జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

..

వైకుంఠపాళి పాము : ఈ రోజంతా ఆటలో నా నోట ఎవ్వరూ పడ లేదు ! అదే నా దిగులు ! సరే గానీ, నువ్వెందుకు బాధ పడ్తున్నావ్?

వైకుంఠ పాళి నిచ్చెన : ఆటలో అందరూ నన్నెక్కి తొక్కారుగా ఒళ్ళంతా నొప్పులు.!!

 

 

.....................................................


పరిచారిక : రాజు గారి మెడ లోని ముత్యాల హారాలన్నీ తీసేసీ వట్ఠి రుద్రాక్ష మాలతో పంపించారేమమ్మా?
మహా రాణి : ఈ రోజు కవితా సదస్సు ! అడ్డమైన వాళ్ళందరికీ రాజు గారు తన మెడ లోంచి, హారాలు లాగి బహూకరించేస్తారు! అందుకని!!

.....................................................

మహా రాజు : ఏం జోతిష్యం చెప్పావయ్యా? నేనీ కారాగారంలో తొయ్య బడతానని ఊహించ నైనా లేదు!
జ్యోతిష్యుడు : మీ గ్రహ స్థితి మారిందని చెప్పాను, మీకిది తప్పదు!!
మహా రాజు : నాకు సరే, నీకేమయింది? నువ్వూ నాతో బాటు కారాగారానికి వచ్చావ్?
జ్యోతిష్యుడు : నా గ్రహ స్థితి కూడా మారిందని ఇప్పుడర్థమయింది.!!

.....................................................
 


మంత్రి : రాణి గారు వీర మరణం చెందినట్లు వార్త వచ్చింది !
రాజు : నేను చెబుతూనే ఉన్నాను, నామాట వినక , యుద్ధ కవచం ధరించి, ఖడ్గం, విల్లూ, బాణాలతో యుద్ధానికి ఉరికింది!!
మంత్రి : ఆమె స్థానాన్ని భర్తీ చెయ్యడానికి, మీరు రణ రంగ ప్రవేశం చెయ్యండి రాజా!!
రాజు : ఆమె స్థానాన్ని భర్తీ చెయ్యడానికి ఎవరి వల్లా సాధ్యం కాదు ! నేను సరే సరి! వేరే సలహా ఏదయినా చెప్పు!!

.....................................................



గంధర్వ కిన్నెరులు : ఎవరయ్యా, నరుడివి...ఇక్కడ నీకేం పని?
నరుడు : భలే వారండీ ! నానా పుణ్య కార్యాలు చేసి మీ లోకానికి వచ్చాను!
గంధర్వ కిన్నెరుడు : అలానా? ఏదో వెతుకుతున్నారే?
నరుడు : రంభా, ఊర్వశి, తిలోత్తమలను! మరిక్కడికెందుకొచ్చాననుకున్నారూ?

 

.....................................................


రాజు : వార్తలు చదివిన ఈ భట్టు గార్ని ఉద్యోగం లోంచి తీసెయ్యండి !
మంత్రి : అతడు చేసిన నేరం?
రాజు : వార్తలన్నీ చప్పగా ఉన్నాయ్ ! రహ దారి ప్రమాదాల గురించి ఒక్క ముక్క వార్తయినా లేదు !

 

.....................................................


ఒక పౌరుడు : తలలు నరికి కోట గుమ్మానికి తోరణాలుగా కట్టారు గదా, ఆ తలల్లో ఒకటి మన రాజు గారి తల లాగా ఉందే?
ఇంకో పౌరుడు : నీకు తెలీదా...? ఇప్పుడు మనం శత్రు రాజు పరి పాలనలో వున్నాం!! అది మన రాజు గారి తలే!!

.....................................................
 

 
భటుడు : కోటలో వరద నీరు ప్రవేశించింది మహా మంత్రీ!
మంత్రి : ఆ నీటిని తోడించి కోట గోడల కవతల పోసెయ్యండి !
భటుడు : ఎక్కడి కోట గోడలు ? అవి వరదల్లో కొట్టుకు పోయాయి గదా...మేము చెప్పొచ్చింది ఆ సంగతే మంత్రి వర్యా....!

 

.....................................................


సఖి : నువ్వు తన ప్రాణంతో సమానమని చెప్పాడు గదా? అతడ్ని కాదన్నావేం?
మరో సఖి : అతడు తన ప్రాణాన్ని దేనికైనా ఒడ్డుతాడు ! భయమేసింది !!

 

.....................................................
 


మంత్రి : ప్రభూ...మనం తల పెట్టిన కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరపాలి రాజా !!
రాజు : తల పెట్టిన కార్యక్రమాలు శాంతి యుతమైనవి కదా? వాటిని అమలు జరపడానికి యుద్ధ ప్రాతిపదిక దేనికయ్యా స్వామీ ??

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు