వెంకి శాస్త్రి : నీకు రాజుగారు మాన్యాలు రాసిచ్చారటగా? ఏ వూళ్ళో?
పంటశర్మ : వెంకటగిరిలో !!
వెంకిశాస్త్రి : గోవింద...గోవిందా!!
.....................................................
మంత్రి వర్యుడు : రాజా ఇకనుంచి మీరీ సామంత రాజ్యాన్ని ఏలనక్కర లేదు. పన్నులు, శిస్తులు కట్టనక్కర లేదు.
రాజు : ఎంతటి శుభవార్త చెప్పావ్ మంత్రీ! ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యం?
నమ్మలేకున్నాను !
మంత్రివర్యుడు : మిమ్మల్ని తొలగించి, సిమ్హాసనం నేను అధిష్టించాలని తీర్మానించాను ..!
...........................................
రాజు : ఆ మహా మాంత్రికుడికి మన అంత:పురంలో బస కల్పించి ఆశ్రయమివ్వడం పెద్ద తప్పైపోయింది !
మంత్రి : అతడు మన శత్రురాజు సిమ్హాసనాన్ని మటు మాయం చేసి మన ముందుంచుతాడని చెప్పాడు, నమ్మాము.
రాణి : మన అంత:పురాన్నీ, కోటనీ మాయం చేసి మనల్ని బికారీలుగా ఈ అడవిలో నిలబెట్టి , మాయమౌతాడని తెలిసుంటే, వాడిని కోటలోకి అనుమతించే దాన్ని గాను..!
............................................
గణపతి : స్వామీ, " శ్రీ గణపతిని సేవింపరారే..." అని కీర్తన పాడారే, నన్ను సేవించను, ఎవ్వరూ రాలేదే..?
గణపతి : ఆ గీతా మాధుర్యం ఆస్వాదిస్తూ నన్ను నేను మరిచి పోయాను స్వామీ ! పైగా ఆ గణపతి పేరే నాది కూడా కనుక, మీరు పాడిన గీతం నా గురించే అనుకున్నాను స్వామీ !
త్యాగ రాజ స్వామి : గణపతీ....!
గణపతి : స్వామీ...!
త్యాగ రాజ స్వామి : నిన్ను కాదు నాయనా....అయన్ని...!!
......................................
రాకుమారి : రాకుమారా....నీవన్నీ అచ్చు గుద్దిన ఆడ పోలికలే ! కట్టు, బొట్టు, నడక, కంఠం, నిన్నెవరూ మగ పురుషుడనుకోరు...!
రాకుమారుడు : మరి నిన్ను కలుసుకోవాలంటే మాటలా?
రాకుమారి : ఐతే నన్నెప్పుడు లేపుకు పోతావ్?
రాకుమారుడు : ఇప్పుడే....వచ్చేయ్ నాతో....!
( కొన్నేళ్ళు గడిచాక, సుదూర ప్రాంతంలో )
రాకుమారి : ఇన్నేళ్ళు గడిచాయ్, నువ్వు వేషం తీసేదెప్పుడు? మనం పెళ్ళి చేసుకునేదెప్పుడు...?
రాకుమారుడు : అది జరగదు రాకుమారీ ! నేను నపుంసకుడ్ని !!
...................................
మహారాజు : నేను హిమాలయముల కేగి, అక్కడ ఒక సాధువు ఇచ్చిన వన మూలిక తిని నిత్య యవ్వనుడుగా మారి తిరిగి తిరిగి వచ్చాను...!
మహారాణి : చాలా సంతోషం , ! నేను ముసలి దాన్నై పోయాను ! మీకు దాంపత్య సుఖం ఎలా ఇవ్వ గలనో ఏమో...?
మహారాజు : చింతించకు రాణీ, నీకు ఆరుగురు చెల్లెళ్ళు కదా ? చివరి చెల్లెల్ని నాకు కట్ట బెట్టి నువ్వు సుఖంగా విశ్రాంతి పొందు...!!
.................................................
మిత్రుడు : కష్ట సుఖాలు కావడి కుండలు ! కాస్త ఓర్పు వహించు , కష్టాలు అవే తొలగి పోతాయి!
మిత్రుడి భార్య : మనింట్లో ఒక కావడి, రెండు కుండలున్నాయి. ముందు వాటిని అమ్మి, గింజలు కొనుక్కు రండి, గంజి తాగుతూ , ఓర్పు వహిస్తూ , కూచుందాం గాని...!!
.......................................
రాజు : నాకు ముచ్చెమటలు పోసి నేను వొణికి పోతున్నాను రాణీ...!
రాణి : ఒరేయ్ బుల్లి యువ రాజా, నువ్వా యుద్ధ భేరీతో ఆడుకోవడం ఆపి, వేరే దేనితోనైనా ఆడుకో పో...!!
...............................
భటుడు : అంత:పురం అంతా నేల మీద జుట్టు రాలి వుందే! ఇంకో భటుడు : కంస రాజా వారు శ్రీ కృష్ణుడు తలపుకొచ్చినప్పుడల్లా జుట్టు పీక్కుంటారు, తెలియదా..?
.............................
రాక్షస యువకుడు : నాన్నా, నేను ఈ రాక్షస కన్యను గాంధర్వ వివాహమాడాను !
రాక్షస యువకుడి తండ్రి : సిగ్గు సిగ్గు ! రాక్షస వివాహమాడి వుంటే సంతోషించే వాడినిగా, నువ్వు నా కడుపున చెడ బుట్టావురా !!