చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaaram

మన తెలుగు సినిమా వాళ్ళు యమధర్మరాజుని ఎంతగా వాడుకున్నారో చెప్పలేము. ఆయన నిజంగా ఎదురుగా వచ్చేటప్పడికి ఎవరూ ఏమీ చేయలేరు. అందుకోసమని ఆయనమీద కసి ఎలాతీర్చుకోవాలా అని మన వాళ్ళందరూ ఆలోచించి ఓ సినిమా తీసేసి మన ఇష్టం వచ్చినట్లుగా ఆయనమీద జోక్కులూ అవీ వేసేసి నోటికి వచ్చినట్లు కథలు అల్లేశారు.ఈరోజుల్లో అయితే పురాణ కథలతో సినిమాలు రావడం పూర్తిగా ఆగిపోయినట్టే.. ఏ సినిమా చూసినా, ఓ అబ్బాయి, ఇద్దరమ్మాయిలు, ఓ లవ్ ట్రయాంగిలూనూ..  ఒక్కసినిమా కూడా అర్ధం అవదు.బహుశా ఇదంతా  generation gap  అంటారేమో

ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ వేసిన "యమగోల" తో ప్రారంభం అయిన ప్రస్తానం  జూనియర్ ఎన్.టి.ఆర్ వేసిన ' యమ దొంగ" దాకా వచ్చింది. ఈ మధ్యలో ఎన్నెన్నో రూపాలతో

యమధర్మరాజును చూపించారు. దేంట్లో చూసినా ఆయనని ఓ Comedy character గానే చూపించారు. మన పురాణాలు చదివితే యమ ధర్మరాజు ఒక విశిష్టమైన పాత్ర ఉన్నట్లుగా చదివాము. కాని మన సినిమా వాళ్ళు ఆయన్ని ఒక Laughing stock చేసేశారు. చూసేవాళ్ళుకూడా అదేదో జోక్ లాగా ఆనందిస్తూంటారు

 నాకు ఒక విషయం అర్ధం అవదు-- మన సినిమా వాళ్ళు హిందూ దేవుళ్ళు, దేవతలమీదే సినిమాలు తీస్తారు, వారినే ఒక Joker గా చిత్రిస్తారు.మిగిలిన మతాలలొ దేవుళ్ళు లేరా?

వాళ్ళని ఇలా చిత్రీకరించే ధైర్యం మనవాళ్ళు చేయలేరా? నెను వ్రాసెదిఅందరు దేవుళ్ళనీ గేలి చేయమనికాదు--అస్సలు ఏ దేముడుమీదైనా అలాంటి సినిమాలు తీయడం ఎందుకూ అని?

ఎవరి నమ్మకాలు వారికుంటాయి కదా, వారి భావాలు ఎందుకు hurt చేస్తారు?

అందరికీ గుర్తుండేఉంటుంది ఇప్పటికి ఎన్నిసినిమాల్లో ఎవరివో( అంటే ఏదో మతం వారిది) Religious feelings కించపరిచారని ఎన్నెన్ని ధర్నాలు చేశారో, ఎన్నెన్ని సినిమా హాళ్ళు ధ్వంసం చేశారో, ఎన్నెన్ని రాస్తా రొకోలు చేశారో, ఆ ఫలానా సినిమాలోని ఫలానా సీన్ తీసేసేదాకా వదిలి పెట్టలేదు.మరి ఇలాంటి స్పందన మనpoor యమధర్మరాజు గారిని గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరో తెలియదు !!

మన సెన్సార్ బోర్డ్ వాళ్ళకీ ఆయనన్నా, ఆయన సినిమాలన్నా చులకనే.ఇంకో మతం పేరైనా వచ్చిందంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు. అదే ఏ హిందూ దేవత మీదైనా ఎలాంటి dialogue అయినా సరే అది పాస్ అవుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఉంటే అందరికీUniform policy ఉండాలి, లేదంటారా, ఎవడికి కావల్సినట్ట్లుగా వాడిని తీసికోనీయండి. Secular policy అంటే అన్ని మతాలనీ సినిమాలలో చూపించనివ్వాలిగా. లేక ఒక్క హిందూ దేవతలనే గేలిచేయడం secularism, లోకి వస్తుందా? ఏమో? అయిఉండొచ్చు. మిగిలిన మతాల దేవుళ్ళని చూపించినప్పుడు వాళ్ళే ఏదో దేముళ్ళూ, వాళ్ళవే ప్రార్ధనలూ అన్నట్లుగా చూపిస్తారు. ఇన్ని రకాల Animation films గణేసుడి మీదా, హనుమంతుని మీదా వచ్చాయికదా, మరి మిగిలిన మతాల దెముళ్ళ గురించి మన పిల్లలకి తెలియచేయనక్కరలేదా?

ఇంకో సంగతి అయిఉండొచ్చుహిందూ దేముళ్ళకున్నంత Sense of humour మిగిలిన మతాల దేముళ్ళకి ఉండిఉండకపోవచ్చు.That does not mean, one can take them for granted. ఆ రోజుల్లో వచ్చిన మాయాబజార్ చూడండి, అందులో అన్ని పాత్రలనీ హుందాగా చూపించారు.ఈ క్రొత్త తరం లో ఇలాంటి తెగుళ్ళు చూస్తున్నాము కానీ ఇదివరకటి రోజుల్లోఏ దర్శకుడూ, ఏ నిర్మాతా దేముళ్ళతో " ఆడు" కోలేదు !ఇలా చేయడంవల్ల అందరికీ పాపం చుట్టుకుంటుందనీ, దేముడు క్షమించడనీ కాదు. అలా అంటే మన So called rationalists నామీద దండెత్తుతారు. దేముళ్ళమీద సినిమాలు తీయాలి, చిన్నా పెద్దా అందరికీ పురాణాల గురించి తెలియచేయాలి. మన తరంవాళ్ళకి ఆధ్యాత్మికత్వం అంటే చెప్పాలి.నా కోరిక ఏమిటంటే ఏ దేముడునీ ఓ buffoon లా చూపించొద్దని.

ఈ గొడవలన్నీ పడలేకేమో , దేవుడి సినిమాలు అస్సలు తీయడమే లేదు. పైగా  తీయాలంటే చాలా రిసెర్చ్ చేయాల్సుంటుంది. అంత ఓపికా, శ్రధ్ధా ఎవరికున్నాయి ? ఏదో ఓ మాయదారి అర్ధం పర్ధం లేని ఓ సినిమా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి తీయడం, ప్రపంచమంతా రిలీజు చేయడం, మొదటి వారంలోనే, అదృష్టం బాగుంటే, ఖర్చుపెట్టిన డబ్బంతా రాబట్టుకోవడం. అందుకే ఈ రోజుల్లో సినిమాలు, ఇదివరకటి రోజుల్లోలాగ , శతదినోత్సవాలూ వగైరా దాకా నిలవడం లేదు. ఎక్కడ చూసినా, పదోరోజూ, పన్నెండో రోజూ, కాకపోతే బారసాల లాగ ఇరవై ఒకటో రోజుకల్లా మాయం అయిపోతున్నాయి.

సర్వే జనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు