ కలచివేసింది. ఇలాంటి సందర్భాల్లో జాలి చూపడం కాదు, పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చదువు ప్రాణాలు తీసేస్తుందన్న విషయాన్ని విద్యా సంస్థలు గుర్తించాలి. విద్య మనిషిలో వివేకాన్ని పెంచాలి, వివేకం కోల్పోయి ఆత్మ న్యూనతతో తనువు చాలించుకునేలా చేసేది విద్య ఎలా అవుతుంది? విద్య అమ్మకం వస్తువుగా మారడమూ ఈ బలవన్మరణాలకు గల ముఖ్య కారణాల్లో ఒకటి. అలాగే చదువు వివేకం పెంచడానికి సరదాగా సంపాదించే జ్ఞానం కావాలి కానీ, ప్రాణం మీదకి తీసుకొచ్చే ఒత్తిడి ప్రేరకం కాకూడదు. అలాగే ప్రేమ జీవితాన్ని కోరుకుంటుంది, ప్రేమ ఎప్పటికీ బలిని కోరదు. ప్రేమ పేరుతో ఆత్మహత్య అనే న్యూస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా మీడియా సంయమనం పాఠించాలి. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి